Daya Web Series అందుకే టాలీవుడ్‌కు దూరం.. ఆ విషయంలో ఆర్జీవి మాటలు గుర్తుకొచ్చాయి.. జేడీ చక్రవర్తి

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌ మంచి కంటెంట్‌తో వస్తున్న వెబ్ సిరీస్ దయా. ఈ వెబ్ సిరీస్‌లో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. దయా వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌లో నటించిన జేడీ చక్రవర్తి దయా గురించి వెళితే..

దర్శకుడు పవన్ సాదినేని కథ చెప్పిన తర్వాత నాకు గతంలో ఆర్జీవీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను అని జేడీ చకవ్రర్తి తెలిపారు.

JD Chakravarthy

దయా వెబ్ సిరీస్‌కు అతి పెద్ద బలం దర్శకుడు పవన్ సాదినేని. ఈ వెబ్ సిరీస్‌లో కథను బలంగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతీ క్యారెక్టర్ విభిన్నంగా, విలక్షణంగా ఉంటాయి. ప్రతీ ఆర్టిస్టుకు వారి పోషించిన పాత్రలు మంచి గుర్తింపును తెస్తాయి. శివ సినిమా తర్వాత నన్ను ఎలాగైతే జేడీ, బాహుబలి తర్వాత సత్యరాజ్‌ను కట్టప్ప అని పిలిచారో అలాగే ఈ సిరీస్ తర్వాత అలాంటి గుర్తింపు వస్తాయని నమ్ముతున్నాను. దయాలో ప్రతీ పాత్రను బలంగా రాశారు. ఈ సినిమాకు లొకేషన్లు, క్యారెక్టర్లు, స్క్రిప్టు బలంగా నిలుస్తాయి అని జేడీ చక్రవర్తి అన్నారు.

దయా సినిమాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా నటిస్తున్నాను. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వ్యాన్‌లో చేపలు తరలిస్తాను. ఈ కథకు పది నిమిషాలపాటు ఆ ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్‌గా అద్బుతంగా మలిచారు. ఫ్రీజర్ వ్యాన్‌లో మృతదేహాలు లభిస్తాయి. అయితే భయంతో పోలీసులకు చెప్పడానికి నిరాకరిస్తాడు. అంతలోనే మరో డెడ్ బాడీ లభిస్తుంది. ఆ క్రమంలో దయా ఏం చేశాడు? ఆ వ్యక్తుల మరణం వెనుక కారణం ఏమిటనేది సినిమా.

Daya web Series

తెలుగు సినిమాలకు నేను దూరం కాలేదు. తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటం లేదు. కానీ నేను నా మైండ్‌‌ను ప్రిపేర్ చేసుకోలేదు. అలాగని ఇతర భాషలంటే ఇష్టం కాదు. బాలీవుడ్ నాకు పొరుగింటి లాంటింది. ఎక్కడ తిరిగి వచ్చినా నేను తిరిగి ఇంటికి వస్తాను. నా బలం, బలహీనత తెలుగు సినిమా పరిశ్రమనే. అందుకే మళ్లీ నేను సినిమాలు తెలుగులో చేస్తున్నాను. డిమాండ్, సప్లై అనే సూత్రాన్ని నేను నమ్ముతాను. అయితే నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను చేయడం లేదని అబద్దం చెప్పను. కానీ నా వద్దకు వచ్చిన పాత్రలను నాకు నచ్చడం లేదు అని జేడీ చక్రవర్తి చెప్పారు.

ఓటీటీలో నటిస్తే స్టార్ డమ్ రాదనే విషయాన్ని నేను నమ్మను. ఒక సినిమా థియేట్రికల్‌గా రిలీజై హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సక్సెస్‌ను కలెక్షన్లు చెబుతాయి. ఓటీటీలో ఆ అవకాశం లేదు. అయితే ఎంత మంది చూశారనే వివరాలు నటుడికి మంచి గుర్తింపు తెస్తాయి. సినిమాలో వివరంగా కథ చెప్పడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ ఓటీటికి అలాంటి పరిమితులు లేవు. ఎంతైనా నిడివితో సినిమా కథను చెప్పవచ్చు అని జేడీ చక్రవర్తి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X