నా పని నన్ను చేసుకోనివ్వాలి.. వేళ్లు పెట్టి కెలికేతే అదే ఫలితం.. కొరటాల శివ షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా దగ్గర కొన్ని ఎపిక్ డిజాస్టర్స్ లిస్ట్ ని తీసినట్టు అయితే వాటిలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలే కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. అయితే ఇలాంటి ఎపిక్ డిజాస్టర్ సినిమాలకి బిగ్ స్టార్స్ తాలూకా సినిమాలు కూడా లేకపోలేవు. మరి అలాంటి స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే చిరు ఇచ్చిన ప్లాప్ లతో చాలానే నష్టాలు తప్పలేదు.
రీసెంట్ గా వచ్చిన "భోళా శంకర్" ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పాలి. అలాగే దీనికి ముందు వచ్చిన "వాల్తేరు వీరయ్య" భారీ హిట్ అయ్యి కళ్ళు చెదిరే లాభాలని అందించింది. కానీ మళ్ళీ దీనికి ముందు వచ్చిన చిత్రం "ఆచార్య" ఘోరమైన విఫలం అయ్యి ఇది కూడా తెలుగులో ఘోరమైన నష్టాలు ఇది మిగిల్చింది. అయితే ఈ సినిమా వచ్చిన తర్వాత చాలానే కామెంట్స్ అటు దర్శకుడు కొరటాల శివ ఇంకా మెగాస్టార్ చిరంజీవిపై కూడా వినిపించాయి.

అయితే ఈ సినిమా ఫలితం విషయంలో భాద్యత దర్శకుడిదే అని అతను ఏం చెప్తే నేను అదే చేశాను అని చిరు సెలవిచ్చారు. దీనితో ఈ కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. మళ్ళీ అదే సమయంలోనే చిరంజీవి ఆచార్య స్క్రిప్ట్ లో వేలు పెట్టడం మూలానే సినిమా డిజాస్టర్ అయ్యింది అంటూ దీనికి కారణం చిరంజీవే కారణం అని మాటలు వినిపించాయి.
అయితే ఇలా ఆచార్య కాంట్రవర్సీ అప్పటి నుంచి అలా ఒక క్లారిటీ లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా ఈ మధ్యనే కొరటాల శివతో వర్క్ చేసిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కొరటాల శివ గత సినిమా కరెక్ట్ సినిమాని కరెక్ట్ మనుషులతో చెయ్యాల్సింది అంటూ పరోక్షంగా చిరంజీవి, రామ్ చరణ్ లకి చురకలు అంటించాడు.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు కొరటాల కూడా ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి పైనే కౌంటర్ వేసిన మాటలు వైరల్ గా మారాయి. మన పని మనల్ని చేసుకోనివ్వాలి అని ప్రతి దానిలో ఎవరూ వేలు పెట్టి డిస్టబ్ చెయ్యకూడదు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనితో ఆచార్య విషయంలో చిరంజీవి కలుగుజేసుకున్నారనే కోణంలో కామెంట్ చేశాడా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఇంతకు ముందు హీరోలతో హిట్ కొట్టడం.. తన కెరీర్‌లో ఆచార్య ఫ్లాప్ కావడంతో ఇలాంటి అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి.
దీనితో ఇన్నాళ్లు మాట్లాడని కొరటాల ఫైనల్ గా ఆచార్య ఫలితానికి కారణం చిరంజీవే అన్నట్టుగా సెలవిచ్చారు. మరి ఏది ఏమైనప్పటికీ తప్పు ఎవరిది అయినప్పటికీ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి కలయికలో ఒక గుర్తుండిపోయే సినిమా చూడాలి అనుకునేవారికి మాత్రం ఒక దారుణమైన అనుభవమే మిగిలింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కూడా ఘోరమైన నష్టాలే చూసారు.
మరి ఈ ఆచార్య చిత్రం రాజమౌళి సెంటిమెంట్ తర్వాత వచ్చింది కాబట్టి ప్లాప్ అయ్యింది అని కొన్ని వదంతులు ఉన్నాయి. కాగా అది రామ్ చరణ్ వల్ల అయితే రాజమౌళితో చేసిన ఎన్టీఆర్ కూడా ఇదే కొరటాల శివతో "దేవర" అనే బిగ్ బడ్జెట్ సినిమాని చేసాడు. దీనితో ఈ భారీ సినిమా ఫలితం ఏమవుతుంది అని ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ సినిమా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో లేదో ఈ సెప్టెంబర్ 27 వరకు ఆగి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











