యువ హీరోకు నిక్‌నేమ్ పెట్టిన కాజల్ అగర్వాల్.. ఫన్నీగా ఏమని పిలుస్తుందంటే..!
Recommended Video

యువ హీరో బెల్లంకొండ శ్రీను, బ్యూటీ కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం కవచం. ఈ చిత్రానికి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించగా, నవీన్ సొంటినేని నిర్మాతగా వ్యవహరించారు. వంశధార క్రియేషన్ బ్యానర్‌పై రూపొందిన చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించాడు. మరో అందాల భామ మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. శ్రీనివాస్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఆమె పంచకొన్నారు. కాజల్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

నేను శ్రీను అలా పిలుస్తాను..
నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి హీరోలు, వ్యక్తుల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. శ్రీను స్వీట్ హార్ట్. నేను అతడిని ఎంతూ కట్లెట్ (ఎంతుసియాస్టిక్ కట్లెట్) అని నిక్ నేమ్ పెట్టాను. ఎంతూ కట్లెట్ అంటే ప్రతీ విషయాన్ని కూలకుషంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే నేను అలా పిలుస్తాను.

తండ్రి పేరు ఎక్కడా వాడుకోడు
శ్రీనివాస్‌లో కష్టించే మనస్తత్వం నాకు బాగా నచ్చింది. నాకు, శ్రీనుకు కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. నేను ఆలోచించనట్టే.. తనకు తాను రుజువు చేసుకోవాలనే తపన ఉంటుంది. తన కెరీర్ కోసం తన ఫ్యామిలీ పేరును వాడుకోడు. ఎప్పుడూ తన తండ్రి బెల్లంకొండ సురేష్ పేరును వాడుకోవడం చూడలేదు. ఎలాంటి భేషజాలు ఉండవు. అందుకే నాకు శ్రీను బాగా నచ్చుతాడు.

నేను లక్కీ మస్కట్ అంటే
నేను యువ హీరోలకు అదృష్ట రేఖ (లక్కీ మస్కట్) అనడం సరికాదు. కానీ అలా అంటే నిజంగా నేను అలా అవుతానా అనే విషయంపై క్యూరియాసిటీ పెరిగింది. కవచం, మరికొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వేచి చూద్దాం. నిజంగా అలా అయితే నాకు చాలా సంతోషం.

నా పవర్ ఏమిటంటే
ఇండియా టుడే పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో నన్ను చేర్చడం చాలా సంతోషం. పవర్ కోసం ఎప్పుడూ పాకులాడ లేదు. దానిపైన దృష్టిపెట్టలేదు. చాలా మంది దానిని కోరుకొంటారు. కానీ కొందరికి దానిని ఏం చేసుకోవాలో తెలియదు. నాకు ఉన్న పవర్‌ను పాజిటివ్ దారిలో ఖర్చు చేస్తున్నాను. నన్ను ఫాలో అవుతున్న వారి కోసం కొంత ఆలోచిస్తాను.


Click it and Unblock the Notifications











