twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ అజిత్.. సూపర్‌స్టార్‌పై కార్తీకేయ ప్రశంసల వర్షం

    |

    RX 100 ఫేమ్ కార్తీకేయ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం హీరో పాత్రలకే కాకుండా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా తెర మీద తన ప్రతిభను చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్న కార్తికేయ గతేడాది గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. నానితోపాటు తన నటనతో ఆకట్టుకొన్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అజిత్‌తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకొన్నారు.

    అజిత్‌ నటిస్తున్న వాలిమై చిత్రంలో విలన్‌గా కీలక పాత్రను పోషించడం కార్తీకేయకు ప్రమోషన్‌ లభించినట్టే భావించాలనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అయితే తాజాగా తన లేటేస్ట్ చిత్రం చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్‌లో అజిత్ గురించి, వాలిమై సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

    Kartikeya Gummakonda reveals greatness of Thala Ajith Kumar

    అజిత్‌ ఒక స్టార్ హీరోగానే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్. అతడిని కలిసిన ప్రతీక్షణం నాకు కొత్త అనుభూతి. వాలిమై సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. స్పెయిన్‌లో అజిత్‌, నా కాంబినేషన్‌లో కొన్ని సీన్లు చిత్రీకరించాలి. అయితే స్పెయిన్‌లో కరోనా పరిస్థితుల కారణంగా షూటింగులకు అనుమతి లేదు. త్వరలోనే అనుమతులు లభిస్తే షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం అని కార్తీకేయ చెప్పారు.

    బాలీవుడ్ హీరోయిన్ హ్యుమా ఖురేషీ నటిస్తున్న వాలిమై చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా. బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మాణ సారథ్యంలో హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2021లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Chaavu Kaburu Challaga is an upcoming Telugu Feature Film Presented by Allu Aravind, Ft. Kartikeya, Lavanya Tripathi, Aamani & others in Lead Roles, Directed by Koushik Pegallapati, Music by Jakes Bejoy & Produced by Bunny Vas Under GA2 Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X