నేనిప్పుడు కాజల్ 2.0 వెర్షన్.. ఆ భయాన్ని దాటేశా. చీల్చుకొని బయటకు వచ్చా.. కాజల్

Recommended Video

Kajal Agarwal Interview About Kavacham Movie | Filmibeat Telugu

అందాల భామ కాజల్ అగర్వాల్ 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో కెరీర్ ఆరంభించారు. కృష్ణవంశీ రూపొందించిన చందమామతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కెరీర్‌లో వెనుకకు చూసుకోలేదు. 11 ఏళ్లు, 50పైగా చిత్రాల్లో నటించిన కాజల్.. ప్రస్తుతం నవతరం హీరోయిన్లకు గట్టిగా పోటీనిస్తున్నారు. తాజాగా ఆమె నటించిన కవచం రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. కాజల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

 కాజల్ 2.0.. అందుకే విభిన్నమైన పాత్రల్లో

కాజల్ 2.0.. అందుకే విభిన్నమైన పాత్రల్లో

కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోలతో నటించాను. ఇప్పడు యంగ్ హీరోలతో నటిస్తున్నాను. ఇదంతా అనుకొని జరగడం లేదు. నేను ఎక్కువగా కథలు, బ్యానర్లపై దృష్టిపెడుతున్నాను. అందుకే ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం నా కెరీర్‌ను బట్టి చూస్తే కాజల్ 2.0 అని భావించవచ్చు. నేను రెగ్యులర్ సినిమాలు చేయడం లేదు. సినిమా నిర్మాణం అనేది ఛారిటీ కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే చేస్తున్నాను. డిఫరెంట్ మూవీస్‌తో కమర్షియల్ పాత్రలను చేస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను.

ఈ ఏడాది కీలక మలుపు

ఈ ఏడాది కీలక మలుపు

నేనే రాజు నేనే మంత్రి తర్వాత నా కెరీర్ సరికొత్త మలుపు తీసుకొన్నది. ప్రభావవంతమైన పాత్రలను వెతుక్కొంటూ వస్తున్నాయి. కొన్నిసార్లు కొన్ని పాత్రలు ఎంపిక చేసుకోవడానికి గతంలో కొంత భయపడ్డాను. కాకపోతే నేనే రాజు తర్వాత డైరెక్టర్లు నన్ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ భయం లేదు. అభద్రతాభావం అనే గూడును చీల్చుకొని బయటకు వచ్చాను. ప్రస్తుతం నేను ప్రయోగాలకు సిద్దంగా ఉన్నాను.

యాక్టర్‌గా మరో లెవెల్‌కు

యాక్టర్‌గా మరో లెవెల్‌కు

2018లో నాలో, నా కెరీర్‌లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. అందుకు కారణం నా కెరీర్‌ నటిగా నా పరిధి పెరుగడమే. అంతేకాకుండా నేను యాక్టర్‌గా ఓ సురక్షితమైన పొజిషన్ చేరుకొన్నాను. నాకున్న సెక్యూరిటీ, సేఫ్ పొజిషన్ వల్ల నేను ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. అదే క్రమంలో నేను కోరుకొన్న పాత్రలు నా వద్దకు వస్తున్నాయి.

ఢోకాలేదనుకొంటే పొరపాటే

ఢోకాలేదనుకొంటే పొరపాటే

ఇక నా కెరీర్‌కు ఢోకాలేదనుకొంటే అంతకంటే పెద్ద తప్పు మరోటి ఉండదు. సినీ ఇండస్ట్రీలో ప్రతీ శుక్రవారం ఓ అగ్నిపరీక్షే. ఎవరైనా, ఎప్పుడైనా శుక్రవారం ఆ పరీక్షను తట్టుకొని నిలబడటమే ఛాలెంజ్. ఇన్ని సినిమాలు చేసిన ప్రతీ రోజు నాకు ఛాలెంజే. అలా అని నాకు అభద్రతాభావం లేదు. నిద్రలేని రాత్రులు గడపలేదు. నా వంతుగా నేను కష్టపడుతాను. మిగితాది దేవుడికి వదిలేస్తాను.

డెడికేషన్, హార్డ్ వర్క్ కారణంగానే

డెడికేషన్, హార్డ్ వర్క్ కారణంగానే

పదేళ్లకుపైగా కెరీర్‌లో 60 సినిమాలకు పైగా నటించాను. యువ తారల నుంచి నాకు ఎదురవుతున్న గట్టిపోటిని తట్టుకోగలుగుతున్నాను. అందుకు కారణం నటనపట్ల నా నిబద్ధత. కష్టించి పనిచేసే మనస్తత్వమే నాకు అండగా నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X