ఆయనకు మహిళే బలహీనత.. ఆ విషయం చెబితే దర్శకుడు చంపేస్తాడు.. కల్యాణి ప్రియదర్శన్

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రణరంగం'. గ్యాంగ్‌స్టర్ జీవితం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రణరంగం సినిమా గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి కల్యాణి చెప్పారు. ఆమె చెప్పిన విషయాలు ఇవే..

గ్యాంగ్‌స్టర్ పాత్రలో శర్వానంద్

గ్యాంగ్‌స్టర్ పాత్రలో శర్వానంద్

రణరంగం చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. నా క్యారెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే.. శర్వానంద్ పాత్ర గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం సుధీర్ వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శర్వానంద్ పాత్ర ఎదిగిన తీరు, ఆయన చుట్టూ చోటుచేసుకొనే సన్నివేశాల ఆధారంగా సినిమా కథ నడుస్తుంది. గ్యాంగ్‌స్టర్ పాత్ర చుట్టూ అల్లుకొన్న కథ ఇది అని కల్యాణి ప్రియదర్శిని అన్నారు.

మహిళే బలహీనతగా

మహిళే బలహీనతగా

గ్యాంగ్‌స్టర్ జీవితంలో సీరియస్ సాగే సన్నివేశాల మధ్య ఆహ్లాదకరంగా ఉండే గీత పాత్రలో నటించాను. ఏ వ్యక్తికైనా, ఎంతటి గ్యాంగ్‌స్టర్ అయినా మహిళ అనే బలహీనత ఉంటుంది. శర్వాది ఇంటెన్సిటీతో కూడిన పాత్ర. మానసికంగా స్ట్రాంగ్ ఉండే పాత్ర. మానసికంగా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ.. మహిళ అనే బలహీనత ఉంటుంది. ఈ సినిమాలో ఆయన బలహీనత గీత. సీరియస్‌గా సాగే కథలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా స్కోప్ ఉండే రోల్ నాది. గ్రామీణ యువతిగా కనిపించడమే కాదు.. ఓ మెచ్యురిటీ ఉన్న యువతిగా కనిపిస్తాను. నా పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ 80వ దశకం చివరగా, 90వ దశకం ఆరంభంలో ఉండే వాతావరణంలో షూట్ చేశారు.

లవ్ ట్రాక్‌కే పరిమితం కాలేదని

లవ్ ట్రాక్‌కే పరిమితం కాలేదని

నా పాత్ర కేవలం లవ్ ట్రాక్‌కే పరిమితం కాలేదు. వినోదం, ఎమోషన్స్ కలబోసి ఉండే పాత్ర నాది. వినోదానికి చోటు ఉండే సన్నివేశాల్లో కనిపిస్తాను. గ్యాంగ్‌స్టర్ సినిమా కాబట్టి హింస, యాక్షన్ ఎలిమింట్లతోపాటు వినోదాన్ని పెద్ద పీట వేసి సుధీర్ వర్మ తెరకెక్కిచారు. ఓ వ్యక్తి 20 సంవత్సరాల జీవితం ఉంటుంది. ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే. సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను అని కల్యాణి ప్రియదర్శిని తెలిపారు.

రణరంగం కథేంటంటే

రణరంగం కథేంటంటే

ఇప్పటి వరకు వచ్చిన గ్యాంగ్‌స్టర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుడు సుధీర్ వర్మ విజన్ చాలా కొత్తగా ఉంటుంది. కథేంటో చెబితే సుధీర్ నన్ను చంపేయడం ఖాయం. నాలుగైదు రోజులు ఆగితే మీకే సినిమాలోని కొత్తదనం, ఇంటెన్సిటీ మీకు తెలుస్తుంది. ముఖ్యంగా నాకు గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే చాలా ఇష్టం. చిన్నతనంలో టీవీలో గ్యాంగ్‌స్టర్ సినిమాలు చూసి పెరిగాను. నాకు గన్ పట్టుకోవడమంటే చాలా ఇష్టం. కానీ నా ఫేస్ చూసి నీవు గ్యాంగ్‌స్టర్ సినిమాలో నటిస్తున్నావా అని అంటుంటారు అని కల్యాణి ప్రియదర్శిని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X