తమ్ముడులో పవన్ కల్యాణ్ వీరాభిమానిగా.. కాంతార తర్వాత చాలా సినిమాలు రిజెక్ట్ చేశా.. సప్తమీ గౌడ

తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ లాంటి హిట్ సాధించిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఫిల్మీబీట్ ఎడిటర్ రాజబాబు అనుములతో హీరోయిన్ సప్తమీ గౌడ మాట్లాడుతూ..

తమ్ముడు సినిమాలో నేను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గా నటిస్తున్నాను. ఇటీవల విడుదల చేసిన బీజీఎం వింటే నా పాత్ర స్వభావం ఏమిటో తెలుస్తుంది. నితిన్‌తో లవ్ ట్రాక్ ఉంటుంది. కానీ రెగ్యులర్‌గా కనిపించే లవ్ స్టోరి కాకుండా డిఫరెంట్ ట్రాక్ ఉంటుంది. ఈ పాత్రలో నేను ఆర్జేగా నటించడం లేదు. రేడియో సెటప్ ఉంటుంది. కానీ అది ఎందుకు ఉందో సినిమా చూస్తే తెలుస్తుంది. రేడియో స్టేషన్‌లో ఆమె పనిచేస్తుంటుంది అని తన పాత్ర గురించి వివరించారు.

Kantara Fame Saptami Gowda

హార్స్ రైడింగ్ చేయడం చాలా కష్టమని అనిపించింది. గుర్రం పరుగెత్తే ప్రదేశం ఎగుడుదిగుడుగా, గుట్టలపై పరిగెత్తే విధంగా ఉంటుంది. అలా గుర్రాన్ని పరుగెత్తించడం నాకు కష్టమైంది. పరుగెత్తడానికి గుర్రానికి కూడా కష్టమైంది. గుర్రాన్నిస్వారీ చేయడంతో కాలు పెట్టుకొనే సాడిల్ గీసుకొని కాలికి గాయమైంది. అరకులోని స్థానిక డాక్టర్ వద్ద చికిత్స పొందాను. హార్స్ రైడింగ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది అని సప్తమీ గౌడ వెల్లడించారు.

పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమా గురించి ముందుగా తెలియదు. డైరెక్టర్‌ను అడిగితే సినిమా గురించి చెప్పారు. పవన్ కల్యాణ్ మూవీ ఎంత హిట్ అయింది. పవర్ స్టార్‌కు యూత్‌లో ఉండే క్రేజ్ గురించి చెప్పారు. ఆ సినిమాను నేను త్వరలోనే చూస్తాను. షూటింగుల బిజీ కారణంగా సినిమా చూడలేకపోయాను.

కాంతార సినిమా తర్వాత ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి నేను తీసుకొన్న నిర్ణయమే కారణం. ఎందుకంటే.. అదే తరహా పాత్రలు నా ముందుకు వచ్చాయి. రొటీన్‌గా అవే పాత్రలు చేయడం ఇష్టం లేక మంచి పాత్రల కోసం వెయిట్ చేశాను. ముక్కు పుడకలు పెట్టుకోవడం.. గ్రామీణ యువతిగా కనిపించడం.. డైలాగ్స్ లేకపోవడం, సినిమాలో క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల నేను సినిమాలు ఒప్పుకోలేదు. మంచి పాత్రల కోసం వెయిట్ చేయడం వల్ల ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయాను అని సప్తమీ గౌడ చెప్పారు.

తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర చిన్నదే. ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు. అయినప్పటికీ మూవీలో ఇంపాక్ట్‌ఫుల్ రోల్. ఈ పాత్ర గురించి డైరెక్టర్ వేణు రాసిన విధానం బాగుంది. కాంతార మూవీతో కన్నడలో ఎలా గుర్తింపు తెచ్చుకొన్నానో.. తమ్ముడు సినిమాతో తెలుగులో గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను. తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాను. రత్న పాత్రను అద్బుతంగా వేణు రాశారు. ఎమోషన్స్, వేరియేన్స్ ఉన్న పాత్రను పోషించాను. కాంతార మూవీలో ఉన్న పాత్ర మాదిరిగానే ఉంటుంది అని చెప్పారు.

తమ్ముడు అని హీరో సెంట్రిక్ టైటిల్ ఉన్నప్పటికీ.. ఈ చిత్రంలో ఉమెన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. లయ గారు, స్వస్తిక, వర్ష బొల్లమ్మ, హరితేజ లాంటి పాత్రలు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. లయ డిగ్నిఫైడ్ క్యారెక్టర్. ప్రతీ ఉమెన్ యాక్టర్‌కు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. హీరోయిన్లు కేవలం పాటలకు పరిమితం అవుతున్న సమయంలో ఈ సినిమాలో అందరూ ఫైట్స్ చేస్తారు. ఈ సినిమాకు మహిళలు బాగా కనెక్ట్ అవుతారు. నాకు మిగితా హీరొయిన్లతో నాకు స్క్రీన్ స్పేస్ లేదు. తమ్ముడు సినిమా పక్కగా కమర్షియల్ సినిమా. పుష్ప మూవీలో రష్మిక మందన్నకు దక్కిన రోల్స్ వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నా అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X