నాకు తీవ్రమైన అనారోగ్యం.. మూణెళ్లు హాస్పిటల్‌లోనే, మెడిసిన్ తీసుకొంటూ.. కాజల్

Recommended Video

Kajal Agarwal Interview About Kavacham Movie | Filmibeat Telugu

అందాల తాతర కాజల్ అగర్వాల్ కెరీర్‌పరంగా దూసుకెళ్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా బడా స్టార్ హీరోలతోపాటు, యంగ్ అండ్ టాలెంట్ హీరోలతో నటిస్తూ మెప్పిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి, ఖైదీ నంబర్ 150, అ‌! మూవీ, ఎమెల్యే సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి కవచం అనే సినిమాలో నటిస్తున్నారు. కవచం డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె వెల్లడించిన తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలు మీకోసం..

కవచం డిఫరెంట్ జోనర్‌లో

కవచం డిఫరెంట్ జోనర్‌లో

ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలు లభించివు. కానీ కవచంలో నా పాత్ర ఎందుకు నచ్చిందంటే.. ఈ సినిమా జోనర్ చాలా ఇంటస్ట్రింగ్‌గా ఉంటుంది. అందుకే నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నా పాత్ర గురించి, ఓవరాల్‌గా ప్రాజెక్ట్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందనిపించింది. అందుకే ఈ సినిమాలో నటించాలని అనుకొన్నాను.

 ప్రేమకథతో కూడిన థ్రిల్లర్

ప్రేమకథతో కూడిన థ్రిల్లర్

బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి చేస్తున్న కవచం మూవీ సస్పెన్స్ థ్రిల్లర్. అందులో లవ్ స్టోరి ఉంటుంది. సినిమా చూస్తుంటే సీట్లకు హత్తుకొని ప్రేక్షకులు చూడటం ఖాయం. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. కథలో మలుపు చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. పక్కాగా ఈ సినిమాలో కమర్షియల్ వ్యాల్యూస్ ఉంటాయి.

 కవచంలో నా పాత్ర ఏంటంటే

కవచంలో నా పాత్ర ఏంటంటే

కవచం సినిమాలో ప్రధానమైన పాత్ర. చాలా కీలకమైనది. ఈ సినిమాలో ఉన్న మూడు నాలుగు ముఖ్యమైన పాత్రల్లో నాది ఒకటి. హీరో పాత్ర సినిమాను ముందుకు తీసుకెళ్తే నా పాత్ర కథకు బలాన్ని ఇస్తుంది. నా కెరీర్‌లో ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో వేచి చూడాల్సిందే.

ఆరోగ్యం క్షీణించింది కానీ

ఆరోగ్యం క్షీణించింది కానీ

2018 సంవత్సరం అ! అనే చిత్రంతో బ్రహ్మండంగా ప్రారంభమైంది. కవచం లాంటి సినిమాతో గ్రాండ్‌గా ముగియబోతున్నది. వాస్తవానికి నేను 2018లో బ్రేక్ తీసుకోవాలనుకొన్నాను. నా ఆరోగ్యం బాగా క్షీణించింది. 3 నెలలు మంచానికే పరిమితం అయ్యాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.

నా అనారోగ్యానికి కారణమేమంటే..

నా అనారోగ్యానికి కారణమేమంటే..

ముంబైలో చికిత్స పొందే సమయంలో నా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలనుకొన్నాను. ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతూ ఓ వైపు ఎక్కువ మోతాదులో మెడిసిన్ తీసుకొంటూనే చాలా సినిమాలు చేశాను. అయితే నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఎప్పుడూ లేనంత బిజీగా 2018లో సినిమాలు చేశాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగున్నది. చాలా హెల్తీగా ఉన్నాను.

డిజార్డర్‌తోనే పిచ్చిపనులు

డిజార్డర్‌తోనే పిచ్చిపనులు

ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నానని తెలియలేదు. ఆటో ఇమ్యున్ వ్యాధి వస్తే ఏం చేయలేం. ఆ వ్యాధి ఉన్నప్పుడే పిచ్చి పనులన్నీ చేశాను. మారథాన్‌లో పాల్గొని పరిగెత్తాను. నాకు తెలియదు. కానీ ప్రతీ రోజు మాటల్లోనే చెప్పలేని జ్వరంతో బాధపడేదానిని. తొందరగా అలిసిపోయేదానిని. నేను ఆరోగ్యం ఉండటం, నా లైఫ్ స్టైల్ బాగుండేది కాబట్టి సరిపోయింది.

దేవుడి దయవల్లతోనే

దేవుడి దయవల్లతోనే

ప్రస్తుతం బాగున్నాను. దేవుడు నాకు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌ను కల్పించాడోమో అనిపిస్తుంది. ఏది ఏమైనా నాకు ఎలాంటి సమస్యలు లేకుండానే బయటపడ్డాను. నా కెరీర్ బ్రహ్మండంగా సాగిపోతున్నది. అందుకు భగవంతుడు థాంక్స్ చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X