ANR పిలిచి నీ మతం అదేనా? అని అడిగారు.. సావిత్రి మాత్రం.. కమల్ హాసన్

భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఏ పాత్ర పోషించినా అందులోకి పరకాయ ప్రవేశం చేయగల అరుదైన నటుల్ల్ కమల్ హాసన్ ఒకరు. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొద్దినెలల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ తన కెరీర్, వివాదాలు, సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

8వ తరగతిలోనే చదువుకి వీడ్కోలు

'నేను 8వ తరగతి చదువుతూ మధ్యలోనే మానేశా. కళ్లు తెరిచి చూసింది సినిమాలే. సినిమా నా ప్రొఫెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేవాడిని, కానీ సినిమా నా ప్యాషన్. నన్ను కలిసిన కొందరు ఎప్పుడు సెలవు తీసుకుంటావని తరచుగా అడుగుతుంటారు.. దానికి నా సమాధానం ఒక్కటే. నేను పనిచేస్తేనే కదా హాలీడే తీసుకోవాలి.. ప్రతిరోజూ నాకు హాలీడేనే. హాలీడేకు వెళ్లేవారు స్కై డైవింగ్ చేస్తారు, కొండలు ఎక్కుతారు ఆఫీస్‌లో ఒక్కచోట కూర్చోమంటే అలిసిపోతారు. హాలీడేకి ఎంతో ఎనర్జీ వేస్ట్ చేస్తాం.. నా హాలీడేలో మాత్రం నాకు డబ్బు కూడా ఇస్తున్నారు. నేను తొలిసారి అందుకున్న పారితోషికం 2 వేల రూపాయలు' అని కమల్ హాసన్ తెలిపారు.

Kamal Haasan Revealed Relation With Akkineni Nageswara Rao And K Balachander

గాంధీజీ పిలుపుతో ఆస్తులన్నీ విరాళంగా

'చిన్నప్పుడు స్టూడియోలకి వెళ్లినప్పుడు నన్ను గారాభంగా చూసుకునేవారు ఆర్ట్ సెక్షన్‌కి వెళితే కర్రతో కత్తి చేసి ఆడుకోమనేవారు. ఆ ఫ్లోర్‌లో ఏ సినిమా షూటింగ్ జరిగితే అక్కడికి వెళ్లి చూసేవాడిని. మా కుటుంబంలో తాత గారు, నాన్నగారు సహా డజను మంది లాయర్లు ఉండేవారు. భారతదేశ మాజీ అటార్నీ జనరల్ పరాశరన్ నాకు బావగారు. ఫ్యామిలీలో అంతా ఉన్నత విద్యావంతులే, నేను మాత్రమే డ్రాప్ ఔట్. గాంధీజీ పిలుపు మేరకు మా నాన్నగారు ఆస్తుల్ని స్వాతంత్ర్య ఉద్యమం కోసం విరాళంగా ఇచ్చేశారు. మా ఒక్క కుటుంబంలోనే కాంగ్రెస్ వాళ్లు, డీఎంకే వాళ్లు, కమ్యూనిస్టులు ఉన్నారు. దేవుడిని నమ్మనని అంతా నన్ను తిడుతూ ఉంటారు.. కానీ మనిషే దేవుడని ఆదిశంకరాచార్యులే చెప్పారు, దానినే నేను ఆచరిస్తుంటా' అని కమల్ హాసన్ వెల్లడించారు.

సావిత్రి అమ్మ ఎత్తుకుని వదల్లేదు

'ఏవీఎం ప్రొడక్షన్స్ వాళ్లు ఇచ్చిన ఓ పార్టీకి నేను వెళితే ఆ సంస్థ యజమాని నా ప్రతిభను గుర్తించారు. సినిమాల్లో నటిస్తావా? అని పెద్దాయన అడిగితే ఎంత ఇస్తారని అడిగానట. ఏవీఎం స్టూడియోకు తీసుకెళ్తే అక్కడ సావిత్రి గారు, జెమినీ గణేషన్ ఉన్నారు. నన్ను చూసి వాళ్లిద్దరూ ఎత్తుకుని చివరి వరకు వదిలిపెట్టలేదు. టీకేఎస్ నాటక సంస్థ వాళ్లకి నా గురించి తెలిసి పిలిపించారు. ఇంటినిండా బాగా చదువుకున్నవాళ్లు ఉన్నప్పటికీ, నేను మధ్యలోనే చదువు మానేసినా మా నాన్నగారు ఒప్పుకున్నారు. నాకేం ఇష్టమో కనుక్కుని భరత నాట్యం, కథక్, సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ప్రఖ్యాత డ్యాన్సర్ ఉదయ్ శంకర్‌లా కావాలని మా నాన్న గారు ఆశపడి నన్ను ప్రోత్సహించారు' అని బాల్యం గురించి కమల్ హాసన్ పంచుకున్నారు.

