సినిమా అంటే ఇష్టం.. అందుకే యూకే నుంచి.. బిక్స్ ఇరుసడ్ల
Recommended Video

ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా వస్తున్న చిత్రం కన్నుల్లో నీ రూపమే. నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించారు. జూన్29న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు భిక్షపతి (భిక్ష్) మాట్లాడుతూ -ఒక ప్రేమకథను హృదయానికి హత్తుకునేలా చెప్పాలనే ప్రయత్నమిది. అమ్మాయి- అబ్బాయి మధ్య ప్రేమకథను తెరపై చూపాను. ఫైనాన్స్, లవ్ ప్రాబ్లెమ్, పేరెంట్ ప్రాబ్లెమ్ ఏం ఉన్నా లైఫ్‌ని రన్ చేయాలన్న పాయింట్‌ను ఓ లవ్‌స్టోరీ ద్వారా చెప్పాను. రచయిత కావడంతో పని సులువైంది. ఈ సినిమా చేయాలని భావించగానే సంగీత దర్శకుడు పరిచయం అయ్యారు.
సాకేత్ కొత్త సంగీత దర్శకుడు అయినా అద్భుత బాణీలిచ్చారు. ఎస్‌పి బాలసుబ్రమణ్యం, కార్తీ, రమ్య వంటి టాప్ సింగర్స్ మా చిత్రానికి పాడారు. అనంత శ్రీరామ్ వంటి రచయితలు పాటలు రాశారు. ఎడిటర్ మహేంద్రకు కృతజ్ఞతలు. మా హీరో నందు ఇటీవలి సినిమాల్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. తేజశ్రీ నటన బావుంది. తను క్లైమాక్స్‌లో కన్నీళ్లు తెప్పించే నటన చేసింది. పోసాని ఇందులో ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఆయన సినిమాని రఫ్ ఎడిషన్ చూసి మెచ్చుకున్నారు. ప్రథమార్థం కామెడీ, సెకండాఫ్‌లో గబ్బర్‌సింగ్ బ్యాచ్ కామెడీ అర్థగంట ఆకట్టుకుంటాయి అని తెలిపారు. నందు వేరే ప్రాజెక్టులో 2 వారాల పాటు వేరే షెడ్యూల్‌లో బిజీగా ఉండడం వల్ల ప్రచారానికి రాలేకపోయారని తెలిపారు. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు భిక్షపతి అలియాస్ బిక్స్ మాట్లాడుతూ..

బిక్స్ అనే పేరు ఎలా వచ్చింది?
నా పూర్తి పేరు బిక్షపతి, నేను యు.కే లో వున్నప్పుడు అక్కడ నా పూర్తి పేరు పలకలేక అందరూ బిక్స్, బిక్స్ అని పిలిచేవారు, అదే నా స్క్రీన్ నేమ్ అయిపోయింది.
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
నాకు చిన్నప్పటినుండి కవితలు, కథలు రాయటం చాలా ఇష్టం, ఆ ఇష్టమే నన్ను ఈ సినిమాకి దర్శకుడ్ని చేసింది. ఈ సినిమా నిర్మాత భాస్కర్ భాసాని గారు
నాకు మిత్రుడు.ఈ కథ ని నన్ను నమ్మి ఈ సినిమా కి నిర్మించటానికి ముందుకు రావటం జరిగింది.
ఎలాంటి కథని తెరకెక్కించారు?
ఇది ఒక హృద్యమైన ప్రేమ కథ. మనం ఎటువంటి కష్టం లో వున్నా జీవితంలో ముందుకు సాగిపోవాలే తప్ప వెనుతిరిగి పోకూడదనే సందేశాన్ని, ఒక ప్రేమ కథతో
అంతర్లీనంగా చెప్పదలుచుకొన్నాను
నటీనటుల గురించి?
నందు ఇంతవరకు ఏ సినిమాలో చెయ్యని మంచి క్యారెక్టర్ చేసారు. నటనలోనే కాకుండా డాన్స్‌ల్లోను నందు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చ్చారు. కథానాయక
తేజస్విని ప్రకాష్ గురించి చెప్పాలంటే ఆమె నటనలో పరిపూర్ణత కనిపిస్తుంది.

ఏ ధైర్యంతో కొత్త సంగీత దర్శకుడ్ని తీసుకొన్నారు?
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, నాకు ఫేస్‌బుక్ ద్వారా మా సంగీత దర్శకుడు సాకేత్ పరిచయం అయ్యారు, నేను నా స్టోరీ అతనికి చెప్పటం, సినిమాలో
సంగీతానికి వున్న ఇంపార్టెన్స్ చెప్పటంతో అతను కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆలా మా ప్రయాణం మొదలయ్యింది. సాకేత్ కి ఇది మొదటి సినిమానే అయినా చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు.
మీ కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారం ఎలా వుంది?
నా కుటుంబసభ్యులు మరియు నా స్నేహితుల సహకారం ఎప్పటికి మరువలేనిది. మీరు ఈ సినిమా ద్వారా ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకొంటున్నారా?
నన్ను అనుక్షణం వెన్నంటే ఉండి, నా ఎదుగుదలను ఆకాంక్షించే మా నాన్న గారే నాన్నంటే రియల్ హీరో, ఆయనకే నా కృతజ్ఞతలు.
చిన్న సినిమాలు విడుదల చేయటం కష్టం కదా, మీరు ఎలా చేస్తున్నారు?
మా పీఆర్వో రాంబాబు ద్వారా హరి హర చలన చిత్ర నిర్మాతలు రామ్మోహన్‌రావు ఇప్పిలి, ఎస్ శ్రీకాంత్ రెడ్డి పరిచయం అయ్యారు. మా సినిమాని చూసి మెచ్చుకొని
విడుదల చెయ్యటానికి పెద్ద మనసుతో ముందుకొచ్చిన వాళ్లకు నా కృతజ్ఞతలు.
చివరగా ప్రేక్షకుడు మీ సినిమా ఎందుకు చూడాలి?
ఇది ప్రేక్షకుడ్ని ఆలోచింప చేసే సినిమా. 6 నుంచి 60 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు రెండు గంటలు తనని తాను మైమరచిపోయి ఆనందించే సినిమాగా ఉంటుంది.


Click it and Unblock the Notifications











