Gurtundha seethakalam తమన్నాతో నాకు అలాంటి పరిస్థితి.. హార్ట్‌ను టచ్ చేసేలా.. హీరోయిన్ కావ్య శెట్టి

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, యువ హీరోయిన్ కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహ‌సిని త‌దిత‌రులు న‌టించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. క‌న్న‌డ‌ ద‌ర్శ‌కుడు, న‌టుడు నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్, మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌లవుతున్న నేపథ్యంలో హీరోయిన్ కావ్య శెట్టి మీడియాతో మాట్లాడుతూ..

Kavya Shetty
నేను కర్ణాటక రాష్ట్రానికి చెందిన నటిని. ఇప్పటి వరకు కన్నడ సినిమాలు చేశాను. ఇటీవల నేను నటించిన లవ్ మాక్టేల్ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే మలయాళంలో ఒక సినిమా, తమిళంలో మూడు సినిమాలు చేశా. గుర్తుందా శీతాకాలం నాకు తెలుగులో మొదటి చిత్రం అని కావ్య శెట్టి తెలిపారు.

గుర్తుందా శీతాకాలం సహజంగా ఉండే మూడు రకాల షేడ్స్ ఉండే విభిన్నమైన ప్రేమ కథా చిత్రం. ముగ్గురు హీరోయిన్లు విలక్షణమైన పాత్రలతో కనిపిస్తారు. లవ్ స్టోరీలు సాధారణంగా ఉండవు. ప్రతీ ఒక్కరి హృదయాన్ని టచ్ చేసేలా ఉంటాయి. నేను కాలేజీ గర్ల్‌గా అమ్ములు పాత్రలో నటించాను. నా పాత్ర మంచి వినోదాన్ని పంచడమే కాకుండా ప్రేక్షకులకు నవ్వు పంచుతుంది అని కావ్య శెట్టి అన్నారు.

నా తోటి నటుడు సత్యదేవ్ చాలా సహకరించారు. డైలాగ్స్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. ఆయన హర్డ్ వర్క్ చూసి ఫిదా అయ్యాను. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. అయితే తమన్నాతో నాకు కాంబినేషన్ సీన్లు లేవు. కానీ ప్రియదర్శితో కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయి. నాకు గ్లామర్ రోల్స్ అంటే చాలా ఇష్టం. డీ గ్లామర్ రోల్స్‌లో నటించడానికి అభ్యంతరం ఏమీ లేదు. గుర్తుందా శీతాకాలం సినిమా నా కెరీర్‌కు చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి కరెక్ట్ అని భావిస్తున్నాను అని కావ్య శెట్టి అన్నారు.

కోవిడ్ పరిస్థితుల కారణంగా గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేట్రికల్ రిలీజ్‌పైనే నిర్మాతలు రామారావు చింతపల్లి, భావ‌న ర‌వి, నాగ శేఖర్ నమ్మకం పెట్టుకొన్నారు. యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. అలాంటి చిత్రాన్ని అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు అని కావ్య శెట్టి చెప్పారు.

కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నేహా శెట్టి, కృతి శెట్టిని ఆదరించారు. వారిని ఆదరించినట్టే నన్ను ఆదరించాలని కోరుకొంటున్నాను. ఈ సినిమా తర్వాత మూడు కన్నడ సినిమాలు, ఆమెజాన్‌లో వెబ్ సిరీస్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X