twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సీన్స్‌లో పోటీపడి నటించారు.. రెగ్యులర్ కథలు నచ్చవు.... జీతు జోసెఫ్ కామెంట్స్

    |

    'దృశ్యం' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో యంగ్ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'దొంగ'. ఈ సినిమాను తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై నిర్మాత రావూరి వి. శ్రీనివాస్‌ అందిస్తున్నారు. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జీతు జోసెఫ్‌ మీడియాతో ముచ్చటించాడు.

    మంచి స్క్రిప్ట్ కోసం..

    మంచి స్క్రిప్ట్ కోసం..

    2014లో 'దృశ్యం' సినిమా తెలుగులో రీమేక్‌ అయ్యి పెద్ద విజయం సాధించినప్పటినుండి తెలుగులో సినిమా చేయాలి అనుకున్నానని తెలిపాడు. మంచి స్క్రిప్ట్ కోసం ఇన్నిరోజులు ఎదురుచూశానని తెలిపాడు. అయితే ఇప్పుడు 'దొంగ' లాంటి సాలిడ్ కంటెంట్, అన్నిఎమోషన్స్ ఉన్నసినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్ అవడం నిజంగా హ్యాపీ అని పేర్కొన్నాడు. 'దొంగ' నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా అని, మంచి కాస్ట్‌ అండ్‌ క్రూ కుదిరిందని తెలిపాడు.

     అందరికీ కనెక్ట్ అవుతుంది..

    అందరికీ కనెక్ట్ అవుతుంది..

    ఈ సినిమాలో కనిపించే చిన్న‌ పిల్లాడి నుంచి ప్రతి క్యారెక్టర్‌కి ఒక పర్పస్ ఉండి కథలోఒక భాగం అయి ఉంటుందని అన్నాడు. కార్తీ నటన గురించి మనందరికీ తెలిసిందే.. ఈమద్యే 'ఖైదీ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని తెలిపాడు. ఈ సినిమాలో కార్తీ, జ్యోతిక మ‌ధ్య కీల‌క‌మైన‌ రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయని వెళ్లడించాడు. ఆ సన్నివేశాల్లో ఇద్దరు పోటీపడి నటించారని తెలిపాడు. అలాగే నికిలా విమ‌ల్‌, సత్యరాజ్ గారి పాత్రలు అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయని,‘షావుకారు' జానకి బామ్మ పాత్ర చేశారని తెలిపాడు.

    రెగ్యులర్ కథలు నచ్చవు..

    రెగ్యులర్ కథలు నచ్చవు..

    తనకు రెగ్యులర్ కథలు అస్సలు నచ్చవని పేర్కొన్నాడు. తానెప్పుడూ కొత్త తరహా కథలనే ఎంచుకుంటానని తెలిపాడు. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే కొంత సస్పెన్స్ ఉంటుందని తెలిపాడు. 'దృశ్యం' తరువాత ప్రతి ఒక్కరూ నా నుండి సస్పెన్స్ కథలనే కోరుకుంటున్నారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో కొంత సస్పెన్స్ పెట్టడం జరిగింది తప్పా.. ఆ సస్పెన్స్ అనేది కథను డామినేట్ చేయదని అన్నాడు.

    డిఫరెంట్ జానర్స్‌లో చేయడం ఇష్టం..

    డిఫరెంట్ జానర్స్‌లో చేయడం ఇష్టం..

    నా మొదటి సినిమా 'డిటెక్టివ్' ఒక ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్. రెండవ సినిమా 'మమ్మి అండ్ మీ' ఫ్యామిలీ డ్రామా. మూడవ సినిమా 'మై బాస్' ఒక రొమాంటిక్ కామెడీ. ఇలా ప్రతి సినిమా కొత్త జోనర్ లో, కొత్త కథతో ఉండాలని కోరుకుంటానని అన్నాడు. అయితే తెలుగులో, తమిళ్‌లో మాస్ సినిమా చూసినప్పుడు తప్పకుండా తాను కూడా ఎలాంటి లాజిక్స్ లేకుండా ఫుల్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ చేయాలి అనుకుంటానని తెలిపాడు.

    English summary
    Jeethu Joseph Interview About Karthi Donga Movie. Karthi And Jyothika Playing Main Role In Donga movie. This Movie Is directed By Jeethu Joseph. Going To Release On 20th December 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X