twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖుషీ సినిమాలో భూమిక పాత్ర స్పూర్తితో.. రంగ రంగ వైభవంగా ఫ్యామిలీ ప్యాక్ మూవీ.. కేతికా శర్మ

    |

    రంగ రంగ వైభవంగా చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఈ సినిమాను ఒప్పుకోవడానికి రొమాన్స్ ఒక ఎలిమెంట్ కారణం. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రతీ ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇది ఓవరాల్‌గా ఫ్యామిలీ ప్యాక్ లాంటి చిత్రం అని కేతికా శర్మ తెలిపారు. రొమాంటిక్ సినిమా తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి కేతికా శర్మ రంగ రంగ వైభవంగా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కేతికా శర్మ మీడియాతో మాట్లాడుతూ..

     సక్సెస్, ఫెయిల్యూర్స్ పట్టించుకోను..

    సక్సెస్, ఫెయిల్యూర్స్ పట్టించుకోను..

    నా గత సినిమాలు రొమాంటిక్, లక్ష్య ఫలితంతో నాకు ఎలాంటి డిజపాయింట్ కలుగలేదు. నేను నా సినిమా బాగా ఆడాలని కావాలనుకొంటాను. కానీ సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోను. నా పాత్రను నేను బాగా చేశానా? నేను నా పాత్రకు న్యాయం చేశానా? అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొంటాను. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఎవరి కంట్రోల్‌లో ఉండవు. నేను ఎంత బాగా నటించాను అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది అని అన్నారు.

    వైష్ణవ్ తేజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్

    వైష్ణవ్ తేజ్ నాకు బెస్ట్ ఫ్రెండ్

    వైష్ణవ్ తేజ్‌తో ఆఫ్ స్క్రీన్, స్క్రీన్ కెమిస్ట్రీ బాగా ఉంది. సినిమా పరిశ్రమలోని నాకు ఇష్టమైన ఫ్రెండ్స్‌లో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఆన్ స్క్రీన్‌పై మేము ఎప్పుడు తగాదా పడుతుంటాం. అలాగే ఆఫ్ స్క్రీన్‌లో కూడా అలానే ఉంటాం. నా తోటి యాక్టర్‌తో పోట్లాడం సరదాగా ఉంటుంది. నన్ను వారు కెలుకుతారు.. నేను వారిని కెలికి ఏడిపించాను. వైష్ణవ్ తేజ్ చాలా సింపుల్ వ్యక్తి. షూటింగు సమయంలో నేలపైనా కూడా కూర్చోవడానికి వెనుకాడడు అని కేతికా శర్మ చెప్పింది.

    ప్రతీ సినిమా ఒక్కో అనుభవం

    ప్రతీ సినిమా ఒక్కో అనుభవం

    రంగ రంగ వైభవంగా నా కెరీర్‌లో మూడో సినిమా. గతంలో రొమాంటిక్, లక్ష్య సినిమాలు చేశాను. ప్రతీ సినిమా నాకు ఒక్కో అనుభవాన్ని అందించింది. రొమాంటిక్ సినిమా చేసేటప్పుడు యూనిట్‌తో కనెక్ట్ అయిన విధానం, షూటింగ్ చేసేటప్పుడు ఫన్‌‌తో వర్క్ చేశాం. తొలి సినిమా కావడంతో సెట్‌లో ఎలా ఉండాలనే అనుభవాన్ని నేర్చుకొన్నాం.

    ఇక లక్ష్య సినిమాకు వచ్చే సరికి నేను టెక్నికల్ అంశాలపై దృష్టిపెట్టాను. కెమెరా యాంగిల్, లైటింగ్ లాంటి విషయాలను నేర్చుకొన్నాను. రంగ రంగ వైభవంగా సినిమాకు వచ్చే సరికి.. ఎక్కువ మంది నటీనటులతో వర్క్ చేయడం వల్ల వచ్చే అనుభవం, అనుభూతి అందించింది అని కేతికా శర్మ చెప్పారు.

    సీనియర్ నటులతో కలిసి నటించడం

    సీనియర్ నటులతో కలిసి నటించడం

    రంగ రంగ వైభవంలో సీనియర్ యాక్టర్లతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. నరేష్, ప్రగతి, తులసి, ప్రభు సార్ లాంటి డిఫరెంట్ టాలెంట్ ఉన్న నటులతో నటించడం నాకు చాలా ఉపయోగపడింది. ఈ సినిమా షూటింగ్ పార్టీలా కొనసాగింది. అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. బిర్యానీ తింటూ సీనియర్ నటులు చెప్పే అనుభవాలను వింటూ చాలా నేర్చుకొన్నాను అని కేతికా శర్మ చెప్పారు.

    ఖుషీ సినిమాలో భూమిక పాత్ర మాదిరిగా

    ఖుషీ సినిమాలో భూమిక పాత్ర మాదిరిగా

    రంగ రంగ వైభవంగా చిత్రంలో నా పాత్ర పేరు రాధ. చాలా బ్యాలెన్స్‌గా ఉండే అమ్మాయి పాత్ర. ప్రేమ, ఫ్యామిలీ, కెరీర్ లాంటి అంశాలతో ముందుకెళ్లే పాత్ర. ఈ సినిమా చూస్తే ప్రతీ ఒక్క అమ్మాయి తనను రాధ పాత్రతో కనెక్ట్ అవుతారు. ఈ తరం అమ్మాయిల తరహా ఉండే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర ఖుషీ సినిమాలో భూమిక పాత్ర మాదిరిగా ఉంటుంది. నేను పోషించిన పాత్రకు ఓ రకమైన ఇగో ఉంది. కానీ నా తరహాలో ఈ పాత్రను పోషించాను. ఖుషీ సినిమాలోని భూమిక పాత్ర రాధ రోల్‌కు ఇన్సిపిరేషన్ అనుకోవచ్చు. రాధ మెడికల్ స్టూడెంట్ పాత్రను పోషించాను. రాధ పర్‌ఫెక్ట్ అమ్మాయిగా కనిపిస్తుంది అని కేతికా శర్మ అన్నారు.

    English summary
    Actress Ketika Sharma's latest movie Ranga Ranga Vaibhavanga is set to release on September 2nd. Here is the some chit chat about Ketika Sharma about her career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X