twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెక్కలేనని లిప్‌లాక్స్.. ఒళ్లు దగ్గర పెట్టుకొన్నా.. చాలా మంది ఒప్పుకోలేదు.. ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ

    By Rajababu
    |

    Recommended Video

    RX 100 Movie Hero Kartikeya Gummakonda Exclusive Interview Filmibeat Telugu

    అర్జున్‌రెడ్డి తర్వాత రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చిన చిత్రం RX 100. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్‌లో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తీకేయ రొమాన్స్, కెమిస్ట్రీ‌ చర్చనీయాంశమైంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి మేకింగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. సీనియర్ నటులు రాంకీ, రావు రమేష్ పాత్రలు కీలకంగా మారాయి. ఇలాంటి ప్రత్యేకతల నేపథ్యంలో RX 100 చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలోని విశేషాలను వెల్లడిస్తూ హీరో కార్తీకేయ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. కార్తీకేయ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

    ఊహించని రెస్పాన్స్

    ఊహించని రెస్పాన్స్

    RX 100 చిత్రానికి రిలీజ్‌కు ముందు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఇది మేము ఊహించలేదు. కథను నమ్మి మాత్రమే ఈ సినిమాను ఆరంభించాం. మంచి సినిమా చేయాలనుకొని ప్రారంభించాం. సినిమా మీద మాకు బాగా నమ్మకం ఉండటంతో ఒక చిన్న బజ్ వస్తే చాలు అనుకొన్నాం. కానీ టీజర్, ట్రైలర్ రిలీజ్‌ తర్వాత ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చూస్తే ఇది చిన్న సినిమా కాదు అని అంటున్నారు.

    నాకు నిజంగా అదృష్టమే..

    నాకు నిజంగా అదృష్టమే..

    RX 100 చిత్రంలోని శివ పాత్ర దొరకడం నిజంగా అదృష్టం. చాలా రకాల షేడ్స్, వేరియేషన్స్ ఉంటాయి. ఓ సారి చూస్తే ముద్దొస్తాడు. ఒక పాయింట్ టైమ్‌లో జాలి కలుగుతుంది. భయమేస్తుంది. విలన్‌లా కనిపిస్తాడు. ఎంతో కష్టపడితే తప్ప ఏ హీరోకైనా దొరకడం కష్టం. దర్శకుడు అజయ్ భూపతి వల్ల నాకు ఇలాంటి పాత్ర దొరికింది. అతడికి రుణపడి ఉంటాను.

     సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తాను

    సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తాను

    కథ విన్నాక ఆ పాత్ర గురించే ఎక్కువగా ఆలోచించాను. సినిమా ఓకే అయ్యాక సెట్స్‌పైకి వెళ్లడానికి రెండు నెలలకుపైగా సమయం దొరికింది. లుక్ పరంగా చాలా శ్రద్ద తీసుకొన్నాం. కొన్ని సీన్లలో సన్నగా ఉంటాను, మరికొన్ని సీన్లలో లావుగా ఉంటాను. కొన్ని సీన్లలో సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తాను. అలాగే నా కంటే ఎంతో సినియారిటీ ఉన్న రావు రమేష్, సింధూర పువ్వు రాంకీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే పంజాబీలో ఫిలింఫేర్ విన్నర్ పాయల్ రాజ్‌పుత్‌తో నటిస్తుండటంతో ఒళ్లు దగ్గరపెట్టుకొని చేశాను. ఒకవేళ నేను సరిగా చేయకపోతే హీరో మైనస్ అనే పేరు రాకుండా జాగ్రత్త పడ్డాను.

    చాలా వర్కవుట్ చేశా

    చాలా వర్కవుట్ చేశా

    ఫస్ట్ సినిమాకు ఇంటెన్సివ్ క్యారెక్టర్ దొరకడంతో ప్రతీ రోజు డైలాగ్స్‌ను చదివి ప్రాక్టీస్ చేశాను. అజయ్ భూపతితో చాలాసార్లు చర్చించాను. కొన్ని ప్రాక్టీస్ వీడియోలు డైరెక్టర్‌కు చూపించాను. నా వంతుగా చాలా కృషి చేశాను. అందుకే రిలీజ్‌కు ముందే మంచి పేరు వచ్చింది.

    రావు రమేష్, రాంకీ రెస్పాన్స్

    రావు రమేష్, రాంకీ రెస్పాన్స్

    RX 100 కథ వినగానే నిర్మాత అశోక్ రెడ్డి చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను టెక్నికల్‌గా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. స్టోరి వినగానే రావు రమేష్ గొప్పగా స్పందించారు. ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అని అప్పుడే చెప్పారు. నేను ఫస్ట్ షాట్‌లో నటించగానే నన్ను కౌగిలించుకొని ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయం అని అన్నారు. అలాగే రాంకీ నుంచి చాలా నేర్చుకొన్నాను. ఆయన చాలా సలహాలు ఇచ్చారు.

    బోల్డ్ కంటెంట్‌ సినిమా

    బోల్డ్ కంటెంట్‌ సినిమా

    RX 100 చాలా బోల్డ్ కంటెంట్‌తో కూడిన సినిమా. చాలా మంది హీరోయిన్లకు ఈ కథ చెప్పాం. లిప్‌లాక్‌లు, బోల్డుగా నటించాలన్న కారణంతో వారు వెనుకాడారు. దాంతో వారిపై కొంత చిరాకు కలిగింది. స్టోరిలో గొప్పతనం చూడకుండా లిప్‌లాక్‌లని కించపరిచే విధంగా మాట్లాడారు. అలాంటి సమయంలోనే పాయల్ రాజ్‌పుత్ నటించిన పంజాబీ సినిమా (సైరత్ రీమేక్) రిలీజైంది. ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ సమయంలో పాయల్‌ను సంప్రదించాం. స్టోరి వినగానే ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఒకే చెప్పింది.

    లెక్కలేనన్ని ముద్దులు

    లెక్కలేనన్ని ముద్దులు

    RX 100 చిత్రంలో హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్‌ది కీలకపాత్ర. కథపరంగా చాలా ముద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆడియెన్స్‌కు ఎక్కడా ఇబ్బందికరంగా ఉండదు. అలా ఈ సినిమాలో నేను, పాయల్ లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకొంటాము. చాలా ఇంటెన్సివ్ రొమాన్స్ ఉంటుంది. కానీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఆ రొమాన్స్ ఎక్కడా గుర్తుండదు. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది.

    నెక్ట్స్ లెవెల్ కథ కోసం..

    నెక్ట్స్ లెవెల్ కథ కోసం..

    RX 100 ట్రైలర్ రిలీజైన తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వాటిని ఒప్పుకోలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత నా యాక్టింగ్ లెవెల్స్ అందరికీ అర్ధమవుతాయి. ఆ తర్వాతనే మంచి కథతో కూడిన సినిమాను ఒప్పుకోవాలని అనుకొంటున్నాను. ఈ చిత్రం తర్వాత నా కెరీర్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లే కథ కోసం చూస్తాను. అది వచ్చే వరకు వేచి చూస్తాను అని హీరో కార్తీకేయ వెల్లడించారు.

    English summary
    Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 which is releasing this Friday. Starring Karthikeya and Payal, the film is an intense love story. This young director from Athreyapuram, West Godavari says that he always wanted to be a director even though he wasn’t aware what the work involved.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X