twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెర్సీ రిలీజ్‌కు ముందు అలాంటి గొడవలు.. నానిపై డౌట్.. అవార్డును ఊహించలేదు.. నిర్మాత నాగవంశీ క్లారిటీ

    |

    జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలకు ప్రశంసగా ఇచ్చే అవార్డుల ప్రకటనలో జెర్సీ చిత్రం తన సత్తాను చాటుకొన్నది. 2019 సంవత్సరానికి గాను.. ప్రాంతీయ భాషా చిత్రం విభాగంలో జెర్సీ ఉత్తమ చిత్రంగా, అలాగే ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలి అవార్డులను సాధించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మీడియాతో మాట్లాడుతూ...

     లాక్‌డౌన్‌లో అవార్డుల రావని ఫిక్స్

    లాక్‌డౌన్‌లో అవార్డుల రావని ఫిక్స్

    జెర్సీ సినిమాకు అవార్డులు వస్తాయని ఊహించాం. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా అవార్డులు రావని ఫిక్స్ అయ్యాం. కానీ జాతీయ అవార్డుల ప్రకటనలో జెర్సీ సినిమాకు అవార్డుల దక్కడం చాలా హ్యాపీగా ఉంది. జెర్సీ సినిమాకు అవార్డు రావడంతో సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకొన్నాం. కానీ నాని హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల జెర్సీ సెలబ్రేషన్స్ ఆగిపోయాయి అంటూ నిర్మాత నాగవంశీ సూర్యదేవర తెలిపారు.

     జెర్సీ సినిమా నాని చేస్తాడనే సందేహం

    జెర్సీ సినిమా నాని చేస్తాడనే సందేహం

    జెర్సీ కథను ముందుగా నాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెప్పాడు. హీరోకు ఏడేళ్ల కొడుకు ఉంటాడనే విషయంపై రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. యంగ్ హీరోగా చేస్తున్న నానికి ఈ విషయం చెబితే ఒప్పుకొంటాడా అనేది సందిగ్ధంగా ఉండేది. కానీ కథ చెప్పిన తర్వాత నాని ఒకే అన్నారు. దాంతో జెర్సీ సినిమా ప్రయాణం మొదలైంది అంటూ నాగవంశీ చెప్పారు.

    దర్శకుడితో నవీన్ నూలి గొడవలు

    దర్శకుడితో నవీన్ నూలి గొడవలు

    జెర్సీ సినిమాకు బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో నవీన్ నూలికి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎడిటింగ్ పరంగా నవీన్ చాలా కష్టపడ్డాడు. క్రికెట్ ఎపిసోడ్స్ లెంగ్త్ విషయంలో గౌతమ్, నవీన్ గొడవలు పడ్డారు. సరైన అవుట్‌పుత్ కోసం వారిద్దరి వాదనలకు దిగారు. చివరకు ప్రేక్షకులను మెప్పించే విధంగా జెర్సీని రూపొందించారు. ఫలితంగా అవార్డు దక్కింది అని నాగవంశీ పేర్కొన్నారు.

    మానవ సంబంధాలు, భావోద్వేగాలకే ప్రయారిటీ

    మానవ సంబంధాలు, భావోద్వేగాలకే ప్రయారిటీ

    సినిమా కథల విషయంలో మా బాబాయ్ (నిర్మాత ఎస్ రాధాకృష్ణ), నేను వినోదాన్ని, హ్యూమన్ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇస్తాం. కథ, కథనాల పరంగా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని భావిస్తాం. జెర్సీ కమర్షియల్ సినిమా కాదని తెలుసు. కానీ మానవ సంబంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని నమ్మాం. కలెక్షన్ల పరంగా మాకు మంచి ఫలితాన్ని అందించింది అని నాగవంశీ వెల్లడించారు

    Recommended Video

    Vakeel Saab డబ్బింగ్ షురూ | National Awards పై పవన్ కళ్యాణ్ రెస్పాన్స్
    అవార్డు కోసం జెర్సీ తీయలేదు

    అవార్డు కోసం జెర్సీ తీయలేదు


    అవార్డుల కోసం జెర్సీ మూవీని తీయలేదు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను కాలేజ్ డేస్‌లో క్రికెట్ ఆడేవాడిని. అందుచేత క్రికెట్ కథ నా ముందుకు రాగానే సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. ఉత్తమ నటుడిగా నానికి, ఉత్తమ దర్శకుడిగా గౌతమ్‌కు ఫిలింఫేర్ అవార్డుల వస్తాయని ఊహించాం. కానీ వేరే కేటగిరీలో జాతీయ అవార్డులు రావడం ఆశ్చర్యం కలిగించింది అని నాగవంశీ తెలిపారు.

    English summary
    National Best film awards announced by Information broadcast ministry on March 22nd. Nani's Jersey movie got best film award in regional films category. In this occassion, Producer Naga Vamshi Suryadevara had chat with media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X