అందుకే అజ్ఞాతవాసి ఫ్లాప్.. పవన్ కల్యాణ్‌ను అలా చూడలేక.. కుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు

యువ హీరో గోపిచంద్, జగపతిబాబు, సీనియర్ నటి కుష్బూ, యువ హీరోయిన్ డింపుల్ హైతీ నటించగా దర్శకుడు శ్రీవాసు రూపొందించిన చిత్రం రామ బాణం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మే 5వ తేదీన రిలీజ్ అవుతున్నది.

ఈ చిత్రంలో సచిన్ ఖేడ్కర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, తరుణ్ అరోరా నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతతం అందించారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో సీనియర్ నటి కుష్బూ తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..

Khushbu reveals fact about Pawan Kalyans Agnyaathavaasi disaster

చంటి సినిమా ఆఫర్ వదులుకొన్నా: నా కెరీర్ కలియుగ పాండవులు సినిమాతో తెలుగులో ప్రారంభమైంది. కానీ నేను తమిళ సినిమా పరిశ్రమలోనే ఉండాలని అనుకొన్నాను. అప్పట్లో తెలుగు, మలయాళం, కన్నడ సినిమా రంగాలన్నీ చెన్నైలోనే ఉండేవి. అయితే సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలివచ్చిన సమయంలోనే నేను చెన్నైలో ఉండాలని అనుకొన్నాను.

చెన్నైలోనే నా ఫ్యామిలీతో ఉండిపోవాలని నిర్ణయించుకొన్నాను. అందుకే తమిళ సినిమా రంగానికే పరిమితమయ్యాను. నేను పెద్దగా తెలుగు సినిమాలు చూడను. చంటి సినిమాలో నేను నటించాలి. కానీ డేట్స్ సమస్య రావడంతో నేను చేయలేకపోయాను. అలా మరోసారి తెలుగు సినిమాకు దూరం కావాల్సి వచ్చింది.

నా పాత్రలు చూసుకొంటే..: నా కెరీర్ ఆరంభంలో నేను చేసిన పాత్రలు చూసుకొంటే గర్వంగా ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న ఫెర్ఫార్మెన్స్‌తో పోల్చుకొంటే సిల్లీగా అనిపించదు. నేను నా కెరీర్ ఆరంభంలో చేసిన పాత్రల వల్లే నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. కుష్బూ బాగా చేస్తుందని నమ్మారు కాబట్టే నేను భారతీ రాజా, భాగ్యరాజా, పీ వాసు, రాఘవేంద్రరావు, జంధ్యాల, గోపాల్ రెడ్డి లాంటి ప్రముఖులతో నటించాను.

Khushbu reveals fact about Pawan Kalyans Agnyaathavaasi disaster

ఇండియన్ సినిమా మాత్రమే..: ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమా అనేవి లేవు. ఇప్పుడు కేవలం ఇండియన్ సినిమా మాత్రమే. శంకర్ తెలుగు సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి తమిళ సినిమాలు చేస్తున్నాడు. అన్ని భాషల సినిమాల ఇప్పుడు ఇండియన్ సినిమాలే. కంటెంట్ ఉంటే అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. భాషాభేదం లేకుండా సినిమాలు ఆదరణకు లోనవుతున్నాయి అని కుష్భూ అన్నారు.

వారిసులో నా పాత్రను ఎత్తేశారు..: ఇటీవల వారిసు చిత్రంలో విజయ్‌తో నటించాను. చాలా మంచి పాత్ర. విజయ్‌తో సోలోగా నటించే అవకాశం దక్కింది. కానీ నా పాత్రతోపాటు కంప్లీట్ మూవీ నిర్మాత, డైరెక్టర్లు చూసిన తర్వాత సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావించారు. సినిమా లెంగ్త్ ఉంటే సినిమా పర్పస్ సాల్వ్ కాదని అనుకొన్నారు. దాదాపు 18 నిమిషాలు ఉన్నా పాత్రను తొలగించారు. దిల్ రాజు చాలా ఖర్చు పెట్టి నాతో సన్నివేశాలు చేయించారు. వంశీ పైడిపల్లి కూడా చాలా కష్టపడ్డారు. వంశీ పైడిపల్లి క్యారెక్టరైజన్ బాగా చేశారు.

Khushbu reveals fact about Pawan Kalyans Agnyaathavaasi disaster

అజ్ఞాతవాసి ఫ్లాప్ ఎందుకైందంటే?: కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలు పోషించాం. చెట్టుపుట్టలు వెంట డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుకొన్నాం. ఇప్పుడు ఆ టైమ్ అయిపోయింది. ప్రస్తుతం మంచి పాత్రల కోసం చూస్తున్నాను. ఇప్పుడు సినిమా వాతావరణం మారిపోయింది.

ఎలాంటి పాత్రలు చేస్తున్నారని ప్రేక్షకులు గమనిస్తున్నాను. నేను అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కల్యాణ్‌కు తల్లిగా నటించడాన్ని ప్రేక్షకులు ఒప్పుకోలేకపోయారు. అందుకే ఆ సినిమా సరిగా ఆడలేకపోయింది. ప్రేక్షకులు ఆ సినిమాలోనా పాత్రకు కనెక్ట్ కాలేకపోయారని నేను భావిస్తాను అని కుష్బూ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X