For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘రణరంగం’కు అందుకే గ్రీన్ సిగ్నల్.. ఆయన యంగ్, టాలెంటెడ్.. కాజల్ అగర్వాల్

|

గత పదేళ్లుగా కాజల్ అగర్వాల్ అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొంటున్నారు. టాలీవుడ్‌లోని అగ్రహీరోలతోపాటు, కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇష్టపడి చేసిన సీత చిత్రం నిరాశ పరిచింది. ఆ పరాజయ భారం నుంచి బయటపడి.. ఇప్పుడు రణరంగం చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినితో కలిసి రణరంగంలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. కాజల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

దర్శకుడు సుధీర్ వర్మతో గొప్ప అనుభూతి

దర్శకుడు సుధీర్ వర్మతో గొప్ప అనుభూతి

దర్శకుడు సుధీర్ వర్మతో పనిచేయడం గొప్ప అనుభవం. రెండు రకాల వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. అతని ఐడియా చాలా బాగుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. 80 దశకం నాటి వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించారు. నాది 2019లో వచ్చే పాత్ర. శర్వానంద్‌తో కొద్ది రోజులు పనిచేశాను. పెద్దగా మా మధ్య ఇంటరాక్షన్ జరుగలేదు. కానీ సెట్లో చాలా కామ్‌గా ఉంటాడు. నా పాత్ర పరిధి తక్కువగా ఉండటం కారణంగా నేను ఎక్కువగా యూనిట్‌తో కలువలేకపోయాను.

రణరంగం మూవీ గ్రిప్పింగ్‌గా

రణరంగం మూవీ గ్రిప్పింగ్‌గా

రణరంగం సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపిస్తాను. కథ నచ్చడంతోనే ఈ సినిమాలో భాగమయ్యాను. గ్రిప్పింగ్‌గా ఉండే కథ నన్ను ఆకట్టుకోవడంతో ఈ సినిమాను అంగీకరించాను. గ్యాంగ్‌స్టర్ డ్రామా బాగుంటుంది. డ్రామా నాకు నచ్చుతుంది. నా క్యారెక్టర్ ద్వారానే స్టోరి నడుస్తుంది. ఇంతకుముందు నేను రెండుసార్లు డాక్టర్ పాత్రను పోషించాను. మూడోసారి డాక్టర్ పాత్రను చేస్తున్నాను. రణరంగం సినిమా కథాపరంగా, టెక్నికల్‌గా గొప్పగా ఉంటుంది.

పరిణతితో కూడిన నిర్ణయాలు

పరిణతితో కూడిన నిర్ణయాలు

నా కెరీర్‌లో 50 చిత్రాలకుపైగానే నటించాను. గత దశాబ్దకాలంగా సినీ పరిశ్రమలో అనుభవం కారణంగా చాలా విషయాల్లో పరిణతి సాధించాను. ఒకప్పుడు సినిమా చేయడం వరకే తెలుసు. సినిమా రిలీజ్ గురించి కానీ, హిట్టు, ఫ్లాప్ అనే విషయాలను పెద్దగా పట్టించుకోవడం అంతగా తెలియదు. కానీ ఇప్పుడు సినిమా విషయంలో నేను చాలా కచ్చితంగా అన్ని విషయాలపై దృష్టిపెడుతున్నాను.

ఇప్పుడు మూవీస్‌పై జాగ్రత్తగా అడుగులు

ఇప్పుడు మూవీస్‌పై జాగ్రత్తగా అడుగులు

నేను నటించే సినిమాల రిలీజ్ విషయంలో గానీ, ఇతర అంశాలపై గానీ పూర్తిగా దృష్టిసారిస్తున్నాను. పాత్ర ఎంపికలో కూడా తెలివిగా వ్యవహరిస్తున్నాను. నా పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాను. నా అభిమానులకు, ప్రేక్షకులకు ఏం నచ్చుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నాను. ఇప్పుడు డ్యాన్సులు, గ్లామర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పరిణతి చెందిన హీరోయిన్‌గా బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్నాను అని కాజల్ తెలిపారు.

English summary
Ranarangam is a 2019 Telugu crime action thriller film written and directed by Sudheer Varma. Produced by Suryadevara Naga Vamsi under his banner Sithara Entertainments. Sharwanand, Kajal Aggarwal and Kalyani Priyadarshan are in the lead roles.The film is scheduled for release on 15 August 2019. In this occassion, Kajal Spoke to Telugu filmibeat exclusively.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more