Kannappa: ‘కన్నప్ప మూవీ చూడగానే మోహన్ బాబు రియాక్షన్ ఏమిటంటే? ప్రభాస్ పాత్ర నిరాశపరచదు’
టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన చిత్రం కన్నప్ప. టాలెంటెడ్ హీరో విష్ణు మంచు కథ, స్క్రీన్ అందించగా, ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విష్ణు మంచు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. మహ భారతం సీరియల్‌కు వర్క్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్, ఆంథోని గన్సాల్వేజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..
విష్ణుతో 4 గంటలు చర్చ
నేను టెలివిజన్ రంగంలో పనిచేశాను. అలాగే మూడు ఇంగ్లీష్ సినిమాలను నిర్మించాను. బుల్లితెర, వెండితెర నాకు రెండింటిలోను అనుభవం ఉంది. ఓ రోజు డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి నాకు కాల్ చేసి మహాభారతం గురించి వివరాలు అడిగారు. అయితే ఆ సినిమాకు నేను డైరెక్టర్‌ను కాదు. మరో ఇద్దరు కూడా డైరెక్ట్ చేశారని ఆ ఇద్దరి ఫోన్ నెంబర్లు ఇచ్చాను. ఆ తర్వాత మహాభారతం సీరియల్‌లో ధృతరాష్ట్రుడిగా నటించిన అనుప్ సింగ్ థాకూర్ విష్ణుతో కలిసి ఆచారి అమెరికా యాత్రలో నటించాడు. అయితే ఓ రోజు నన్ను సంప్రదించి విష్ణు మంచు కలువాలని అనుకొంటున్నాడని చెప్పారు. ఆయనను కలువడానికి నాకు ఎలాంటి అభ్యంతరం ఏమీ లేదని చెప్పడంతో కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లో నేను విష్ణు కలుసుకొని సుమారుగా నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించుకొన్నాం. ఆ సమయంలో మోహన్ బాబు గారు లేకపోవడంతో ఆయన్ను కలువలేకపోయాను అని ముఖేష్ కుమార్ సింగ్ తెలిపారు.

మోహన్ బాబు పిలుపుతో
విష్ణు మంచుతో చర్చ జరిగిన కొద్ది రోజులకు మోహన్ బాబు నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆ సమయంలో నేను హైదరాబాద్‌లోని వారి నివాసంలో కలిశాను. ఆయనతో దాదాపు గంటకుపైగా చర్చ జరిగింది. అనంతరం విష్ణును పిలిచి కన్నప్ప సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఇతనికి అన్ని అర్హతలు ఉన్నాయని వెంటనే ఆయన చెప్పారు. అలా కన్నప్ప జర్నీ ప్రారంభమైంది అని ఆయన చెప్పారు.
శ్రీ కాళహస్తి పుజారులతో
కన్నప్ప స్టోరీ గురించి విష్ణుతోను, మోహన్ బాబుతో చర్చించినప్పుడు నాకు ఆ కథ గురించి తెలియదు. ఈ సినిమాను డైరెక్ట్ చేసే ముందు రచయితలపై ఆధారపడకుండా నేను సొంతంగా ఈ సబ్జెక్ట్‌పై రీసెర్చ్ చేశాను. న్యూస్ పేపర్ ఆర్టికల్స్, వీడియోలు, తిరుపతి, కాళహస్తిని పదిసార్లు సందర్శించాను. పుజారులతో మాట్లాడి సంస్కృతి, ఆచారాలను తెలుసుకొన్నాను. ఆ తర్వాత కన్నప్ప చరిత్ర గురించి నాకు తెలిసిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాను. దాంతో విష్ణుకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాత నాకు ఈ పాత్రను విష్ణు ఎలా చేస్తాడో అనే క్యూరియాసిటీ పెరిగింది అని ముఖేష్ చెప్పారు.
పాన్ ఇండియా స్టార్స్‌తో
కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ నటించడం చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి వాళ్లను హ్యాండిల్ చేయడం ఓ ఛాలెంజ్‌గా అనిపించింది. యాక్టర్లతో క్లియర్‌గా పాత్ర గురించి చెప్పిన తర్వాత వారు దానిని అర్ధం చేసుకొని సెట్స్‌పైకి రావడంతో నా పని చాలా సులభమైంది. మోహన్ బాబుతో పనిచేయడం గొప్ప అనుభవం. నిర్మాతగా, నటుడిగా ఆయన వ్యవహరించిన తీరు నన్ను చాలా ఆకట్టుకొన్నది అని ముఖేష్ కుమార్ అన్నారు.
80 శాతం న్యూజిలాండ్‌లోనే
కన్నప్ప సినిమాను న్యూజిలాండ్‌లో 20 రోజులపాటు షూట్ చేయాలని అనుకొన్నాం. కానీ లోకేషన్లు పర్‌ఫెక్ట్‌గా ఉండటంతో దాదాపు షూటింగ్‌ను అక్కడే చేశాం. దాదాపు 80 శాతం షూటింగ్ న్యూజిలాండ్‌లోనే జరిగింది. అక్షయ్ కుమార్, ప్రభాస్‌కు సంబంధించిన సీన్లను ఇండియాలో షూట్ చేశాం. విదేశాల్లో ఎక్కువ భాగం షూట్ చేసినప్పటికీ.. ఏ రోజు బడ్జెట్ విషయంలో విష్ణు లోటు రాకుండా చూసుకొన్నారు. సినిమాకు ఏది అవసరమైతే దానిని అందించారు అని ఆయన చెప్పారు.
20 వెర్షన్లుగా కన్నప్ప కథ
కన్నప్ప కథ 20 వెర్షన్లుగా ఉంది. కొందరు ఆయన గిరిజనుడు అని చెబుతారు. కానీ కొందరు అర్జునుడు పునర్జన్మ రూపంలో కన్నప్పగా జన్మించారని భావిస్తారు. ఇలాంటి కారణాల వల్లే ఆ కథ చాలా వేరియేషన్స్ ఏర్పడ్డాయి. కన్నప్ప సినిమాను శ్రీ కాళహస్తి పూజారులు చూసి వారు ప్రశంసించిన తీరు నా హృదయం ఉప్పొంగేలా చేసింది. వాళ్లు సినిమా చూసిన తర్వాత పార్ట్ 2 ఎప్పుడు చేస్తున్నావు అని వెంటనే అడిగారు. వారు ఒక్క మార్పు కూడా సూచించలేదు. దాంతో ఈ సినిమా ఎలాంటి అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించబోతుందో అర్ధమైంది. ఈ సినిమా చూసిన తర్వాత మోహన్ బాబు వచ్చి నన్ను కౌగిలించుకొన్నాడు. అంతకంటే నాకు గొప్ప ప్రశంస ఏమీ ఉండదు అని ముఖేష్ కుమార్ అన్నారు.
ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందంటే?
కన్నప్ప సినిమా కథలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రభాస్ పాత్రలు చాలా కీలకమైనవి. ప్రతీ పాత్రకు ఓ ప్రాధాన్యం ఉంది. అలా వచ్చి.. ఇలా పోయేవి అసలే కాదు. ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుంది. ఆయ పాత్ర గొప్పగా ఉంటుంది. ఆయన ప్రేక్షకుడిని నిరాశపరుచడు. ఆయన స్క్రీన్ టైమ్‌ను ఈ సినిమా కోసం పర్‌ఫెక్టుగా ఉపయోగించుకొన్నాం అని ముఖేష్ కుమార్ సింగ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











