అప్పుడే అంతా చూపించాడు.. ఆయనకు సరెండర్ కాకతప్పలేదు.. కియారా అద్వాని

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని. ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. టాలీవుడ్‌లో తన రెండో సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య బ్యానర్లో నటించే అవకాశం దక్కించుకొన్నది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ సినిమా జనవరి 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా గురించి తన వ్యక్తిగత జీవితం గురించి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడింది. ఆమె ఏమన్నారంటే..

 డిఫరెంట్ కథతో వినయ విధేయ రామ

డిఫరెంట్ కథతో వినయ విధేయ రామ

భరత్ అనే నేను తర్వాత వినయ విధేయ రామ సినిమా తెలుగులో నాకు రెండో సినిమా. నా మొదటి సినిమా కంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్. కథపరంగా చాలా వ్యత్యాసం ఉన్న చిత్రంలో నటించాను. రాంచరణ్, జగపతిబాబు, స్నేహ, ప్రశాంత్, వివేక్ ఒబేరాయ్ లాంటి నటీనటులు సుమారు 15 మంది ఉన్నారు. ఇది పక్కాగా మాస్ సినిమా.

తెర మీద వాస్తవమని నమ్మించాడు

తెర మీద వాస్తవమని నమ్మించాడు

మాస్ సినిమా అంటే నా దృష్టిలో పాటలు, డ్యాన్సులు ఉండటం. అలాగే నిజ జీవితంలో నమ్మడానికి సాధ్యం కానీ కథను తెర మీద నమ్మేలా చెప్పడమే మాస్ సినిమా అని భావిస్తాను. తెర మీద వచ్చే కథ నిజమని నమ్మించేలా ఉండటమే మాస్ మూవీ అని అభిప్రాయపడుతాను. బోయపాటి తెర మీద ఆ ఫీలింగ్ కల్పించాడు.

 డ్యాన్స్ అంటే చాలా ఇష్టం

డ్యాన్స్ అంటే చాలా ఇష్టం

జగపతిబాబు పాత్ర చాలా కన్విన్సింగ్‌గా ఉంటుంది. ప్రతీ పాత్ర చాలా బాగుంటుంది. సెట్స్ చాలా విలాసవంతగా ఉంటాయి. ప్రతీ రోజు నాకు కొత్త ఎక్సీపిరియెన్స్. నాకు డ్యాన్స్ చేయడమంటే ఇష్టం. ఈ సినిమాలో డ్యాన్సులు చేసే అవకాశం లభించింది. నా స్కూలింగ్ సమయంలో కథక్, భరతనాట్యం నేర్చుకొన్నాను. నా డ్యాన్స్ చూసి రాంచరణ్ ప్రశంసించాడు. తస్సాదియ్యా, రామా లవ్ సీత పాటలకు కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్యాలు సమకూర్చాడు.

 దర్శకుడిపైనే ఇక భారం

దర్శకుడిపైనే ఇక భారం

నేను సినిమాను అంగీకరించేముందు డైరెక్టర్‌ను నమ్ముతాను. సినిమా ఒప్పుకున్న తర్వాత నేను దర్శకుడికి పూర్తిగా సరెండర్ అవుతాను. కథ చెప్పేటప్పుడే దర్శకుడు బోయపాటి శ్రీను సినిమా చూపించాడు. నా పాత్రను వివరించేటప్పుడే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. నా పాత్ర పేరు సీత. కానీ ఆ పేరు భిన్నంగా నా బిహేవియర్ ఉంటుంది. రాంచరణ్‌తో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.

నా పాత్ర ఎలా ఉందంటే

నా పాత్ర ఎలా ఉందంటే

నా పాత్ర నిడివి ఎంత. సినిమాలో కనిపించినంత సేపు నేను ఏం చేశాను. నా యాక్టింగ్‌తో ప్రేక్షకులు సంతృప్తి చెందారా అనే అంశాలు చేసుకొంటాను. నేను చేసే ప్రతీ పాత్ర కోసం కొంత ప్రిపేర్ అవుతాను. ఈ సినిమా కోసం డైలాగ్స్‌ను పక్కాగా పలికేందుకు కసరత్తు చేశాను. ఈ సినిమాలో చరణ్ రాంబోగా కనిపించబోతున్నాను. రాంబో రామ పోస్టర్ చూసి స్టన్ అయ్యాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X