Kamal Haasan Revealed Relation With Akkineni Nageswara Rao And K Balachander

అక్కినేనితో పరిచయం

'సినిమాల్లోకి వెళ్తానని నేనెప్పుడూ అనుకోలేదు.. తొలుత డ్యాన్స్ అసిస్టెంట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టా. తంగప్ప మాస్టర్ ఎక్కువగా తెలుగు సినిమాలే చేసేవారు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన శ్రీమంతుడు సినిమా కోసం టెక్నీషియన్‌గా తొలిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టి ఏఎన్ఆర్‌కు డ్యాన్స్ స్టెప్స్ నేర్పించాను. దేవుడిని నమ్మని కారణంగా పూజా కార్యక్రమంలో నేను కొబ్బరికాయ కొట్టకపోవడాన్ని ఏఎన్ఆర్ గమనించి నువ్వేమైనా ముస్లింవా అని అడిగారు. నాలుగేళ్ల తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉంటావా అని ఏఎన్ఆర్ అడగ్గా.. ఎప్పటికీ నేను మారనని ఆయనతో చెప్పా' అని అక్కినేనితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

నా ప్రతిభను గుర్తించింది వాడే

'ఆర్‌సీ శక్తి అని నా ఫ్రెండ్ నాలో ఉన్న రైటర్‌ని గుర్తించాడు. హైస్కూల్ డ్రాప్ ఔట్ నాలో రైటర్ ఎలా ఉంటాడని వాడిని నిలదీస్తే.. నాకు అంతా తెలుసు నువ్వు రాయ్ అంటూ నన్ను గద్దించాడు. నా హ్యాండ్ రైటింగ్ బాగుండదని అంటే పెద్ద పెద్ద రైటర్స్ ఎవ్వరికీ హ్యాండ్ రైటింగ్ బాగుండదని నా ఫస్ట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాయమని ఎంకరేజ్ చేసింది శక్తి. ఓ రోజు అసిస్టెంట్ డైరెక్టర్ కోసం బాలచందర్ గారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని తెలిసి వెళ్లాలనుకున్నా.. బయల్దేరుతుండగా మా అమ్మగారు ఫోటో తీసుకుని వెళ్లమన్నారు' అని కమల్ హాసన్ తెలిపారు.

Kamal Haasan Revealed Relation With Akkineni Nageswara Rao And K Balachander

బాలచందర్ క్లాస్ పీకారు

'మా అమ్మకి చెప్పి స్టూడియోలో కలిసిన వెంటనే బాలచందర్ గారు వేసిన ఫస్ట్ డైలాగ్.. ఫోటో ఏమైనా ఉందా అనే . మా అమ్మకి ఈ విషయం ముందే ఎలా తెలిసిందని ఆశ్చర్యం వేసి వెంటనే జేబులోంచి ఫోటో తీసి చూపించగా మంచి క్యారెక్టర్ ఉందని బాలచందర్ చెప్పారు. దాంతో ఖంగుతిన్న నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం ఇవ్వరా? అని అమాయకంగా అడిగాను. సినిమా అయిపోయిన తర్వాత పక్కకి పిలిచి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు.. నీలో ఉన్న నటుడు చాలా మంచి యాక్టర్ అవుతాడని ఆశీర్వదించారు. ఎప్పుడైనా నువ్వు డైరెక్టర్ కావొచ్చు, కానీ నటన మాత్రం బై బర్త్ రావాలి.. నువ్వు స్టూడియోకి ఆటోలో రావాలని అనుకుంటున్నావా? కార్‌లో రావాలని అనుకుంటున్నావా? అని ఒక్కటే ప్రశ్న వేశారు' అని తొలి సినిమా అవకాశంపై కమల్ వివరించారు.

Take a Poll

బాలచందర్ తండ్రి కంటే ఎక్కువ

'యాక్టర్ అయిన తర్వాత ఏఎన్ఆర్ గారిని కలిస్తే.. ఆయన వెంటనే గుర్తుపట్టి ఎలా ఉన్నావని ప్రశ్నించారు. మా ఇద్దరిలో కనిపించే కామన్ పాయింట్.. మేమిద్దరం డిగ్రీ హోల్డర్స్ కాదు. కానీ మేం ఇంగ్లీష్‌లో అదరగొట్టగలం. శివాజీ గణేషన్‌ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని.. శివాజీ కూడా నాస్తికుడినని చెప్పి తర్వాత మారిపోయాడని నువ్వు కూడా మారిపోతావేమో అనుకున్నానని ఏఎన్ఆర్ అన్నారు. ఏఎన్ఆర్ 90వ పుట్టినరోజు సందర్భంగా ఆయనని కలిసి మీరేమైనా మారారా? అని ఆయనని అడిగితే అలాగే ఉంటాను, అలాగే చనిపోతానని ఆన్సర్ ఇచ్చారు. నా 16వ ఏట నుంచే బాలచందర్ గారితో ట్రావెల్ చేయడం మొదలుపెట్టా.. మా నాన్న కంటే ఎక్కువగా ఆయనతోనే ఉన్నా. ఆయన చనిపోయినప్పుడు మా నాన్న గారే చనిపోయారన్నంత బాధపడి ఏడ్చా'నని కమల్ హాసన్ భావోద్వేగానికి గురయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X