twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది చూసి చాలా బాధపడ్డా.. నిజ జీవితంలో ఏం చెయ్యగలుగుతున్నాం.. కార్తికేయ కామెంట్స్

    |

    'విమర్శల్ని నేనెప్పుడూ గౌరవిస్తాను..అందరి అభిప్రాయాలు వింటాను.. చేసిన తప్పుల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటాను. ఆ పొరబాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతుంటాను. అన్నిసార్లు 'ఆర్‌ఎక్స్‌ 100' లాంటి చిత్రాలు రావు కదా. అది అనుకోకుండా దక్కిన వరం. '90.ఎం.ఎల్‌' విషయంలో రివ్యూల పరంగా మిశ్రమ స్పందన లభించినప్పటికీ నా నటనా పరంగా మంచి మార్కులు పడ్డాయి. స్క్రీన్‌ ప్లే పరంగా కొన్ని లోపాలున్నట్లు నా దృష్టికొచ్చాయి. నా తర్వాతి చిత్రానికి ఈ పొరబాటు జరగకుండా జాగ్రత్త పడతా' అని చిత్ర కథానాయకుడు కార్తికేయ అన్నాడు. శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శత్వం వహించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించాడు.

    అన్ని రకాల కథలు చేయాలి..

    అన్ని రకాల కథలు చేయాలి..

    ‘నేను మాస్‌ కథానాయకుడు అనిపించుకోవాలని ఈ సినిమా చెయ్యలేదు. నటుడిగా అన్ని జోనర్లు చెయ్యాలనుకున్నా. వాటిలో భాగంగానే ఈ చిత్రాన్ని చేశా. చిన్నప్పుడు చిరంజీవిగారిని మాస్‌ చిత్రాల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఆనందించే వాడిని. ఆయనలా నన్ను నేను ఎలాంటి పాత్రల్లో చూసుకోవాలి అనుకున్నానో అలాంటి పాత్రల్లో ఇది ఒకటి. తెరపై చూసుకుంటున్నప్పుడు నేను చాలా ఎంజాయ్‌ చేశా.ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే కొన్నాళ్లకు మనపై తెలియని ఓ ముద్ర పడిపోతుంది. నేను ఎలాంటి పాత్రకైనా సరిపోతాను అనే నమ్మకం రచయితల్లో కలగాలిగించడమే నా లక్ష్యం. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా.

    మాస్ ప్రేక్షకులకు నచ్చింది.

    మాస్ ప్రేక్షకులకు నచ్చింది.

    ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో చిత్రం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆద్యంతం ఆ వినోదాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

    నిజంగా ఉంటారా?

    నిజంగా ఉంటారా?

    ఓ చిన్న లోపం వల్ల కథానాయకుడు చిన్నప్పటి నుంచి ఆల్కహాల్‌ తీసుకోవడం అన్నది దర్శకుడు చెప్పినప్పుడు చాలా ఆసక్తికి గురి చేసింది. నిజంగా ఇలాంటి వారు కూడా ఉంటారా అనుకున్నా. దీని గురించి అంతర్జాలంలో నేనూ వెతికా. కానీ, దొరకలేదు. కేవలం ఇదొక ఫిక్షనల్‌ కథలాంటిది. ప్రేక్షకుల తెరపై చూస్తున్నప్పుడు వాళ్లూ సర్‌ప్రైజింగ్‌గా ఫీలవుతారనుకొని చేసిన ప్రయత్నమిది.

    మేం అనుకున్నట్టుగానే...

    మేం అనుకున్నట్టుగానే...

    ముందుగా 'దేవదాస్‌.. పార్వతీపురం' అనే పేరు అనుకున్నాం. ఆ తర్వాత కథాంశానికి తగ్గట్లుగా పేరు '90.ఎం.ఎల్‌' అని పెడితేనే బాగుంటుంది అనిపించింది. పేరులో ఓ కొత్తదనం ఉంది కాబట్టి సినిమాపై ఓ ఆసక్తి ఏర్పడుతుందని అలా పెట్టాం. మరో విషయం ఏంటంటే దీన్ని మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే వాణిజ్యాంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా రూపొందించాం. మేం అనుకున్నట్లుగానే ఇది వాళ్లకు చేరింది.

    నాకు చిరు పాటలకు డ్యాన్సులు..

    నాకు చిరు పాటలకు డ్యాన్సులు..

    నాకు చిన్నప్పటి నుంచీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. చిరంజీవి సర్‌ చిత్రాల్లోని పాటలకు స్కూల్‌, కాలేజీల్లో వేదికలపై డ్యాన్స్‌ చేసేవాడిని. అయితే నా తొలి మూడు చిత్రాల్లో నృత్యాలు అంత ప్రాధాన్యత దొరకలేదు. ఈ చిత్రంలో దొరికింది. అందుకే నా పూర్తి ప్రతిభను చూపించా. ఇక వినోదం విషయానికొస్తే.. కథానాయకులు ఎప్పుడు కామెడీ చేసినా ప్రేక్షకులకు నచ్చుతుంది. రజనీకాంత్‌, చిరు, మహేష్‌ వంటి హీరోలు నవ్విస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. నేనూ అది దృష్టిలో పెట్టుకునే వినోదాత్మక సన్నివేశాల్ని పండించా.

    ఏ పాత్ర అయినా..

    ఏ పాత్ర అయినా..

    కచ్చితంగా చేస్తాను. నాకు నటన అంటే ఇష్టం. నటుడిగా ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. కానీ, విలన్‌ పాత్రలు చేస్తున్నప్పుడు దానికొక ప్రాధాన్యత ఉండాలి. సినిమాకీ నాకూ ఆ పాత్ర ఉపయోగపడేలా ఉండాలి. ఏదో హీరోతో నాలుగు ఫైట్లు చేసేసి వెళ్లిపోయేటట్లు ఉండకూడదు. మనసుకు నచ్చాలే కానీ ఐటెం గీతాలకైనా రెడీనే.

    లైన్‌లో రెండు చిత్రాలు..

    లైన్‌లో రెండు చిత్రాలు..

    ఇద్దరు కొత్త దర్శకులతో చెయ్యబోతున్నా. ఒకటి యాక్షన్‌ థ్రిల్లర్‌. మరకొటి భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త ప్రేమకథ. త్వరలోనే ఓ చిత్రం పట్టాలెక్కుతుంది. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తా'అని అన్నాడు.

    అది చూసి బాధపడ్డాను..

    అది చూసి బాధపడ్డాను..

    దిశ ఘటన జరిగినప్పుడు గుణ 369 క్లైమాక్స్ సీన్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై హీరో మాట్లాడుతూ.. ‘నిజానికి ఆ సన్నివేశాల్ని ప్రజలు అలా స్టేటస్‌లు పెట్టుకోవడం చూసి నేను కాస్త బాధ పడ్డా. ఆ సినిమాలో ఓ నటుడిగా హత్యాచార నిందితులను శిక్షించానే తప్ప, నిజ జీవితంలో దిశ ఘటనపై ట్వీట్‌ చేయడం తప్ప ఏం చెయ్యగలుగుతున్నా అనిపించింద'ని అన్నాడు.

    English summary
    Karthikeya Interview On Success Of 90 Ml Movie. This Movie Is Produced By Ashok Reddy Gummakonda And Directed By Sekhar Reddy Yerra. Rao Ramesh Neha Solanki Ravikishan Are Main Lead In Thsi Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X