twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Konda నాకు, కొండా సురేఖమ్మకు ఆ పోలిక ఒక్కటే.. ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత ఏమన్నారంటే.. ఇరా మోర్ ఇంటర్వ్యూ

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన భైరవగీత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇరా మోర్ తాజాగా కొండా సురేఖ, కొండా మురళి జీవితం ఆధారంగా తెరకెక్కిన కొండా చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆమె తన గురించి మాట్లాడుతూ.. నేను ఆగ్రాలో పుట్టి పెరిగాను. నటనపై ఆసక్తితో 2017లో ముంబై చేరుకొని థియేటర్‌ రంగంలో శిక్షణ పొందాను. ఏడాదిన్నర పాటు హిందీ నాటకాల్లో కీలక పాత్రలు పోషించా. ఉత్తరాదిలో రంగస్థలంపై అనేక నాటకాలు ప్రదర్శించారు.

    ముంబైలో పలు సినీ ప్రొడక్షన్ కంపెనీలలో ఆడిషన్స్ ఇచ్చాను. ఓ దశలో రాం గోపాల్ వర్మ గారి ఆఫీసుకు కూడా వెళ్లాను. ఆయన 'భైరవగీత' సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమని అన్నారు. ఆ సినిమాకు వర్మ గారి శిష్యుడు సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది అని తెలిపారు. కొండా సుష్మితా పటేల్ నిర్మాతగా కొండా చిత్రం జూన్ 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇరా మోర్ మీడియాతో మాట్లాడుతూ..

    సురేఖమ్మగా నన్ను వర్మ ఊహించుకోవడం..

    సురేఖమ్మగా నన్ను వర్మ ఊహించుకోవడం..

    భైరవగీత తర్వాత కరోనా కారణంగా రెండు సంవత్సరాలు ఏ ప్రాజెక్టులు చేయలేదు. నా గురించి, నాలోని లోపాలను, నాలోని స్ట్రాంగ్ పాయింట్స్‌ను మరింత మెరుగుపరుచుకొనే ప్రయత్నం చేశారు. లాక్‌డౌన్‌లో కొనసాగుతుండగా.. వర్మ గారు కొండా సినిమా స్క్రిప్ట్ పంపారు. ఆ స్క్రిప్టు చదివిన తర్వాత కొండా సురేఖమ్మ పాత్ర నాకు బాగా నచ్చింది.

    కాలేజీ జీవితం నుంచి రాజకీయ ప్రయాణం వరకూ ఆమె జీవితంలో ఎన్నో ఎగుడుదిగుడులు ఉన్నాయి. నటిగా పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర నాకు లభించిందని అనిపించింది. సురేఖమ్మగా నన్ను వర్మ ఊహించుకోవడం నా అదృష్టంగా భావించాను అని ఇరా మోర్ చెప్పారు.

    యూట్యూబ్‌లో కొండా సురేఖ వీడియోలు చూసి..

    యూట్యూబ్‌లో కొండా సురేఖ వీడియోలు చూసి..

    కొండా సురేఖమ్మ పాత్రలో నటిస్తున్నానని తెలిసిన తర్వాత యూట్యూబ్‌లో ఆమె వీడియోలను చూశా. కట్టు, బొట్టు, నడక, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అంశాలను బాగా పరిశీలించాను. చీరకట్టుతో మా ఇంట్లోనే లుక్ టెస్ట్ చేశాను. వర్మతో నిరంతరం మాట్లాడుతూ.. సురేఖమ్మ గురించి మరింత తెలుసుకొన్నాను. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడే తీరును ఆకలింపు చేసుకొన్నాను. కానీ సినిమాలో అవన్నీ కాపీ చేయలేదు. నా శైలిలో నేను సురేఖమ్మగా కనిపిస్తాను అని ఇరా మోర్ చెప్పారు.

    వర్మ మేకింగ్ స్టైల్ అద్బుతం..

    వర్మ మేకింగ్ స్టైల్ అద్బుతం..

    ఇంతకు ముందే వర్మ ప్రొడక్షన్‌లో భైరవగీత సినిమాలో నటించాను కాబట్టి.. ఆయనతో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. కొండా సినిమా కోసం ఆయన దర్శకత్వంలో నటించాను. పాత్ర గురించి క్లియర్‌గా చెబుతారు. ఆ తర్వాత నీ యాక్టింగ్ స్కిల్స్ యాడ్ చేయమని అడుగుతారు. ఆయన సీన్లను చాలా ఫాస్ట్‌గా తీస్తారు. మేకింగ్ స్టైల్ అద్బుతంగా ఉంటుంది అని ఇరా మోర్ చెప్పారు.

    సురేఖమ్మకు నాకు ఒకే పోలీక అదే..

    సురేఖమ్మకు నాకు ఒకే పోలీక అదే..

    బయోపిక్ అంటే.. అప్పటికే ఒక మనిషికి సంబంధించిన జీవితం గురించి చెప్పడం. కొండా సురేఖ క్యారెక్టర్ పరంగా మార్పులు ఏమీ చేయలేదు. సురేఖమ్మ గారు చాలా పవర్‌ఫుల్, స్ట్రాంగ్ లేడి. తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశారు. మా ఇద్దరి జీవితాలకు అసలే పోలీక లేదు. కానీ సురేఖమ్మకు నాకు ఒకే ఒక పోలీక ఉందని భావిస్తాను. ఆమె మాదిరిగానే నేనే చాలా స్ట్రాంగ్ ఉమెన్‌ను అని ఇరా మోర్ చెప్పారు.

    ఇంటర్వెల్ సీన్ చూసి.. సుష్మిత ఏమన్నారంటే..

    ఇంటర్వెల్ సీన్ చూసి.. సుష్మిత ఏమన్నారంటే..

    సురేఖమ్మ పాత్రలో నటించిన తర్వాత ఆమె కూతురు, నిర్మాత సుష్మిత పటేల్ ప్రశంసలు కురిపించారు. ఇంటర్వెల్ సీన్‌లో నా నటనను చూసి చాలా మెచ్చుకొన్నారు. సురేఖమ్మ పాత్రకు 1000 శాతం న్యాయం చేశావని చెప్పారు. సినిమా ప్రారంభానికి ముందు నాపై కొన్ని సందేహాలు ఉండేవి. ఆ సీన్ చూసిన తర్వాత అలాంటి అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి.

    ఇంటర్వెల్ సీన్‌కు సంబంధించిన వాస్తవ సంఘటనలో సుష్మిత అక్కడే ఉన్నారని చెప్పారు. కొండా సినిమా ప్రయాణంలో నేను కూడా వారి కుటుంబంలో ఒకరిని అయ్యాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇరా మోర్ చెప్పారు.

    English summary
    Konda Murali, Konda Surekha's biopic Konda is set to release on 23rd. In this occassion, Heroine Irra mor speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X