నాకు పెళ్లి చేసుకోవాలని బలమైన కోరిక... ఇషాన్‌ను కలిసి మూణెళ్లు.. బాగా గుర్తొస్తున్నాడు: కాజల్
Recommended Video

అందాల భామ కాజల్ అగర్వాల్ 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో కెరీర్ ఆరంభించారు. కృష్ణవంశీ రూపొందించిన చందమామతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకకు చూసుకోలేదు. 11 ఏళ్లు, 50పైగా చిత్రాల్లో కాజల్ నటించింది. కాజల్ చెల్లెలు నిషా కూడా పెళ్లి చేసుకొని ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆమె నటించిన కవచం రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన పెళ్లి గురించి, తన చెల్లెలు కొడుకు గురించి కాజల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

దీపిక, ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత
దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా తర్వాత నా పెళ్లి తర్వాత నా పెళ్లెప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. కానీ 2018లో బిజీగా ఉన్నాను. అందుకే పెళ్లి చేసుకోవడానికి సమయం కుదరడం లేదు. మా నాన్నకు పెళ్లి చేయమని మీరైనా చెప్పండి అని కాజల్ అన్నారు.

పెళ్లి ఇబ్బంది కాదని
ప్రస్తుతం పెళ్లి అనేది కేరీర్‌కు ఇబ్బంది కావడం లేదు. అందరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండటమే కాకుండా కెరీర్ బ్రహ్మండంగా డిజైన్ చేసుకొంటున్నారు. 2018 సంవత్సరం ఇయర్ మ్యారేజ్‌గా మారింది. వారిని చూస్తే నాకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తున్నది. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొందామా అని బలమైన కోరిక కలుగుతున్నది. పెళ్లి గడియల కోసం వేచి చూస్తాను.

దీపిక పదుకోన్, రణ్‌వీర్ రిసెప్షన్‌లో
ముంబైలో జరిగిన దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ మ్యారేజ్ రిసెప్షన్‌కు వెళ్లాను. వారిని కలిసిన తర్వాత వారిని కలిసి బయటకు వచ్చాను. నేను ఎక్కువగా నేను పార్టీలకు వెళ్లను. బేసిగ్గా రణ్‌వీర్, దీపిక మంచి దంపతులవుతారు. వ్యక్తిగతంగా వారిద్దరూ మంచివారు అని కాజల్ చెప్పారు.

నా చెల్లెలి కొడుకు ముద్దొస్తున్నాడు
నా చెల్లెలు కొడుకు ఇషాన్ ముద్దుగా ఉన్నాడు. షూటింగ్ కారణంగా ఇషాన్‌ను కలిసి మూడు నెలలు అయింది. కవచం సినిమా తర్వాత బ్రేక్ తీసుకొని ముంబైకి వెళ్తాను. అప్పుడు ఇషాన్‌తో కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడెప్పుడు ముంబైకి వెళ్దామా అనే విధంగా ఉంది అని కాజల్ అగర్వాల్ చెప్పింది.


Click it and Unblock the Notifications











