twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ajith నుంచి ఆ విషయం నేర్చుకొన్నా.. వలిమైలో యాక్షన్ సీన్లు అదుర్స్.. కార్తీకేయ ఇంటర్వ్యూ

    |

    RX 100 చిత్రంతో టాలెంటెడ్ హీరోగా తెలుగు సినిమాకు పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ.. ఆ తర్వాత సినిమా సినిమాకు రేంజ్‌ పెంచుకొంటూ వెళ్తున్నారు. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా భారీ ఆఫర్లను దక్కించుకొంటున్నాడు. హీరో, విలన్ అని చూసుకోకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో విలన్‌గా దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకొనేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా కార్తీకేయ మీడియాతో మాట్లాడుతూ..

    స్ట్రాంగ్‌ విలన్ కోసం ప్రయత్నం అంటూ

    స్ట్రాంగ్‌ విలన్ కోసం ప్రయత్నం అంటూ


    2019‌లో నాకు దర్శకుడు హెచ్ వినోద్ నుంచి కాల్ వచ్చింది. అప్పటికే నేను ఆయన దర్శకత్వం వహించిన ఖాకీ సినిమా చూడటంతో ఎక్సైటింగ్‌గా ఫీలయ్యా. ఆయనతో మాట్లాడినప్పుడు అజిత్‌తో ఒక సినిమా చేస్తున్నాను. అందులో హీరో ఇమేజ్ ఉండి ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండే విలన్ కోసం చూస్తున్నాం. మీరు నటించిన RX 100 చూశాను. మీ సెట్ అవుతారని అనుకొంటున్నాం. మీరు చేయగలరా అని అడిగాడు. దాంతో నా క్యారెక్టర్ గురించి చెప్పమని అడిగితే.. వాళ్ల అసిస్టెంట్‌ను పంపించారు. నా పాత్ర గురించి విన్న తర్వాత గ్యాంగ్ లీడర్ కంటే ఎక్కువ షేడ్స్ కనిపించాయి. వెంటనే అజిత్‌ పక్కన విలన్‌గా చేయడానికి ఒప్పుకొన్నాను అని కార్తీకేయ తెలిపారు.

     వలిమై అంటే అర్ధం ఇదే..

    వలిమై అంటే అర్ధం ఇదే..


    వలిమై అనేది తమిళ పదం. వలిమై అంటే బలం. కేవలం శారీరక బలం కాదు.. మానసిక బలం అనే అర్ధం. వలిమై అంటే బలం. ముందుగా ఈ టైటిల్‌ను పెడుదామని అనుకొన్నాం. కానీ అప్పటికే వలిమై అనే వర్డ్ చాలా పాపులర్ అయింది. ఇంకా తెలుగులో వేరే పేరు పెడితే డబ్బింగ్ సినిమా మాదిరిగా ఉంటుంది. వలిమై పెట్టమని నేను సలహా ఇచ్చాను. అలా వలిమై టైటిల్‌ను తెలుగులో కొనసాగించాం అని కార్తీకేయ చెప్పారు.

    వలిమై పాత్రతో నాకు మంచి గుర్తింపు

    వలిమై పాత్రతో నాకు మంచి గుర్తింపు

    గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా ఒక సింగిల్ పాయింట్ స్టోరి ఉండేది. కానీ వలిమై విషయానికి వస్తే.. చాలా షేడ్స్ ఉన్నాయి. అజిత్ పక్కన కాబట్టి విలన్‌గా ఇంకా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. తమిళంలో నాకు మంచి గుర్తుంపు వస్తుంది. అలాగే మంచి మార్కెట్‌ వస్తుందనే ఉద్దేశంతో ఒప్పుకొన్నాను. అప్పటికే గ్యాంగ్ లీడర్ చూశామని యూనిట్ చెప్పారు. గ్యాంగ్ లీడర్‌లో కారు రేసర్ కావాలనే పాయింట్.. ఇందులో బైక్ రేసర్ కావాలనే పాయింట్ ఉంది. మొత్తానికి రేసర్ అనే పాయింట్ నన్ను వెంటాడుతున్నది అని కార్తీకేయ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

    అజిత్‌ నుంచి నేర్చుకొన్నది అదే..

    అజిత్‌ నుంచి నేర్చుకొన్నది అదే..

