For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీలో కీలకపదవికి సీఎం జగన్ ఆఫర్.. స్పందించిన జీవిత

|
Is YS Jagan Jagan Going Offer Crucial Role To Jeevitha In YSRCP ? || Filmibeat Telugu

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ హీరోగా శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్, జీవిత రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించిన కల్కి మూవీ జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింి. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా రాజశేఖర్ దంపతులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాజా ఏపీ, తెలంగాణలోని రాజకీయ పరిస్థుతులపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భేషరుతుగా వైఎస్ జగన్‌కు మద్దతు

భేషరుతుగా వైఎస్ జగన్‌కు మద్దతు

ఆంధ్ర ప్రదేశ్‌లో తాము కోరుకొన్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు మేము ఆయనకు భేషరతుగా మద్దతు తెలిపాం. మాకు వీలైనంత మేరకు మేము ప్రచారం కూడా చేశాం. మా శక్తి మేరకు పార్టీకి ఎంత మేరకు సహాయం చేయాలో అంత చేశాం. ప్రస్తుతం మా పని ముగిసింది. మేము ఏం ఆశించడం లేదని జీవిత అన్నారు.

కీలక పదవి రేసులో జీవిత రాజశేఖర్

కీలక పదవి రేసులో జీవిత రాజశేఖర్

ఏపీఎఫ్‌డీసీ లేదా కొన్ని కీలక పదవుల రేసులో ఉన్నారనే వస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదు. మాకు ఎలాంటి సమాచారం లేదు. అలాగని మేము ఆశపెట్టుకోలేదు. ఇప్పుడు మేము పదవుల కోసం ఆశించే పరిస్థితి లేదు. మా పిల్లలు, రాజశేఖర్ కెరీర్‌పై దృష్టిపెట్టాం. వారికి సహాయం చేస్తూ.. గృహిణిగా, సెన్సార్ బోర్డు అధికారిగా నేను నా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను అని జీవిత తెలిపారు.

 నాకు ఎలాంటి పదవి ఇచ్చినా

నాకు ఎలాంటి పదవి ఇచ్చినా

ఏపీ ప్రభుత్వంలో మాకు ఎలాంటి పదవి అప్పగించినా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగానీ పదవుల కోసం వెంపర్లాడటం లేదు. మేము నిస్వార్ధంగా, ఎలాంటి అంచనాలు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలనుకొన్నాం. ఆ మేరకు మేము సక్సెస్ అయ్యామని భావిస్తున్నాం అని జీవిత చెప్పారు. తాజాగా ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా జీవితను నియమించే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే

ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత

ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వాతావరణం కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య మంచి సఖ్యత కనిపిస్తున్నది. ఇద్దరు సీఎంలు ప్రజల కోసం కలిసి పనిచేయడం అందర్ని ఆకటుకొంటున్నది. ఇప్పుడు వీడిపోయాం. విభజన తర్వాత పేరుకొన్న అనుమానాలు ఒక్కొక్కటి తొలిగిపోతున్నాయి అని జీవిత చెప్పారు.

English summary
Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. After movie release, Raja Sekhar couple speaks media on various issues.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more