బడ్జెట్‌కు లోబడే బింబిసార.. బిజినెస్ విషయంలో సూపర్ హ్యాపీ.. కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన టైమ్ ట్రావెల్ చిత్రం బింబిసార. ఈ సినిమా ద్వారా విశిష్ట అనే నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో కల్యాణ్ రామ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

నా కెరీర్‌లో కొత్త దర్శకులతో
బింబిసార చిత్ర కథను 2019లో దర్శకుడు వశిష్ట చెప్పాడు. నాకు బాగా తెలిసిన కుర్రాడు కావడం, అప్పుడప్పుడు కథలు చెబుతుండే వాడు. మొదటిసారి కథ చెప్పినప్పుడు బేసిక్ లైన్ చెప్పాడు. బింబిసారలోని క్రూరత్వంతో కూడిన పాత్ర లేదు. ఆ తర్వాత వశిష్ట పాత్రలను, కథను బాగా డెవలప్ చేశాడు. నా కెరీర్‌లో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాను. నా కెరీర్ ఆరంభంలో రెండు ప్రేమకథలు తీసి ప్లాప్‌లను చవిచూశాను. ఆ సమయంలో ఒక యాక్షన్ కథతో సురేందర్ రెడ్డి కథ చెప్పాడు. కథ నచ్చడం వల్ల కొత్త దర్శకులతో పనిచేశాను అని కల్యాణ్ రామ్ చెప్పారు.

బింబిసార మేకోవర్ కొత్తగా
బింబిసార మేకవర్ కొత్తగా ఉంటుంది. ఒక కొత్త క్యారెక్టర్‌ను ఆకలింపు చేసుకోవడంలోను, ఒక రాజుగా నేను సెట్ అవుతానా? నా డిక్షన్ సెట్ అవుతుందా? అనే డౌట్ ఉండేది. తాతగారు, బాబాయ్ చేసిన సినిమాలు, బాహుబలి, మగధీర సినిమాలను కొంత రెఫరెన్స్ తీసుకొన్నాను. దాదాపు రెండు నెలలు బాగా ఎక్సరైజ్ చేశాను. ఈ సినిమాకు బాహుబలి సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా టైమ్ ట్రావెల్, సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఆధారంగా తెరకెక్కించాం అని కల్యాణ్ రామ్ చెప్పారు.

నా ఇమేజ్‌కు తగినట్టే బడ్జెట్
తెలుగులో నా ఇమేజ్‌కు తగినట్టుగా బడ్జెట్ పెట్టాలని అనుకొన్నాం. మార్కెటింగ్ కోసం చాలా విషయాలను పరిగణనలోకి తీసుకొన్నాం. నా ట్రైనర్ కుమార్ మండవకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. డైట్ బ్యాలెన్స్ ఉండటం వల్లే నేను నా పాత్రకు సంబంధించిన అంశాలు చక్కగా కుదిరాయి. ఎన్టీ రామారావు, జానపద చిత్రాల రెఫరెన్స్‌ల గురించి చర్చించుకొన్నాం. పలు దశల్లో కథలో పాత్ర తీరుతెన్నుల విషయంలో మార్పులు చేసుకొంటూ వెళ్లాం అని కల్యాణ్ తెలిపారు.

మళ్లీ బింబిసార లాంటి కథలు చేస్తానా అంటే..
బింబిసార సినిమా చేస్తానా అనేదే నాకు తెలియదు. ఇక ముందు ఇలాంటి సినిమాలు చేస్తానా అంటే చెప్పలేను. కొన్ని పాత్రలు నటుడిని వెతుకొంటూ వస్తాయి అని మా తాత గారు చెప్పేవారు. అతనొక్కడే సినిమా కథ చాలా మంది హీరోలు విన్నారు. కానీ నేనే ఎందుకు చేశాను అంటే.. దానికి సమాధానం.. బింబిసార నన్ను వెతుక్కొంటూ వచ్చింది అని కల్యాణ్ రామ్ అన్నారు

బింబిసారలో చాలా సర్‌ప్రైజెస్
తెలుగు ప్రేక్షకులకు సినిమానే వినోదం. మంచి సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు వస్తారని ఇప్పటికే కొన్ని సినిమాలు రుజువు చేశాయి. ట్రైలర్ కనుక మంచి అంచనాలు పెంచితే.. ఆటోమాటిక్‌గా కలెక్షన్లు పెరుగుతాయి. అతనొక్కడే సినిమా సమయంలో సంధ్యలో మార్నింగ్ షో ముగిసే సమయానికి మౌత్ టాక్‌తో మ్యాట్నీ కిక్కిరిసిపోయాయి. మంచి సినిమాకు మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. మేజర్, విక్రమ్ సినిమాలు బాగా తీశారు కాబట్టే హిట్ అయ్యాయి. మంచి సినిమాకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది అని కల్యాణ్ రామ్ అన్నారు.


Click it and Unblock the Notifications











