Chiranjeevi రేంజ్‌కు వెళ్లాలనే ఆశ లేదు.. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్‌తో.. వలిమై గురించి కార్తీకేయ
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా అద్భుతమైన పాత్రలో కనిపించనున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రంపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా యువ హీరో కార్తీకేయ మీడియాతో మాట్లాడుతూ..

వలిమై రెగ్యులర్ సినిమా కాదు..
వలిమై చిత్రం రెగ్యులర్ సినిమా కాదు. తమిళ నేటివిటి ఉండదు. హీరో, విలన్ ఐడియాలజీ మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఆకట్టుకొనేలా ఉంటుంది. వలిమై సినిమాలోని యాక్షన్ సీన్లు ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూసి ఉండరు. మదర్ సెంటిమెంట్ కూడా బాగుంటుంది. హీరో, విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగుంటుంది అని కార్తీకేయ తెలిపారు.

తమిళ భాషే ఓ ఛాలెంజ్
వలిమై సినిమా విషయానికి వస్తే.. నేను తమిళం నేర్చుకోవడం అతిపెద్ద ఛాలెంజ్. సినిమా కమిట్ అయ్యే ముందు నాకు తమిళ భాష రాదు. వేరే లాంగ్వేజ్‌లో వర్క్ చేయలేదు. భాష రాకపోతే నాకు నటించిన ఫీలింగ్ ఉండదు. అందుకే నేను భాషను నేర్చుకొన్నాను. తమిళ సినిమాలు చూడటం, నాకు తెలిసిన ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, ఇతర మార్గాల ద్వారా నేర్చుకొన్నాను. తమిళ డబ్బింగ్ చెప్పలేదు. తమిళంలో మళ్లీ సినిమా చేస్తే తప్పకుండా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలని అనుకొంటున్నాను అని కార్తీకేయ వెల్లడించారు.

భీమ్లా నాయక్ రిలీజ్ వార్తతో
వలిమై సినిమా ప్రమోషన్‌లో ఉండగా భీమ్లా నాయక్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటన వచ్చింది. దాంతో అయ్యో అనుకొన్నాను. కానీ భీమ్లా నాయక్ సినిమా చూడటానికి నేను ఆతృతగా ఉన్నాను. కానీ భీమ్లా నాయక్ తర్వాత సెకండ్ ఆప్షన్‌గా వలిమై ఉంటుంది. మా సినిమాకు భీమ్లా నాయక్ పోటీ అని అనుకోవడం లేదు. రెండు పెద్ద ప్రాజెక్టులు. రెండు సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని భావిస్తున్నాను అని కార్తీకేయ అన్నారు.

ఫెయిల్యూర్, సక్సెస్‌లను సమానంగానే..
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాకపోవడం కొంత నిరుత్సాహమే. కానీ నేను హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా నాకు చేతినిండా పని ఉంది. ఒక్కసారి చిరంజీవి రేంజ్‌కు వెళ్లాలనే ఆశలేదు. నా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ప్రస్తుతం ఒప్పుకున్న స్క్రిప్ట్ బాగున్నాయి. మళ్లీ కలిసే సమయానికి హిట్టు కొట్టావనే మీరే అంటారు అని కార్తీకేయ అన్నారు.

నేను నటించే చిత్రాలు..
యువీ క్రియేషన్‌లో ప్రశాంత్ అనే డైరెక్టర్‌తో ఓ సినిమా పూర్తి చేశాను. మరో రెండు సినిమాలు ఒప్పుకొన్నాను. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో మరో సినిమా ఒప్పుకొన్నాను. అజయ్ భూపతితో కలిసి మరో సినిమా చేస్తున్నాం. అజయ్‌తో సినిమా రెండు భాషల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సుకుమార్‌తో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది అని తన సినిమాల గురించి కార్తీకేయ చెప్పారు.

వలిమైలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: అజిత్ కుమార్, హ్యుమా ఖురేషి, కార్తీకేయ గుమ్మకొండ, యోగిబాబు, తదితరులు
రచన, దర్శకత్వం: హెచ్ వినోద్
నిర్మాత: బోని కపూర్
సినిమాటోగ్రఫి: నిరవ్ షా
ఎడిటింగ్: విజయ్ వెలుకుట్టి
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
బ్యానర్: బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్
బడ్జెట్: 150 కోట్లు
రిలీజ్ డేట్: 2022-02-24


Click it and Unblock the Notifications











