For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీ సీన్ కోసం అలాంటి కసరత్తులు.. బెల్లీ డ్యాన్స్‌లో ఫర్‌ఫెక్ట్.. నచ్చింది గర్ల్‌ఫ్రెండూ హీరోయిన్ (ఇంటర్వ్యూ

  |

  నా పేరు జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్. నేను ముంబై నుంచి వచ్చాను. నేను గతంలో నేను నాలుగు సినిమాలు చేశాను. #boys నాకు మొదటి సినిమా. దయానంద్ దర్శకుడు. ఆ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ చెప్పడంతో నాకు నచ్చింది గర్లఫ్రెండూ సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా నా కెరీర్‌లో తొలి రిలీజ్. నేను ఎంఏ చదివాను. ఆ తర్వాత జర్నలిజం చేశాను. భరతనాట్యం, బెల్లీ డ్యాన్స్ నేర్చుకొన్నాను. తమన్నా, కృతి శెట్టి ఫీచర్స్​‍ నాలో ఉంటాయని చెప్పడం ఆనందంగా ఉంది అని జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ తెలిపారు. ఇంకా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ సినిమా వివరాలను వెల్లడిస్తూ..

  గురు పవన్ కథ చెప్పగానే..

  గురు పవన్ కథ చెప్పగానే..

  దర్శకుడు గురు పవన్ సినిమా కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అయ్యాను. నా క్యారెక్టర్ పేరు సంధ్య. ఈ సినిమాలో నాది చాలా ఇంపార్టెంట్ రోల్. యాక్టింగ్‌కు, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర. టీజింగ్, రొమాంటిక్ సాంగ్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌కు అవకాశం ఉంది. ఇంటర్వెల్‌లో ట్విస్టుతో సినిమా మలుపు తిరుగుతుంది. కొంత నెగిటివ్ షేడ్‌తో నా రోల్ ఉంటుంది. ఈ సినిమా రోడ్ జర్నీ కావడంతో పాటలతో కథ సాగుతుంది. నా క్యారెక్టర్‌పై టైటిల్ పెట్టడంతో చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అని జెన్నీఫర్ తెలిపింది.

  హీరో ఉదయ్ శంకర్‌తో..

  హీరో ఉదయ్ శంకర్‌తో..


  హీరో ఉదయ శంకర్‌తో నా జర్నీ బాగుంది. ఆయన పక్కా ప్రొఫెషనల్. చాలా డౌన్ టూ ఎర్త్ పర్సన్. డైలాగ్స్ చెప్పే విషయంలో నాకు చాలా హెల్ప్ చేశారు. తెలుగులో డైలాగ్ చెప్పడానికి నేను బోర్డు ఎగ్జామ్‌కు హాజరైన విధంగా ప్రిపేర్ అయ్యాను. సెట్స్‌లో నా వల్ల ప్రాబ్లెం ఎదురు కాకూడదని జాగ్రత్తలు తీసుకొన్నాను. సినిమా యూనిట్ నాకు చాలా సపోర్ట్ చేసింది. ఇన్వెస్ట్‌మెంట్ యాప్ ఆధారంగా కథ నడుస్తుంది జెన్నీఫర్ చెప్పింది.

  బికినీలో ఎందుకు నటించానంటే?

  బికినీలో ఎందుకు నటించానంటే?


  కథ డిమాండ్ మేరకు నేను బికినీలో నటించారు. గ్లామర్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో అందాలు ప్రదర్శించాను. బికినీలో నటించిన సమయంలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాలేదు. ఈ సీన్‌కు ముందు నా బాడీని పర్‌ఫెక్ట్‌గా ఉంచుకొన్నాను. నాలుగైదు రోజులు జిమ్, ఎక్స్‌ర్‌సైజులు చేశాను. బికినిలో షూట్ చేసినప్పుడు యూనిట్ సభ్యులు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఎక్కడ అసభ్యత కనిపించదు. సిల్వర్ స్క్రీన్‌పై గ్లామర్, సెక్సీగా కనిపించాలని చూస్తాను అని జెన్నీఫర్ అన్నారు.

  దర్శకుడు గురు పవన్ గురించి

  దర్శకుడు గురు పవన్ గురించి

  దర్శకుడు గురు పవన్‌కు కథపై, సినిమాపై మంచి అవగాహన ఉంది. నాకు డైలాగ్స్ అర్ధమయ్యేలా చెప్పి చేయించుకొన్నారు. మాతో వర్క్​‍ చేయించుకునేప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. ఈ సినిమాలో మంచి పాటలు కుదిరాయి. వాటిని అందంగా పిక్చరైజ్‌ చేశారు. పరీక్షల సమయంలో ఒక విద్యార్థిని ప్రిపేర్‌ అయినట్లు తెలుగు నేర్చుకున్నాను అని జెన్నీఫర్ తెలిపింది.

  నిర్మాత, ప్రొడక్షన్ గురించి

  నిర్మాత, ప్రొడక్షన్ గురించి

  శ్రీరామ్ మూవీ బ్యానర్‌ నాకు బాగా సపోర్ట్ చేసింది. నిర్మాత అట్లూరి నారాయణ్ రావు చాలా చక్కగా చూసుకొన్నారు. నిజంగా హీరోయిన్‌గా, ప్రిన్సెస్‌గా ఫీలయ్యేలా చేశారు. ముంబైలో ఉంటే.. హైదరాబాద్‌కు ఎప్పుడు వెళ్లాలా అనిపించేది. టాలీవుడ్‌లో నాకు నచ్చిన హీరో ఎన్టీఆర్‌, నాయిక సమంత. అన్ని రకాల పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది అని జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ చెప్పింది.

  English summary
  Heroine Jennifer Emmanuel is coming with Nachindi Girl Friendu. This movie is set to release on November 11th. Here is the Jennier Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X