Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
దటీజ్ అజిత్.. సూపర్‌స్టార్‌పై కార్తీకేయ ప్రశంసల వర్షం
RX 100 ఫేమ్ కార్తీకేయ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హీరో పాత్రలకే కాకుండా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా తెర మీద తన ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్న కార్తికేయ గతేడాది గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. నానితోపాటు తన నటనతో ఆకట్టుకొన్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అజిత్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు.
అజిత్ నటిస్తున్న వాలిమై చిత్రంలో విలన్‌గా కీలక పాత్రను పోషించడం కార్తీకేయకు ప్రమోషన్ లభించినట్టే భావించాలనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అయితే తాజాగా తన లేటేస్ట్ చిత్రం చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్లో అజిత్ గురించి, వాలిమై సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అజిత్ ఒక స్టార్ హీరోగానే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్. అతడిని కలిసిన ప్రతీక్షణం నాకు కొత్త అనుభూతి. వాలిమై సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. స్పెయిన్‌లో అజిత్, నా కాంబినేషన్లో కొన్ని సీన్లు చిత్రీకరించాలి. అయితే స్పెయిన్‌లో కరోనా పరిస్థితుల కారణంగా షూటింగులకు అనుమతి లేదు. త్వరలోనే అనుమతులు లభిస్తే షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం అని కార్తీకేయ చెప్పారు.
బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషీ నటిస్తున్న వాలిమై చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మాణ సారథ్యంలో హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2021లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.