For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంటర్వ్యూ: రియల్ లైఫ్‌లో ‘ఎంఎల్ఏ’ అవుతానేమో: కళ్యాణ్ రామ్!

  By Bojja Kumar
  |
  Kalyan Ram Says That He Will Become MLA

  హీరో కళ్యాణ్ రామ్ 'ఎంఎల్ఏ' సినిమా ద్వారా మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఉపేంద్ర మాధవ్. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.

  ఇది పొలిటికల్ సినిమా కాదు

  ఇది పొలిటికల్ సినిమా కాదు

  ఎంఎల్ఏ అనగానే పొలిటికల్ సౌండ్ వస్తుంది. కానీ ఇది పొలిటికల్ సినిమా కాదు. దర్శకుడు ఉపేంద్ర కథ చెప్పినపుడే దీనికి ‘మంచి లక్షణాలున్న అబ్బాయి'(ఎంఎల్ఏ) అని టైటిల్ చెప్పాడు. నాకు కూడా బాగా నచ్చింది. సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ కూడా ఉంటుంది. సినిమా ఎండింగులో ఎంఎల్ఏ అవుతాను... అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

   ఎవరినీ విమర్శించలేదు

  ఎవరినీ విమర్శించలేదు

  ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో తీసుకోలేదు. ఈ సినిమా స్టోరీ గతేడాది ఫిబ్రవరిలో చెప్పాడు. ఈ సినిమాకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు. పొలిటికల్ సెటైర్లు కూడా ఉండవు. ఎవరినీ విమర్శించలేదు. ఒక క్యారెక్టర్ చూట్టూ సినిమా తిరుగుతుంది, అతడున్న నియోజకవర్గంలో జరిగే సమస్యలపై హీరో ఏం చేశాడు అనేది తెరపై చూపించామని కళ్యాణ్ రామ్ తెలిపారు.

  సినిమాలో చెప్పే సందేశం అదే

  సినిమాలో చెప్పే సందేశం అదే

  ఈ సినిమా కూడా ‘పటాస్' మాదిరిగానే ప్యూర్ కమర్షియల్ ఎంటర్టెనర్. సినిమా 2 గంటల 6 నిమిషాలు మాత్రమే ఉంటుంది. షార్ట్ అండ్ స్వీటుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. దీంతో పాటు ఓ చిన్న మెసేజ్ కూడా ఉంది. టీజర్లో హీరోయిన్ చెప్పినట్లు పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు, చదువు ఇస్తే ఎలాగైనా బ్రతుకుతారు. ఇదే ఆ సందేశం. దీని చుట్టే సినిమా టాపిక్ నడుస్తుంది. ఈ పాయింటును నేను నా నిజ జీవితంలో కూడా నమ్ముతాను. అందుకే నా సినిమాలో చెప్పాను, నా పిల్లలకు కూడా ఇదే చెబుతాను అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

  హీరోయిన్ కాజల్ పాత్ర కీలకంగా

  హీరోయిన్ కాజల్ పాత్ర కీలకంగా

  ఈ సినిమాకు హీరోయిన్ కాజల్‌ను ప్రొడక్షన్ వారే ముందే డిసైడ్ చేశారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. వారు స్ట్రిప్టు విషయంలో 100 శాతం ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు సినిమాకు ఏది కరెర్టో, ఎవరు కరెక్టో అదే చేశారు. సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుంది, కొత్త హీరోయిన్ అయితే సూట్ అవ్వరనే కాజల్ లాంటి పాపులారిటీ ఉన్న హీరోయిన్‌ను తీసుకున్నారు అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

  ఓం తర్వాత చాలా రియలైజ్ అయ్యాను

  ఓం తర్వాత చాలా రియలైజ్ అయ్యాను

  నేను ప్రతి సినిమా ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాను. ఓం సినిమా తర్వాత చాలా రియలైజ్ అయ్యాను. ప్రేక్షకులు రిలాక్స్ అయ్యేలా వినోదాత్మకంగా ఉండే సినిమాలను చేయాలని డిసైడ్ అయ్యాను. పటాస్ లాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ స్క్రిప్టు వచ్చింది, పటాస్ లాంటి ఎంటర్టెన్మెంటుతో పాటు లిటిల్ బిట్ ఎమోషన్ కూడా ఉంటుంది అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

  నా సొంత బేనర్లో చేసిన ఫీలింగ్

  నా సొంత బేనర్లో చేసిన ఫీలింగ్

  ఈ ప్రొడక్షన్ నా సొంత బేనర్ కాక పోయినా.... నా సొంత బేనర్లో చేసిన ఫీలింగ్ కలిగింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా స్మూత్ గా సాగిపోయింది అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

   ఎంఎల్ఏ అవుతానేమో? భవిష్యత్తులో ఏమైనా జరుగొచ్చు

  ఎంఎల్ఏ అవుతానేమో? భవిష్యత్తులో ఏమైనా జరుగొచ్చు

  ప్రీ రిలీజ్ ఈవెంటులో పోసానిగారు మీరు ఎమ్మెల్యే అయితే చూడాలని ఉంది అన్నారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందిస్తూ... ఏమో తెలియదండీ... నేను ప్రొడక్షన్ పెడతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ పెట్టాను. నటుడిని అవుతానని అనుకోలేదు... అయ్యాను. ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం, భవిష్యత్తులో అవుతానేమో? అంటూ ఆసక్తికర సమాధానం చెప్పారు.

  తర్వాతి సినిమాలు

  తర్వాతి సినిమాలు

  నెక్ట్స్ మూవీస్ విరుంచి వర్మ, గుహన్‌లతో ఉంటాయి. ఇవి రెండు నా ప్రొడక్షన్లో చేయడం లేదు. నా ప్రొడక్షన్ నుండి ఏదైనా ఉంటే తప్పకుండా నేనే చెబుతాను. విరించి వర్మ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాపులో ఉంటుంది... అని తెలిపారు.

  ఫెయిల్యూర్స్ బాధిస్తాయి

  ఫెయిల్యూర్స్ బాధిస్తాయి

  ఫెయిల్యూర్స్ వస్తే బాధగానే ఉంటుంది. ఒక్కో సినిమా దాదాపు ఆరు నెలలు ఎంతో కష్టపడి పనిచేస్తాం. ఎంతో మంది చెమటోడుస్తారు. ఆశించిన ఫలితం రాకుంటే కష్టంగానే ఉంటుంది.... అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

  English summary
  Kalyan Ram interview about MLA movie. Nandamuri Kalyan Ram's latest film 'MLA' releasing on march 23. As the teaser and other promos are impressive, the movie pre-release business closed at Rs.22 crores.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X