కొత్త కార్తికేయను చూస్తారు.. అలాంటి స్థితిలోనూ షూటింగ్‌కు.. 90ఎమ్‌ఎల్ డైరెక్టర్ కామెంట్స్

Recommended Video

90ml Director Shekar Reddy Exclusive Interview

ఆర్ ఎక్స్ 100 చిత్రానికి, 90 ఎమ్ఎల్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు.. అది వాస్తవ సంఘటనలతో తెరకెక్కగా.. తమది పూర్తి కల్పిత చిత్రమని దర్శకుడు శేఖర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న హీరో కార్తికేయ.. మరో ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు శేఖర్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను వెల్లడించారు.

అలా కార్తికేయ వద్దకు..

అలా కార్తికేయ వద్దకు..

అజయ్ భూపతి తనకు పరిచయమేనని, అతని సహాకారంతోనే కార్తికేయను కలిసి కథను చెప్పానని అన్నారు. ఆర్‌ఎక్స్ 100 చిత్రం చేస్తోన్న సమయంలోనే ఈ కథను హీరో కార్తికేయకు చెప్పానని, కథ నచ్చడంతో ఓకే చేశారని తెలిపారు. అయితే ముందుగా ఉన్న ఒప్పందం ప్రకారం మధ్యలో రెండు చిత్రాలు చేశాడని ఆపై 90 ఎమ్‌ఎల్ పట్టాలెక్కిందని చెప్పుకొచ్చారు.

ప్రత్యేకంగా నిలవనున్న అజర్ బైజాన్ లొకేషన్లు..

ప్రత్యేకంగా నిలవనున్న అజర్ బైజాన్ లొకేషన్లు..

ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా అజర్ బైజాన్‌కు వెళ్లామని, అక్కడ మూడు పాటలను చిత్రీకరించామని దర్శకుడు తెలిపారు. అయితే పాటలో ఉండే ఎమోషన్‌కు తగ్గట్టే అక్కడి అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశామని అన్నారు. అలాంటి లొకేషన్లలో మొదటగా షూట్ చేసింది కూడా తామేనని చెప్పుకొచ్చారు.

అలాంటి స్థితిలో కూడా..

అలాంటి స్థితిలో కూడా..

ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించిన రవి కిషన్, రావు రామేష్‌ల గురించి చెబుతూ ఈ చిత్రానికి వారందించిన సహాయసహాకారాలను గుర్తు చేసుకున్నారు. వైరల్ ఫీవర్‌తో రావు రమేష్ బాధపడుతున్నా కూడా క్లైమాక్స్ షెడ్యూల్‌ క్యాన్సిల్ కాకూడదని షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీగా గెలిచిన రవికిషన్‌ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమకు ఏనాడూ టైమింగ్ మిస్ కాలేదని అన్నారు.

కొత్త కార్తికేయను చూస్తారు..

కొత్త కార్తికేయను చూస్తారు..

ఈ చిత్రంలో ఇంత వరకు చూడని కార్తికేయను చూస్తారని, అతని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని, డ్యాన్సులు ఇరగదీశాడని చెప్పుకొచ్చారు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆర్ఎక్స్ 100ను మించి నటించాడని తెలిపారు.

తెలుగు అమ్మాయనే అంటారు..

తెలుగు అమ్మాయనే అంటారు..

టీవీ సీరియల్స్‌లో చేసిన నేహా సోలంకి ఉత్తరాదికి చెందిన అమ్మాయి. అయితే తనను చూస్తే ఎక్కడా కూడా అలా అనిపించదని అన్నారు. ఆమెను చూస్తే తెలుగమ్మాయనే ఫీలింగ్ వస్తుందని, అన్ని ఎమోషన్స్‌ను చక్కగా పండించిందని చెప్పుకొచ్చారు.

ఈ బ్యానర్‌లో వచ్చింది కాబట్టే..

ఈ బ్యానర్‌లో వచ్చింది కాబట్టే..

ఈ చిత్రం ఈ బ్యానర్‌లో తెరకెక్కింది కాబట్టే.. ఇంత బాగా వచ్చిందని తెలిపారు. మరేతర సంస్థలో వచ్చినా ఇంత అద్భుతంగా వచ్చేది కాదేమోనని అన్నారు. ఆర్‌ఎక్స్ 100 తరువాత ఈ సంస్థ నుంచి వస్తోన్న చిత్రం కాబట్టి అంచనాలు ఎక్కువగానే ఉంటాయని, వాటిని అందుకునేలా 90 ఎమ్‌ఎల్ ఉంటుందని అన్నారు. కథను అవరమైనవన్నీ నిర్మాత సమకూర్చారని, ఖర్చుకు ఎక్కడా కూడా వెనకాడలేదని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X