For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలాంటి కోరికను పూరీ జగన్నాథ్ తీర్చాడు.. యువ హీరోయిన్ కేతిక శర్మ )ఇంటర్యూ)

  |

  వరుడు కావలెను మూవీ తర్వాత యువ హీరో నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌గా కేతిక శర్మ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ..

   ఒకే ఒక్క కల అంటూ

  ఒకే ఒక్క కల అంటూ

  నా జీవితంలో ఒకే ఒక్క కల ఉండేది. నటిని అవ్వాలని అనుకున్నాను. అయ్యాను. కానీ అదెలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా పేరెంట్స్ డాక్టర్స్. మాకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. వారు నాకు ఓ ఏడాది టైం ఇచ్చారు. అంతలోనే నటిని అయ్యాను. మొదటి సినిమా రొమాంటిక్. పూరి జగన్నాథ్ గారి సినిమా. ఆయన్నుంచి కాల్ వస్తే ఎలా కాదనగలం. అలా పూరి జగన్నాథ్ గారు పిలవడంతో సినిమాకు ఓకే చెప్పేశాను. రొమాంటిక్ సినిమాలో గ్లామరస్ రోల్. ఇందులో మాత్రం ఎమోషనల్ పాత్రలో కనిపిస్తాను.

  నా నిజ జీవితంలో కూడా అంతే

  నా నిజ జీవితంలో కూడా అంతే

  లక్ష్య సినిమాలో రితిక తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంటుంది. నేను కూడా నిజ జీవితంలో అంతే. కానీ రితికలా పెళ్లి గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించను. నాలాంటి వాళ్లను భరించడం కష్టం. మనసుకు ఏదనిపిస్తే అది చేసే వాళ్లతో వేగడం కష్టం.

   సంతోష్ చెప్పిన కథ విని..

  సంతోష్ చెప్పిన కథ విని..

  కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను. లక్ష్య సినిమాలో రితిక పాత్రను పోషించాను. ఆమె తన మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తుంది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తాను. లక్ష్య చిత్రం పార్దు చుట్టూ తిరుగుతుంది. అతన్ని ప్రేమించే పాత్రలో రితిక కనిపిస్తుంది.

   నాగశౌర్య గురించి కేతిక శర్మ

  నాగశౌర్య గురించి కేతిక శర్మ

  నాగ శౌర్య నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హార్డ్ వర్కింగ్, డెడికేషన్ ఉన్న నటుడు. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్. నాకు స్విమ్మింగ్ బేస్డ్ సినిమా వస్తే చేస్తాను. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. నాగ శౌర్య గారు అద్భుతంగా నటించారు. ఎన్నో వేరియేషన్స్ కనిపిస్తాయి. నా కారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆర్చరీ మీద సినిమాలు ఇంత వరకు సినిమాలు రాలేదు. అదే నాకు ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అందుకే ఈ సినిమాను చేయాలనిపించింది. ఈ సినిమా సమయంలో ఎంతో మంది ఆర్చర్స్‌ను కలిశాను. నేను కూడా ఆర్చరీ గురించి కొంచెం నేర్చుకున్నాను.

  దర్శకుడు సంతోష్ గురించి చెబుతూ

  దర్శకుడు సంతోష్ గురించి చెబుతూ

  దర్శకుడు సంతోష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉంటారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో ఉంటారు. అలా డైరెక్టర్ ఉంటే అందరిలోనూ ఎనర్జీ వస్తుంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. రొమాంటిక్ సినిమాలో పాట పాడాను. మా సినిమాలో ఎందుకు పాడలేదు అని లక్ష్య టీం వాళ్లు కూడా అడిగారు. త్వరలోనే డబ్బింగ్ కూడా ట్రై చేస్తాను. నా వాయిస్‌కు చిన్మయి డబ్బింగ్ చెప్పారు.

  పోటీ పడి నటించడం కష్టంగా

  పోటీ పడి నటించడం కష్టంగా

  దర్శకుడు సంతోష్ ప్రతీ ఒక్క సన్నివేశాన్ని ఎంతో క్లియర్‌గా వివరిస్తారు. నా స్టైల్‌ను కూడా యాడ్ చేసి నటిస్తాను. ఆమె ఎంతో బాధలో ఉంటుంది. ఆమె పార్థను ఎంతగానో ప్రేమిస్తుంది. జగపతి బాబు, నాగ శౌర్య, కమెడియన్ సత్య వంటి వారితో కలిసి నటించడం సవాల్‌గా మారింది. వారితో పాటు పోటీ పడి నటించడం కష్టంగా అనిపించింది.

  Recommended Video

  Hero Sudheer Babu Interaction With His Lady Fan
  ప్రస్తుతం వైష్ణవ్ తేజ్‌తో మూవీ

  ప్రస్తుతం వైష్ణవ్ తేజ్‌తో మూవీ

  ప్రస్తుతం నా మూడో ప్రాజెక్ట్ వైష్ణవ్ తేజ్‌తో చేస్తున్నాను. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాలేజ్, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. అదొక డైనమిక్ స్టోరి. ప్రతీ భాషలో నటించాలని ఉంది. తమిళంలో అయితే ఎక్కువ నటనను కోరుకుంటారు. నాకు భాష అనేది హద్దు కాదు. అలా అనుకుంటే మొదటి చిత్రం తెలుగులో చేసేదాన్ని కాదు. స్పోర్ట్స్ ఫిల్మ్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.

  English summary
  Ketika Sharma is coming with Lakshya movie after Romantic. She explained about her role in the Lakshya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X