Devara: దేవర రిలీజ్ ముందు చిరంజీవి మెసేజ్.. కొరటాల శివకి ఏం చెప్పారంటే?
సినీ పరిశ్రమలో కొందరు దర్శకులు లేదా హీరోలు అలాగే ఓ హీరోయిన్ కి మరో హీరోలకి చిన్న చిన్న గొడవలు, కోల్డ్ వార్స్ లాంటివి కనిపిస్తూనే ఉంటాయి. అందరూ అందరికీ నచ్చాలని లేదు. అలానే ఒకరి వర్క్ ఒకరికి నచ్చొచ్చు మరొకరికి నచ్చకపోవచ్చు. అలా మన టాలీవుడ్ లో కొందరు దర్శకులు, హీరోలలకి ఆయా కారణాలతో చిన్న చిన్న పొరపథ్యాలు అనేవి కామన్ గా కనిపిస్తాయి.
అలా ఓ భారీ కాంబినేషన్ నడుమ గత కొంత కాలం నుంచి తమ సినిమా రిజల్ట్ విషయంలో ఒకరిపట్ల ఒకరు ద్వేషంగా ఉన్నారని ఇద్దరూ ఆ సినిమా ఫలితం విషయంలో నిందని ఒకరి విషయంలో ఒకరు వేసుకున్నట్టుగా వాతావరణం కనిపించింది. కాగా వారు ఇద్దరూ ఎవరో కూడా కాదు మెగాస్టార్ చిరంజీవి అలాగే దర్శకుడు కొరటాల శివనే..

అయితే కొరటాల శివకి మన టాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనే న్యూస్ వచ్చినపుడు మెగా ఫ్యాన్స్ కంటే మించిన ఆనంద పడినవారు ఇంకొకరు ఉండరు. పైగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఉండడంతో బ్లాక్ బస్టర్ వైబ్స్ ముందే మొదలయ్యాయి. దీనితో మెగా కుటుంబంలో కూడా ఎంతో స్పెషల్ గా అనుకున్న ఈ చిత్రం ఘోరంగా ప్లాప్ అయ్యింది.
దీనితో అక్కడ నుంచి ఈ సినిమా ప్లాప్ కి కారణం సినిమాలో చిరంజీవి వేలు పెట్టడమే అని కొందరు లేదు తప్పు కొరటాల శివదే అని కొందరు ఇలా చాలా రచ్చే నడిచింది. కాగా దీనితో పాటుగా కొన్ని రోజులు కితమే కొరటాల శివ పరోక్షంగా చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. మన పనిని మనల్ని చేసుకోనిస్తే చాలు అంటూ చేసిన కామెంట్స్ చిరంజీవి మీదే అంటూ వైరల్ అయ్యాయి.
ఐతే ఇప్పుడు కొరటాల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను ఇటీవల ఇచ్చిన ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లడుతూ చిరంజీవి గారికి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవని అందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే నేను బౌన్స్ బ్యాక్ అవ్వాలని మొట్టమొదటిగా కోరుకుంది చిరంజీవి గారే అని ఆయనే అలా మొదటిగా మెసేజ్ చేసారని కొరటాల తెలిపారు.
కానీ ఆయన ఇంటర్వ్యూలో మాటలని తప్పుగా అర్ధం చేసుకున్నారు. మా ఇద్దరికీ ఇప్పటికీ మంచి రిలేషన్ షిప్ ఉంది అని కొరటాల అసలు విషయాన్ని "దేవర" రిలీజ్ ముందు రివీల్ చేశారు. దీనితో అసలు ఈ స్టేట్మెంట్ మాత్రం మెగా అండ్ అటు నందమూరి ఫ్యాన్స్ కి కూడా ఊహించని ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ స్టేట్మెంట్ తో అయితే కొరటాల శివకి చిరంజీవికి ఎలాంటి గొడవలు లేవని అయితే ఓ క్లారిటీ వచ్చేసింది. కాగా ఇప్పుడు కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన భారీ చిత్రం "దేవర" గ్రాండ్ రిలీజ్ కి ఈ సెప్టెంబర్ 27న రాబోతుంది.


Click it and Unblock the Notifications











