For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరంజీవి జోక్యం చేసుకోలేదు.. చెర్రీ సపోర్ట్ చేయలేదు.. విజేత హీరో కల్యాణ్ దేవ్

By Rajababu
|

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌కు విజేత చిత్రం ద్వారా మరో హీరో పరిచయం కాబోతున్నారు. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబొతున్నారు. చిరంజీవి నటించిన విజేత సినిమా టైటిల్‌ను తన చిత్రానికి పెట్టుకోవడంతో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో కల్యాణ్‌కు జంటగా మాళవిక నాయర్ నటిస్తున్నారు. రాకేష్ సాహిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో కల్యాణ్ దేవ్ మీడియాతో మాట్లాడారు. కల్యాణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 బాలీవుడ్ ఆఫర్

బాలీవుడ్ ఆఫర్

చిన్నతనం నుంచే నటుడిని కావాలని అనుకొనే వాడిని. ఇంజినీరింగ్ తర్వాత బాలీవుడ్‌లో ప్రయత్నించాను. ఓ ఆఫర్ కూడా వచ్చింది. సంప్రదింపులు జరిగాయి. చివరి నిమిషంలో ఏదో కారణంగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం వరాహి బ్యానర్‌లో సాయి కొర్రపాటి నా ఫొటోలు చూసి అవకాశం ఇచ్చారు.

విజేత అవకాశం అలా..

విజేత అవకాశం అలా..

వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందిన తర్వాత వారం రోజుల్లోనే దర్శకుడు రాకేష్ కథ చెప్పాడు. నాకు ఆయన చెప్పిన స్టోరి నాకు బాగా నచ్చింది. అలా విజేత అవకాశం నాకు వచ్చింది. మెగా హీరోలు ఎంత మంది ఉన్నారన్నది పక్కన పెడితే.. నాకు సినిమాల్లో నటించాలన్నది మొదటి కోరిక. ఇక ఇండస్ట్రీలో నిలబడాలనే విషయంపై తర్వాత దృష్టిపెడుతా. జూలై 12 రిలీజ్ కాబోతున్న విజేతను ఎలా రిసీవ్ చేసుకొంటారనే విషయం చాలా ఎక్సైటింగ్ ఉంది.

చిరంజీవి ఒకే చేశారు..

చిరంజీవి ఒకే చేశారు..

మెగా హీరోలందరూ యాక్షన్ సినిమాలు చేస్తుండటం అందరికి తెలిసిందే. కానీ నేను అలాంటి సినిమా కాకుండా ఓ ఫీల్‌గుడ్ మూవీని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఫస్ట్ సినిమా ఏది చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రాకేష్ కథ చెప్పారు. ఆ కథ లైన్‌ను మామయ్య మెగాస్టార్ చిరంజీవికి చెప్పగా బాగుంది. వారి రమ్మనండి అన్నారు.

దర్శక, నిర్మాతలు వచ్చి కథ చెప్పినప్పుడు చిరంజీవి గారు విని వెంటనే ఓకే చేశారు. ఫాదర్ క్యారెక్టర్ కోసం మురళీశర్మను తీసుకోమని సలహా ఇచ్చారు. అంతకంటే చిరంజీవి ఎక్కువగా ఎలాంటి జోక్యం చేసుకోలేదు అని అన్నారు.

తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణ

తండ్రి, కొడుకుల మధ్య సంఘర్షణ

విజేత తండ్రి, కొడుకు మధ్య జరిగే ఉద్వేగ భరితమైన కథ. ఎలాంటి బాధ్యత లేకుండా కొడుకు తిరిగితే తండ్రి పడే బాధ ఎలా ఉంటుందనే ఈ చిత్ర మూల కథ. తండ్రి, కొడుకుల మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. సినిమా రొటీన్‌గా ఉంటుంది. కానీ చాలా సింపులు కథను ఫ్రెష్‌గా చెప్పే ప్రయత్నం జరిగింది.

 రిలీజ్ టెన్షన్ లేదు

రిలీజ్ టెన్షన్ లేదు

మెగా ఫ్యామిలి నుంచి హీరోగా పరిచయం అవ్వడం వల్ల ఎలాంటి టెన్షన్ లేదు. అలాంటి ఒత్తిడికి గురికాలేదు. కానీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నంలో ఒత్తిడికి లోనయ్యాం. విజేత టైటిల్ పెట్టడానికి ప్రత్యేకించి కారణాలు లేవు. వేరే వర్కింగ్ టైటిల్ పెట్టుకొని షూట్ చేశాం. నిర్మాత సూచన మేరకు విజేత టైటిల్ పెట్టాం. మామయ్య టైటిల్ పెట్టుకోవడంపై కొంత ఆలోచించాం.

పాజిటివ్‌గా తీసుకొంటా

పాజిటివ్‌గా తీసుకొంటా

విజేత ఎలాంటి ఫలితాన్ని అందించినా దానిని పాజిటివ్‌గా తీసుకొంటాను. కష్టపడి సినిమా చేశాం. ఫలితాన్ని ప్రేక్షకుల నుంచి ఆశిస్తున్నాం. ఈ సినిమా కోసం బాడీని మార్చుకొన్నాను. సన్నపడాలని దర్శకుడు సూచించడంతో బరువు తగ్గాను.

రాంచరణ్ సహకారం లేదు

రాంచరణ్ సహకారం లేదు

విజేత స్క్రిప్టును రాంచరణ్ వినలేదు. చెర్రీ నుంచి ఎలాంటి సహకారం లేదు. మామయ్యతో ఆయన డిస్కస్ చేశారు. సినిమా పూర్తి అయిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ ఉంటే వాటి గురించి చర్చించాం. అప్పుడు వాటికి కొన్ని సలహాలు ఇచ్చారు. చిరంజీవితోపాటు ఏ మెగా హీరో కూడా వారంతంటా వారు సలహాలు ఇవ్వలేదు.

శ్రీజ రిలాక్స్‌డ్‌గా ఉన్నారు

శ్రీజ రిలాక్స్‌డ్‌గా ఉన్నారు

విజేత సినిమా రిలీజ్‌కు నా భార్య శ్రీజ చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. సాధారణంగా సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. చిరంజీవితోపాటు రషెస్ చూశారు. ఊహించినదాని కంటే చాలా బాగా చేశారు అని శ్రీజ చెప్పారు. నా భార్య నుంచి పూర్తి సహకారం ఉంది అని కల్యాణ్ దేవ్ అన్నారు.

English summary
Tollywood is welcoming another hero from Mega family. Mega star Chiranjeevi son in law Kalyan Dhev is introducing with Vijetha movie. This movie deals with the journey of a man who’s aimless and carefree about life. The story explores the relationship between a father and his son. Vijetha set to release on July 12th. In ocassion, Kalyan speaks to media about the movie.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more