కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్ కొట్టేసిన దొంగలు.. మహేష్ కు దెబ్బలు తగలడంతో షాకింగ్ గా?
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట.. ఈ సినిమా మే 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఈమంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ అలాగే పరశురాం సినిమాకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు మూడు సార్లు కొట్టాను అనే విషయాన్ని కీర్తి సురేష్ పంచుకుంది. అలాగే తన డ్రెస్ దొంగిలించబడింది అనే విషయాన్ని కూడా ఆమె బయట పెట్టింది.. ఆ వివరాల్లోకి వెళితే

సినిమా మీద భారీ అంచనాలు
సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న తరువాత మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకింగ్ మోసాలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్స్ ప్లస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది.

డ్రెస్ దొంగతనం
సినిమా యూనిట్ కూడా ప్రతిరోజు వార్తల్లో నిలిచే విధంగా సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ కళావతి సాంగ్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలు పంచుకుంది. ఆ సాంగ్ లో కీర్తి సురేష్ ధరించడం కోసం ప్రొడక్షన్ టీం ఒక అందమైన డ్రెస్ సిద్ధం చేసి తెచ్చి పెట్టారట. అయితే అడ్రస్ ఎక్కడ పెడుతున్న విషయాన్ని గమనించిన కొంతమంది వ్యక్తులు డ్రెస్ పెట్టిన రూమ్ తలుపులు బద్దలు కొట్టి డ్రెస్ దొంగతనం చేశారట.

కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
డ్రెస్ వేసుకోవడం కోసం లోపలికి వెళ్ళిన కీర్తి సురేష్ కి ఆ డ్రెస్ దొంగతనం జరిగింది అనే విషయం అర్థం కావడంతో వెంటనే నిర్మాతల దృష్టికి తీసుకు వెళ్ళిందట. డ్రెస్ పోతే పోయింది షూటింగ్ ఆగకూడదు అనే ఉద్దేశంతో మరో డ్రెస్ సిద్ధం చేయించి షూటింగ్ కానిచ్చారట. బార్సిలోనా లాంటి దేశంలో ఇలా దొంగతనం జరగడంతో కీర్తి సురేష్ కాస్త షాక్ కు గురైందట. ఇక మహేష్ బాబుతో తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా కీర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సరదాగానే ఉంటారు
మహేష్ బాబు ఆన్ స్క్రీన్ కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే మరి ఆఫ్ స్క్రీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అని యాంకర్ కీర్తిని అడిగితే ఆమె దానికి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహేష్ బాబు గారితో నటించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న ఆమె సెట్లో మహేష్ ఎప్పుడూ సరదాగానే ఉంటారన్న విషయం చెప్పుకొచ్చింది.

ఆశ్చర్యం వేసింది
సాంగ్ షూటింగ్ చేస్తున్న సమయంలో టైమింగ్ మిస్ అయి స్టెప్పులు మర్చిపోయాను ఆ సమయంలో నా చెయ్యి ఆయన ముఖానికి రెండు మూడు సార్లు తగిలింది నేను వెంటనే సారీ చెప్పాను కానీ మూడో సారి మాత్రం బలంగా తగలడంతో వెంటనే మహేష్ గారు నేనేమైనా తప్పు చేశానా అందుకే కొడుతున్నావా అన్నట్లు మాట్లాడటంతో తొలుత ఏమనాలో అర్థం కాలేదని తర్వాత ఆయన సరదాగా తీసుకుని అలా అన్నారు అనే విషయం అర్థమై ఆశ్చర్యం వేసింది అని కీర్తి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











