Keerthy Suresh Interview దసరాలో ఆ రెండు సవాళ్లు అధిగమించా.. బాలీవుడ్‌కు అందుకే దూరం.. కీర్తీ సురేష్

మహానటి చిత్రంతో అగ్రనటిగా మారిన కీర్తీ సురేష్ తన ప్రతిభకు అద్దంపట్టే చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించే ప్రయత్నం చేస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తెరపైన రాణిస్తూనే తన టాలెంట్‌ను ప్రదర్శించే పాత్రలతో విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నది. ఈ క్రమంలో కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం దసరా. నేచురల్ స్టార్ నానితో మరోసారి జతకట్టిన బ్యూటీ.. ఈ సారి మాత్రం తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించింది. ఇప్పటికే ఆమెపై చిత్రీకరించిన పాటలు భారీ క్రేజ్‌ను సంతరించుకొన్నాయి. మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దసరా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో కీర్తి సురేష్ మాట్లాడుతూ...

మేకప్‌తో అలాంటి కష్టాలు..

మేకప్‌తో అలాంటి కష్టాలు..

దసరా సినిమాలో వెన్నెల పాత్ర ఛాలెంజ్‌తో కూడుకొన్నది. దుమ్ము, ధూళి, బొగ్గు, మైనింగ్ బ్యాక్ డ్రాప్‌లో షూట్ చేశాం. పక్కా పల్లెటూరి యువతిగా, నల్లగా కనిపించడానికి ప్రత్యేకంగా మేకప్ వేశారు. షూటింగ్ ముగిసిన తర్వాత మేకప్ తీయడానికి చాలా సమయం పట్టేది. వెన్నెల పాత్ర కోసం వేసిన మేకప్ వల్ల నా లుక్ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టేది అని కీర్తీ సురేష్ చెప్పారు.

భాష, యాస చాలా కష్టంగా

భాష, యాస చాలా కష్టంగా


దసరా సినిమాలో మేకప్ ఓ ఛాలెంజ్ అయితే.. తెలంగాణ యాస మాట్లాడటం మరో సవాల్‌గా మారింది. భాష, యాస నాకు కష్టంగా అనిపించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోషియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాసను చక్కగా నేర్పించారు. అలాగే యాస విషయంలో ఓ ప్రొఫెసర్ కూడా సహాయం చేశారు. భాషకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని సినిమాలో పొందుపరిచారు. యాసపై పట్టు రావడంతో దసరాకి నేనే డబ్బింగ్ చెప్పాను. సాధారణం ప్రతీ సినిమాకు రెండు, మూడు రోజులు డబ్బింగ్ చెబుతాను. కానీ దసరాకు ఐదు నుంచి ఆరు రోజులు డబ్బింగ్ చెప్పాను అని కీర్తీ సురేష్ అన్నారు.

జాతీయ అవార్డు వస్తుందా? అంటే..

జాతీయ అవార్డు వస్తుందా? అంటే..


దసరా సినిమా చేస్తున్నప్పుడు మహానటి మూవీ చేసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగిందో.. అలాంటి అనుభూతిని పొందాను. మహానటికి మాదిరిగానే దసరాకు జాతీయ అవార్డు వస్తుందా అంటే.. ప్రస్తుతం నేను ఆశించడం లేదు. ప్రస్తుతం సినిమా బాగా ఆడాలని మాత్రమే కోరుకొంటున్నాను. వెన్నెల పాత్ర అందరికి కనెక్ట్ అవుతుంది అని కీర్తి సురేష్ చెప్పారు.

శ్రీకాంత్ అద్బుతమైన దర్శకుడు

శ్రీకాంత్ అద్బుతమైన దర్శకుడు


దసరా సినిమా కథను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా రాసుకున్నారు. దర్శకుడిగా అనుభవం లేకపోయినా.. తెర మీద ఏ పాత్ర ఎలా బిహేవ్ చేయాలనే విషయంలో పూర్తిగా స్పష్టత ఉంది. నా పాత్రను ఓ స్థాయిలో రాసుకొన్నారు. నా పాత్ర ఔచిత్యాన్ని, ఆ పాత్రలోని డెప్త్, ఇంటెన్సిటీని అర్ధం చేసుకొని నటించాను. శ్రీకాంత్ అద్బుతమైన ప్రతిభ ఉన్న దర్శకుడు. ఎక్కడ కొత్త దర్శకుడిగా గానీ.. దసరా అతడికి మొదటి సినిమా అనే ఫీలింగ్ కలుగనివ్వలేదు. శ్రీకాంత్ లాంటి దర్శకుడు తెలుగు సినిమాకు దొరకడం ఆనందంగా ఉంది అని కీర్తీ సురేష్ అన్నారు.

ఆ పాట విన్నప్పుడే.. సూపర్ హిట్ అనుకొన్నా

ఆ పాట విన్నప్పుడే.. సూపర్ హిట్ అనుకొన్నా


దసరా సినిమాలో చమ్కీల అంగీలేసుకొని పాట విన్నప్పుడు.. ఆ పాటలో నటించేటప్పుడు తప్పకుండా హిట్ అవుతుందని అనుకొన్నాను. పెళ్లిళ్లలో ఈ సాంగ్ మార్మోగుతుందని అనుకొన్నాను. నేను ఊహించినట్టే చమ్కీల అంగీలేసుకొని పాట సూపర్ హిట్ అయింది. పాటలో సాహిత్యం అందంగా ఉంది. నేను ఊహించిన దాని కంటే మంచి రెస్పాన్స్ వచ్చింది అని కీర్తీ సురేష్ పేర్కొన్నారు.

బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు.. కానీ

బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు.. కానీ


మహానటి సినిమా తర్వాత బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. కొన్ని కథలు నాకు నచ్చలేదు. కొన్ని పాత్రలు నన్ను మెప్పించలేవు. అందుకే బాలీవుడ్‌కు దూరంగా ఉన్నాను. దసరా ప్రస్తుతం హిందీలో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా తర్వాత హిందీ సినిమా రంగం నుంచి వచ్చే ఆఫర్లపై దృష్టిపెడుతాను అని కీర్తీ సురేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X