    అజిత్‌తో పనిచేయడం గొప్ప అదృష్టం. ఆఫర్ వచ్చిందనే విషయం నాకు మంచి తృప్తిని ఇచ్చింది. అతడితో మాట్లాడిన తర్వాత ప్రొఫెషనల్ లెవెల్‌లో ఊహించని అనుభవాలు చవిచూశా. ఓ సీన్‌లో బైక్‌పై నుంచి పడిన తర్వాత వెంటనే షూట్‌కు సిద్దమయ్యారు. అయితే దెబ్బ గట్టిగా తగిలినట్టు ఉంది.. మీరు రెస్ట్ తీసుకోండి అంటే.. మీ రెండు రోజుల డేట్స్ ఉన్నాయి. ఫైట్ మాస్టర్ డేట్స్ మళ్లీ సెట్ కావాలి. ఈ లొకేషన్‌కు రావాలి. ఇదంతా నిర్మాత కష్టం. అందుకే ఒకరోజు నేను ఓపిక పడితే అంతా సెట్ అవుతుందని అన్నాడు. ఆ రేంజ్‌లో ఉన్న యాక్టర్ అలా ఆలోచిస్తే.. నా లాంటి వాడు ఎలా ఆలోచించాలి. ఆయన నుంచి పక్కాగా ప్రొఫెషనలిజాన్ని నేర్చుకొన్నాను అని కార్తీకేయ అన్నారు.

    ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే

    ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే

    వలిమై సినిమా కోసం బైక్ రేసింగ్ కోసం నేను ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. సినిమా ఆఫర్ వచ్చినప్పుడు నేను ఎలాంటి శిక్షణ తీసుకోవాలా? దర్శకుడు వినోద్‌తో అడిగాను. అయితే మీరు ఆర్ఎక్స్ 100లో బైక్ నడిపారు కదా అని అన్నారు. అయితే అది కేవలం బైక్ నడపటం.. రేసింగ్ కాదు కదా అంటే.. అవసరం లేదు అని చెప్పారు. అయితే షూట్ సమయంలో సురక్షితమైన చర్యలు తీసుకొన్నాం. 80 శాతం డూప్ లేకుండా నటించాం. 20 శాతం బాడీ డబుల్ పెట్టుకొన్నాం. యాక్టింగ్ గురించి పెద్దగా చర్చించుకోలేదు. కాకపోతే నేను ఆయన సినిమాలు అని కార్తీకేయ తెలిపారు.

     హీరోనా? విలన్ అనేది పట్టించుకోను

    హీరోనా? విలన్ అనేది పట్టించుకోను

    హీరో, విలన్‌ అనేది పెద్దగా పెట్టించుకోను. కెమెరా ముందుకు వచ్చామంటే క్యారెక్టర్ పరంగా ఫెర్ఫార్మ్ చేయాల్సిందే. విలన్ అంటే పెర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. హీరో అయితే కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్స్‌ప్రెషన్స్‌కు లిమిటేషన్ ఉంటుంది. సైకో నేచర్ ఉండే విలన్ చేసేటప్పుడు మన ప్రతిభకు ఛాలెంజ్‌గా అనిపిస్తుంది. ఇంకా యాక్టింగ్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రజనీకాంత్, చిరంజీవి విలన్‌గా నటించిన పాత్రలు చాలా బాగా ఉంటాయి అని కార్తీకేయ తెలిపారు.

    ప్యాన్ ఇండియా స్థాయిలో

    ప్యాన్ ఇండియా స్థాయిలో

    నా కెరీర్‌లో వలిమై చిత్రం అతిపెద్ద ప్రాజెక్ట్. నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంత రేంజ్‌లో ఉంటుందని అనుకోలేదు. ఆ రోజు తమిళంలోనే ఉంటుందని అనుకొన్నాను. బోని కపూర్ నిర్మాత కావడం నాకు హ్యాపీగా అనిపించింది. వలిమై సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ప్యాన్ ఇండియా సినిమాల నిర్మాణం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా కెరీర్‌లో వలిమై రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా కన్నడ, తమిళం, మలయాళం, ఇతర భాషల్లో నాకు గుర్తింపు వస్తుంది అని కార్తీకేయ చెప్పారు.

    English summary
    Ajith's Valimai is set to release on February 24th. Kartikeya is playing antagonist in this movie. In this occassion, Kartikeya Gummakonda speaks to Filmibeat Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X