ఆ తప్పు వల్లే ఫెయిల్యూర్స్.. రూల్స్ రంజన్ విషయంలో అలాంటి జాగ్రత్తలు.. కిరణ్ అబ్బవరం (ఇంటర్వ్యూ)
యంగ్ హీరో, హీరోయిన్లు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటించిన చిత్రం రూల్స్ రంజన్. కామెడీ ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్నది. ఈ నేపథ్యంలో ఫీల్మ్ బీట్‌తో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..
రూల్స్ రంజన్ టైటిల్ చూసి యాక్షన్ సినిమా అనో..మరోటి అనుకోవద్దు. ఈ సినిమా పక్కా కామెడీ, ఎంటర్‌టైనర్. ఈ సినిమా టైటిల్‌లో రూల్స్ ఉంటాయి. కానీ సినిమాలో ఎలాంటి రూల్స్ లేవు. ఆడియెన్స్ పొట్టచెక్కలయ్యేలా ఆరోగ్యకరమైన కామెడీ ఉంటుంది. ట్రైలర్‌లో ఎలాంటి ఫన్, హ్యుమర్ ఉందో అలానే సినిమా కూడా సాగుతుంది. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ టైటిల్ వరకు అంటే రెండున్నర గంటలు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అని కిరణ్ అబ్బవరం చెప్పారు.

నా కెరీర్ ఆరంభమైనప్పటి నుంచి నాకు ఇది 8వ సినిమా. నేను తొలిసారి టాప్ కమెడియన్లు వెన్నెల కిషోర్, హైపర్ ఆదితో కలిసి నటిస్తున్నాను. కథతోపాటు కామెడీ ఉంటుంది. కథను నడిపే విధంగా హాస్యం బాగమై ఉంటుంది. ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ మాత్రమే ఉంటుంది. ఈ సినిమాలో క్యారెక్టర్లు చాలా అద్బుతంగా డిజైన్ చేశారు. తిరుపతి నుంచి ముంబైకి వెళ్లిన యువకుడి జీవితం కథగా ఉంటే.. ఆ కథతోపాటు కామెడీ ట్రావెల్ అవుతుంది అని కిరణ్ అబ్బవరం తెలిపారు.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన రూల్స్ రంజన్ సినిమాను మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లవానియా నిర్మించారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజు, వైవా హర్షా, మెహర్ చాహల్, అజయ్, మక్రంద్ దేశ్ పాండే, అతుల్ పర్చూరి, అభిమన్యు సింగ్, అన్నూకపూర్ తదితరులు నటించారు అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

రాజా వారు రాణి గారు సినిమాలో మాదిరిగా మనో రంజన్ కార్యెక్టర్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నేను ఈ సినిమాలో మూడు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. మనో రంజన్, రూల్స్ రంజన్, పబ్ రంజన్ అనే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా నటిస్తున్నాను. నేను గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేశాను. షూటింగ్‌కు వెళ్తుంటే ఆఫీస్‌కు వెళ్లిన విషయాలు గుర్తుకు వచ్చాయి అని కిరణ్ అబ్బవరం చెప్పారు.
నేను ఇటీవల నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే వరుసగా సినిమాలు చేయడం వల్ల సినిమాలో ఏం జరుగుతుందనే విషయాన్ని చూసుకోలేకపోయాను. రాజ వారు రాణి వారు.. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు దర్శకుడితో కలిసి దగ్గరుండి వర్క్ చేశాం. మిగితా సినిమాలకు పెద్దగా ఆ అవకాశం దక్కలేదు. అందువల్ల ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చింది. ఆ తప్పు మళ్లీ జరగదు. ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకొన్నది ఇదే. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తాను. అందుకే కొంత గ్యాప్ తీసుకొని తదుపరి సినిమా చేస్తున్నాను అని కిరణ్ అబ్బవరం చెప్పారు.


Click it and Unblock the Notifications











