twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi కి మెసేజ్ చేస్తే.. గుడ్‌ లక్ అంటూ రిప్లై.. ఆనందంలో మునిగిపోయిన కార్తికేయ

    |

    RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు.'రాజా విక్ర‌మార్క‌'లో ఎన్ఐఏ ఏజెంట్‌గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తికేయతో ఇంటర్వ్యూ...

    మంచి కామెడీ టైమింగ్‌తో

    మంచి కామెడీ టైమింగ్‌తో

    నేను ఇప్పటివరకూఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్ట‌యిలిష్‌గా ఉంటుంది .ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్ర‌స్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటివరకూనేను టచ్ చేయని జానర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఆటు వినోదం కూడా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి. మా '88' రామారెడ్డి, ఆదిరెడ్డిగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లకు తొలి సినిమా అయినా ఖర్చుకు వెనుకాడలేదు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా... థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే అని కార్తీకేయ అన్నారు.

    యాక్షన్ సినిమాలు చేశా గానీ..

    యాక్షన్ సినిమాలు చేశా గానీ..

    రాజా విక్రమార్క చిత్రంలోని తన పాత్ర గురించి మాట్లాడుతూ... ఇంతకు ముందు యాక్షన్ సినిమాలు చేశానుకాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. యాక్షన్ చేసినంత ఎక్కువగా కామెడీ చేయలేదు. ఈ మూవీలో ఉన్నట్టు చేయలేదు. కష్టమని కాదు గానీ... కామెడీ పాత్రలో నన్ను పూర్తిగా ఒప్పుకొంటారా అనే క్యూరియాసిటీ ఉంది. బేసిగ్గా... నేను బయట చాలాజోవియ‌ల్‌గా ఉంటాను. జోక్స్ వేయడం, ఫ్రెండ్స్ మీద పంచ్ డైలాగ్స్ వేయడం ఎక్కువ. అందువల్ల, కామెడీ చేయడం కష్టం ఏమీ అనిపించలేదు. బయట ఎలా ఉంటానో అలా నటిస్తే క్యారెక్టర్ చేయవచ్చని అనిపించింది. డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా అని కార్తీకేయ చెప్పారు

    RX 100 టైమ్‌లో క‌థ

    RX 100 టైమ్‌లో క‌థ

    RX 100టైమ్‌లో క‌థ విన్నాన‌ు. డైరెక్టర్‌ కథను డీల్ చేసిన విధానం బాగుంది. చాలా విషయాల్లో దర్శకుడి మీద నమ్మకం వచ్చింది. శ్రీ సరిపల్లి కథ చెప్పిన తర్వాత ఓ పది నిమిషాలు మాట్లాడాను. ఆ తర్వాత అతను చేయగలడని నమ్మకం వచ్చింది. స్క్రిప్ట్. వినడానికి బావుంటుంది. కానీ, కరెక్ట్ విజువల్, మ్యూజిక్ పడినప్పుడు స్క్రీన్ మీద చూడటానికి బావుంటుంది. మేకింగ్ డిపెండ్ అయినసినిమా. శ్రీనికలిసినప్పుడు అతను చేయగలడనిఅనిపించింది.ఒక్కోషెడ్యూల్ అవుతున్నప్పుడు నా నమ్మకం మరింత బలపడింది అని కార్తీకేయ చెప్పారు.

    రాజా విక్రమార్క టైటిల్ ఎందుకు పెట్టామంటే..

    రాజా విక్రమార్క టైటిల్ ఎందుకు పెట్టామంటే..

    రాజా విక్రమార్క టైటిల్ పెట్టడంపై కార్తీకేయ వివరిస్తూ.. శ్రీ సరిపల్లి ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. 'రాజా విక్రమార్క' టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. పాజిటివిటీ... చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడని కార్తీకేయ చెప్పాడు.

    Recommended Video

    Raja Vikramarka Pre Release Event సినిమాకి పాత రోజులు వచ్చాయి Vishwak Sen
    చిరంజీవికి మెసేజ్ చేస్తే...

    చిరంజీవికి మెసేజ్ చేస్తే...

    రాజా విక్రమార్క అని టైటిల్ పెట్టిన తర్వాత చిరంజీవి గారికి చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందనితెలిశాక రిజిస్టర్ చేశా. తర్వాత ఆయనకు ఈ టైటిల్ పెట్టామని మెసేజ్ పంపించా. నా మెసేజ్ చూసి గుడ్ లక్ అని చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో చిరంజీవి టైటిల్ పెట్టుకున్నాను అని కార్తికేయ తన ఆనందాన్ని పంచుకొన్నాడు.

    English summary
    Raja Vikramarka movie is coming to Theatres on November 12th. In this occassion Kartikeya Gummakonda speaks to media. He said, Raja Vikramarka is inspiration from Mission Impossible
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X