పవన్ కల్యాణ్ వల్ల నా సినిమా దశ తిరిగింది.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్

యువ హీరో కిరణ్ అబ్బ‌వ‌రం నటిస్తున్న తాజా చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారి కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందించారు. ఇటీవల సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ విడుదల చేయడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 16 తేదీన గ్రాండ్‌గా ఇండియా వైడ్‌గా 550 కిపైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర హీరో కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ..

కోడి రామకృష్ణ కూతురుతో కలిసి

కోడి రామకృష్ణ కూతురుతో కలిసి

ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రతీ ఒక్కరి ఇంట్లో జరిగే స్టోరిగా ఉంటుంది అని అన్నాడు.

పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్

పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్

నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా ట్రైలర్‌ను పవర్ కల్యాణ్ గారు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్‌ను పవన్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా దగ్గర అవుతాను. ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఉంటుంది. తండ్రి పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి భావోద్వేగంగా నటించారు అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.

మణిశర్మతో మ్యూజిక్ గురించి

మణిశర్మతో మ్యూజిక్ గురించి

నా కెరీర్ ఆరంభంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మ్యూజిక్ అద్బుతంగా ఉంటుంది. అయన ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది అని కిరణ్ అబ్బవరం వెల్లడించాడు. అలాగే ఫైట్స్, ఎమోషన్స్ ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు.

రెండు రకాల షేడ్స్‌తో

రెండు రకాల షేడ్స్‌తో

హీరోగా నిలదొక్కుకొంటున్న సమయంలో ఫ్యామీలి ఆడియెన్స్ ఆకట్టుకొనే పాత్ర లభించండం హ్యాపీగా ఉంది. రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. ఇలాంటి పాత్ర నా కెరీర్ ఆరంభంలో లభించడం నేనేంటో ప్రేక్షకులకు తెలియజేయడానికి అవకాశం లభించిందని భావిస్తున్నాను అని కిరణ్ అబ్బవరం చెప్పారు.

 కిరణ్ అబ్బవరం సినిమా కెరీర్

కిరణ్ అబ్బవరం సినిమా కెరీర్

ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. గీతా ఆర్ట్స్ లో వినరో విష్ణు భాగ్యం, మైత్రీ మూవీ మేకర్స్‌లో మీటర్ చిత్రం చేస్తున్నాను. ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది.ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని కిరణ్ అబ్బవరం చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X