‘ఇస్మార్ట్’ అంచనాలకు మించి RED.. హీరో రామ్ మరోసారి ఊర మాస్‌గా.. డైరెక్టర్ కిషోర్ తిరుమల

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ రూపొందిస్తున్న RED చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో సినిమా విశేషాల గురించి దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ..

హీరో రామ్ ఇమేజ్‌కు తగినట్టుగా

హీరో రామ్ ఇమేజ్‌కు తగినట్టుగా

హీరో రామ్‌ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా కథలో అనేక మార్పులు చేశాం. తమిళ కథను పూర్తిగా మార్చేసి తెలుగు నేటివిటికి తగినట్టుగా కథను రూపొందించాం. రామ్‌లో కొత్త ఎనర్జీ కనిపిస్తుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే విధంగా RED సినిమా ఉంటుంది అని దర్శకుడు కిశోర్ తిరుమల తెలిపారు.

 క్లాస్, మాస్‌గా డ్యూయల్ రోల్..

క్లాస్, మాస్‌గా డ్యూయల్ రోల్..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్‌పై అంచనాలు పెరిగాయి. అందుకే రామ్‌ను ఒక పాత్రలో మాస్, మరో పాత్రలో క్లాస్ కనిపించే విధంగా డ్యూయల్ రోల్ చూపిస్తున్నాం. తడమ్ సినిమాలోని పాయింట్‌ను మాత్రమే వాడుకొన్నాం. స్టోరి ఐడియాను మాత్రమే తీసుకొన్నాం. అలాంటి అంచనాలకు అనుగుణంగా మాస్ ఇమేజ్‌ను డిజైన్ చేశారు. స్టోరి ఐడియా బాగుంది. లవ్, ఎమోషన్స్, డ్రామా, మాస్ ఎలిమింట్స్ బాగున్నాయి కాబట్టి నాకు కొత్తగా ఉంటుందని ఆ సినిమా పాయింట్‌ను తీసుకొన్నాం అని కిశోర్ తిరుమల పేర్కొన్నారు.

థ్రిల్లర్ ఎలిమెంట్సే కాకుండా

థ్రిల్లర్ ఎలిమెంట్సే కాకుండా

తమిళంలో రఘువరన్ బీటెక్ సినిమాను నిర్మాత స్రవంతి రవికిషోర్‌తో చూశాను. రిలీజైన 100 రోజుల తర్వాత కూడా ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులను ఆదరించారు. పాయింట్ బాగుందని ఆ సినిమాకు మాటలు రాశాను. చాలా మార్పులు చేసి డబ్బింగ్ చేశాం. తడమ్ సినిమా రీమేక్‌ చేయడానికి కారణం పాయింట్, ఎమోషన్స్ మాత్రమే. కేవలం థ్రిల్లర్‌ ఎలిమింట్స్‌కే పరిమితం కాలేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే విధంగా సినిమా ఉంటుంది అని కిశోర్ తిరుమల అభిప్రాయపడ్డారు.

ప్రతీ పాత్ర అద్బుతంగా

ప్రతీ పాత్ర అద్బుతంగా


RED పక్కాగా కమర్షియల్ చిత్రం. లవ్ స్టోరి ట్రాక్ ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ కథకు కనెక్ట్ అయి ఉంటుంది. ముగ్గురు హీరోయిన్లకు మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నివేద పేతురాజ్ పాత్ర తమిళం ఉంటుంది. కానీ తెలుగుకు వచ్చే సరికి పాత్రను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చాం. నివేద పేతురాజ్ పాత్ర చాలా బాగుంటుంది. అమృత, మాళవిక శర్మ పాత్రలు ఆకట్టుకొంటున్నాయి అని కిశోర్ తిరుమల పేర్కొన్నారు.

 లాక్‌డౌన్‌ లైఫ్ ఎలా సాగిందంటే...

లాక్‌డౌన్‌ లైఫ్ ఎలా సాగిందంటే...

లాక్‌డౌన్ సమయంలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. ఓటీటీ సినిమాలు చేయలేదు. అలాంటి ఆలోచన రాలేదు. భవిష్యత్‌లో కూడా ఓటీటీ సినిమాలు చేసే ఆలోచన ఇప్పటికిప్పుడు లేవు. పరిస్థితులను బట్టి ఓటీటీ సినిమా చేసే అంశంపై దృష్టిపెడుతాను అని కిషోర్ తిరుమల అన్నారు.

 నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌,
ఫైట్స్: పీటర్‌ హెయిన్స్,
ఎడిటింగ్‌: జునైద్‌,
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌,
దర్శకత్వం : కిశోర్‌ తిరుమల

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X