ఎన్టీఆర్, బాలకృష్ణతో మల్టీస్టారర్ ఎప్పుడు?.. కల్యాణ్ రామ్ ఇచ్చిన జవాబు ఇదే..
బింబిసార సినిమా హిట్ కావాలని కోరుకోవడం నాకు ఒక దీవెన. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సినిమా ఉంటుంది. ట్రైలర్‌లో చాలా కొంత మాత్రమే చూపించాను. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి చాలా సర్‌ప్రైజ్ ఉంటాయి. బింబిసార కొత్త అనుభూతిని కలిగించే చిత్రం అని కల్యాణ్ రామ్ చెప్పాడు. కల్యాణ్ రామ్ ఇంకా మాట్లాడుతూ..

బింబిసారలో రొమాన్స్
బింబిసారలో చాలా రొమాన్స్ ఉందా అంటే లేదేనే చెబుతాను. నేను చేసిన రొమాంటిక్ సినిమా ఇదేనా కాదనే చెబుతాను. బింబిసార పాత్రకు రొమాన్స్ తక్కువే. నా కెరీర్‌లో రొమాంటిక్ సినిమాలు చేసి చేదు అనుభవాలను చవి చూశాను. ఇక ముందు రొమాంటిక్ సినిమాలు చేయను. నా బాడీకి అలాంటి సినిమాలు సరిపడవు అని కల్యాణ్ అన్నారు.

మల్టీస్టారర్ కథ చేయాలంటే..
నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో కలిసి నేను మల్టీ స్టారర్ చేయాలంటే.. చాలా కసరత్తు చేయాలి. మల్టీస్టారర్ చేయాలంటే ఈజీ కాదు. RRR సినిమాకు ఇద్దరు స్టార్‌లో సినిమా చేయాలంటే కష్టమే. ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలంటే ఏళ్లు పడుతుంది. కథ దొరుకాలి. నటీనటుల కూర్పు కుదరాలి అప్పుడే సాధ్యమవుతుంది అని కల్యాణ్ రామ్ అన్నారు.

సురేందర్ రెడ్డితో ఎందుకు చేయలేదంటే?
అతనొక్కడే సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయలేదు. అందుకు సరైన కథ లభించలేదు. నాతో సినిమా ఎందుకు చేయడం లేదని సురేందర్ రెడ్డిని అడగండి. అతను ప్రపోజల్‌తో సినిమా చేయడానికి నేను ఎప్పుడు సిద్దమే అని కల్యాణ్ రామ్ తెలిపారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో తారక్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో తారక్‌తో సినిమా ప్రకటించాం. తారక్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. గ్లోబల్ స్టార్. ఆయనతో సినిమా తీయాలంటే చాలా ప్రెజర్ ఉంటుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో తారక్ భాగస్వామిగా మారడం ఏమిటి? ఇది బ్యానర్ మా కుటుంబానిది. ఈ బ్యానర్‌లో వాటాలు ఉంటాయా? మా మధ్య బిజినెస్ లావాదేవీలు లేవు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో తారక్ భాగస్వామి అవుతాడనడం అర్ధం లేదు అని కల్యాణ్ రామ్ చెప్పారు.

సమ్మె గురించి ఐడియా లేదు
నిర్మాతగా నేను సినిమాను నిర్మిస్తే.. ఆ ఒత్తిడిని నేను తీసుకొను. నేను సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా బడ్జెట్‌లోనే తీయాలి. బిజినెస్ ఇంతే అవుతాయి. బింబిసార విషయంలో నేను చాలా హ్యాపీ. డిజిటల్ బిజినెస్ బాగా జరిగింది. సినిమా పరిశ్రమలో సమ్మె గురించి వివరాలు తెలియవు. నేను బింబిసార ప్రమోషన్ బిజీలో ఉన్నాను. ఆ సమ్మె గురించి నేను పెద్దగా ఆలోచించలేదు అని కల్యాణ్ రామ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











