twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమాజాన్ని ఉద్దరించడానికి సినిమాలు తీయను.. డబ్బుల కోసమే.. రాజకీయాల్లోకి రాను.. కొరటాల

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో దర్శకుడు కొరటాల శివ నాలుగు సినిమాలు మాత్రమే చేశారు. కానీ నాలుగు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచిపోయాయి. తాజాగా భరత్ అనే నేను చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో కొరటాల శివ మీడియాతో మాట్లాడారు. భరత్ అనే నేను, మహేష్ బాబు, సమాజంలో తన బాధ్యత గురించి అనేక విషయాలు వెల్లడించారు. కొరటాల శివ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

    సంతోషంగా ఉంది

    సంతోషంగా ఉంది

    భరత్ అనే నేను చిత్రం అతి పెద్ద విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లోనే గాక, ప్రిన్స్ మహేష్, నిర్మాత దానయ్య కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం కావడం మరింత సంతోషం కలిగిస్తున్నది. గత కొన్నిరోజులుగా యూనిట్ అంతా ప్రమోషన్ టూర్‌లో ఉన్నాం. అందుచేత ఈ ప్రెస్ మీట్‌కు అందరూ రాలేకపోయారు. మీడియాకు థ్యాంక్స్ చెబుతామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాను.

    ప్రశంసలు, కలెక్షన్లు

    ప్రశంసలు, కలెక్షన్లు

    సాధారణంగా ఓ సినిమా చేస్తే ప్రశంసలు వస్తాయి. లేదంటే ఆర్థికం మంచి లాభాలు వస్తాయి. కానీ భరత్ అనే నేను చిత్రం ప్రశంసలతోపాటు, మంచి కలెక్షన్లను సాధించింది. అన్ని వర్గాల వారు సినిమా బాగుందని స్వయంగా ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మంత్రి కేటీఆర్, లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కమ్యూనిస్టు నేత రామకృష్ణ లాంటి రాజకీయ నేతలు ఫోన్లు చేసి ప్రశంసించడం గొప్ప అనుభూతిగా మిగిలింది.

    కేటీఆర్ చొరవ సూపర్

    కేటీఆర్ చొరవ సూపర్

    తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికి ఫోన్లు అభినందించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో కమర్షియల్ సినిమా చేయడం గొప్ప విషయం. సినిమా నిడివి వల్ల కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. సమాజానికి ఉపయోగపడే సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని కాలేజి విద్యార్థులతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

     సమాజానికి ఉపయోగపడే సినిమా

    సమాజానికి ఉపయోగపడే సినిమా

    సమాజానికి ఉపయోగపడే సినిమా భరత్ అనే నేను అని లోకసత్తా జయప్రకాశ్ నారాయణ అన్నారు. లోకల్ గవర్నమెంట్ అనేది సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్ అని చెప్పారు. సినిమాకు ముందు కూడా జేపీ గారి వద్దకెళ్లి చాలా విషయాలు తెలుసుకొన్నాను. ఆ సినిమాను ఆయన అభినందించడం, ఇంకా మంచి టాపిక్స్‌తో సినిమాలు రూపొందించాలని సూచించారు.

    రెండు భాగాలుగా తీస్తే

    రెండు భాగాలుగా తీస్తే

    భరత్ అనే నేను చిత్రంలో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దాదాపు నాలుగున్నర గంటల స్క్రిప్టు రాశాం. కానీ అందులో సుమారు మూడుగంటలకు సరిపోయే విధంగా సీన్లను చిత్రీకరించాం. ఓ దశలో రెండు పార్టులుగా సినిమాను తెరకెక్కించాలని అనుకొన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు.

    తెరపైన మానవ విలువలను

    తెరపైన మానవ విలువలను

    నా చిత్రాల్లో కమ్యునిస్టు భావజాలం ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే అవి నా దృష్టిలో మానవ విలువలు మాత్రమే. విలువలను కమ్యునిస్టులు బహిరంగంగా చెబుతారు. అందుకే వామపక్ష భావజాలం అంటారు. ప్రతీ ఒక్కరిలో ఆ భావజలం ఉంటుంది. కానీ కొందరు బయటకు చెప్పలేకపోతారు. కొందరు బయటకు వెల్లడిస్తారు. అలాంటి వాటిని మాత్రమే నేను భారీగా వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాను.

    నాలోని సామాజిక బాధ్యత

    నాలోని సామాజిక బాధ్యత

    నాలో సామాజిక బాధ్యత ఉంది. కానీ రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. నేను సినిమా రంగంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు గోల్స్ ఉన్నాయి. డబ్బులు సంపాదించాలి. ఆ తర్వాత అవకాశం ఉంటే రాజకీయాల్లోకి వస్తాను. రాజకీయాల్లోకి వెళ్లాలని నా స్నేహితులకు కూడా సలహాలు ఇస్తుంటాను.

    సినిమా అనేది వ్యాపారం

    సినిమా అనేది వ్యాపారం

    సమాజాన్ని ఉద్దరించడానికి నేను సినిమాలు తీయడం లేదు. సినీ నిర్మాణం అనేది వ్యాపారం. చాలా డబ్బుతో ముడిపడిన అంశం. అందువల్ల డబ్బులు సంపాదించడానికి నేను సినిమా తీస్తాను. నిర్మాతను నష్టపోయేలా చేయడం నా ఉద్దేశం కాదు. డబ్బు కోసమే సినిమాలు రూపొందిస్తాను.

    English summary
    Bharat Ane Nenu movie set to release on April 20th. Prince Mahesh Babu and Kiara Advani are lead pair for this movie. Srimanthudu Fame Koratala Siva director for the movie. DVV Danaiah is producing this movie on DVV banner. In this occassion, Director Koratala Siva reveals about Bharat Ane nenu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X