twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌లకు వెళ్లడం నచ్చదు.. అనుకోకుండా అలా కుదిరింది.. కాల భైరవ కామెంట్స్

    |

    కీరవాణి తనయులైన శ్రీ సింహా హీరోగా, కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం మత్తు వదలరా. సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా టీజర్‌ను రామ్ చరణ్, ట్రైలర్‌ను ప్రభాస్ సాయంతో రిలీజ్ చేయించి సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశారు. ట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అందర్నీలోనూ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ చిత్రం రేపు విడుదల కానుండటంతో సంగీత దర్శకుడు కాల భైరవ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించాడు.

    Recommended Video

    Mathu Vadalara Pre Release Event Highlights
    ఆయన ప్రభావం ఉంది..

    ఆయన ప్రభావం ఉంది..

    తనపై నాన్నగారి ప్రభావం చాల ఉందని అన్నాడు. ఆయన దగ్గరే పని చేయడంతో.. అదే వర్కింగ్ స్టైల్‌ను తాను ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ ఇంకో ట్యూన్ అడిగినప్పుడు వాళ్లకు నచ్చే విధంగా ఎలా చెయ్యాలో.. ఒక ట్యూన్‌ను ఎన్ని రకాలుగా ఆలోచించాలో... ఇవ్వన్నీ ఆయన నుంచే నేర్చుకున్నానంటూ తెలిపాడు.

    షూటింగ్‌లంటే నచ్చదు..

    షూటింగ్‌లంటే నచ్చదు..

    ఈ మూవీతో ఇలా మా తమ్ముడు హీరోగా, తాను సంగీత దర్శకుడిగా పరిచయవుతామని కలలో కూడా అనుకోలేదని, అనుకోకుండా అలా కుదిరిందని అన్నాడు. తనకు షూటింగ్‌లంటే నచ్చవని, అందుకే ఒక్కరోజు కూడా షూట్ జరుగుతున్నప్పుడు లొకేషన్‌కు వెళ్ళలేదని చెప్పుకొచ్చాడు. షూటింగ్ మొత్తం అయిపొయిందని రఫ్ కటింగ్ చేసిన ఎడిటర్.. ఆర్ఆర్ పనులు మొదలు పెట్టమని తనకు ఓ కాపీ పంపినట్లు చెప్పుకొచ్చాడు.

    చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను..

    చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను..

    సినిమా ఎలా ఉందో వీళ్ళు ఎలా తీశారో అని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ సినిమాను ఒక ఆడియన్‌లా తాను చూశానని తెలిపాడు. ఎక్కడా ఆపకుండా సినిమా మొత్తం చూశానని పేర్కొన్నాడు. చాల థ్రిల్ ఫీల్ అయ్యాననీ, అదే విషయాన్ని డైరెక్టర్‌కు కూడా ఫోన్ చేసి చెప్పానని తెలిపాడు.

    అందరూ ఇష్టమే..

    అందరూ ఇష్టమే..

    మ్యూజిక్ డైరెక్టర్లలో అందర్నీ ఇష్టపడతానని.. ప్రత్యేకంగా ఒకరి పేరు చెప్పడం కష్టమని అన్నాడు. అయితే చిన్నప్పటి నుంచి తాను నాన్నగారి దగ్గరే పని చేశాను కాబట్టి ఆయనే ఎక్కువ ఇష్టం ఉంటుందని పేర్కొన్నాడు. ఇళయ రాజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే మణిశర్మ, తమన్, అనిరుధ్ అంటే కూడా చాలా ఇష్టమని ఇష్టమన్నారు. ఈ చిత్రంలో పాటలు లేకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుందన్నాడు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళంతా మ్యూజిక్ బాగుందని అన్నారు..రేపు విడుదలయ్యాక ప్రేక్షుకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని అన్నాడు.

    English summary
    Kaala Bhairava Interview About Mattu Vadalara. Sri Simha, Naresh Agastya, Athulya Chandra, Vennela Kishore, Satya, Brahmaji. Directed by Ritesh Rana. Music by Kaala Bhairava. Produced by Chiranjeevi and Hemalatha under Mythri Movie Makers and Clap Entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X