Krishnam Raju's last interview ప్రభాస్ విషయంలో అదే నిజమైతే.. అప్పుడు గ్రాండ్ పార్టీ ఇస్తా.. కృష్ణం రాజు ఎమోషన
రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూగబోయింది. ఆయన ఇక లేరనే వార్త అభిమానులను, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఇటీవల ప్రభాస్ సినీ పరిశ్రమలోకి అడుగపెట్టి.. కెమెరా ముందుకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణంరాజు తమ నివాసంలో చిన్న వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు, ఈశ్వర్ సినిమాకు దర్శకత్వం వహించిన జయంత్ పరాన్జీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడిన చివరి మాటలు మీ కోసం..

కోవిడ్ కారణంగా కొద్ది మందితోనే..
కోవిడ్ కారణంగా ఇంట్లో శుభకార్యాలను ఎక్కువ మందితో నిర్వహించలేకపోతున్నాం. ప్రభాస్ సినిమా పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు అయిందని నా భార్య శ్యామల చెబితే.. అప్పుడే 20 ఏళ్లు అయిందా అని ఆశ్చర్యపోయాను. అప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తే బాగుంటుందని ఫ్యామిలి మెంబర్స్ చెబితే.. ఇలా చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేశాను. చాలా తక్కువ మందిని పిలువడం నాకే మంచిగా అనిపించడం లేదు. మా ఇంట్లో ఫంక్షన్ అంటే చాలా మంది ఉండాలి అని కృష్ణంరాజు అన్నారు.

ఈశ్వర్ సినిమా ప్రారంభం రోజున
ఈశ్వర్ సినిమా ప్రారంభోత్సవానికి జిల్లాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. దాంతో ప్రభాస్ తల్లి, నా భార్య శ్యామలదేవి షూటింగ్ స్పాట్‌కు చేరుకోలేకపోయాడు. ఈశ్వరుడు అంటే.. మూడు కళ్లు.. మూడు హృదయాలు కలిగి ఉన్నవాడు. అలాంటి పేరుతో సినిమాను రూపొందించాం. ఫస్ట్ షాట్‌కు జయంత్ ఒకే చెప్పగానే.. ప్రభాస్ నాన్న వెళ్లి అతడి చేయి పట్టుకొని దీవించాడు. నా వద్దకు వచ్చి కౌగిలించుకొని మన వారసుడు వచ్చాడని సూర్య నారాయణ రాజు ఆనందపడిపోయాడు అని కృష్ణంరాజు తెలిపారు.

హాలీవుడ్‌లో ఆదిపురుష్ రిలీజ్
అభిమానులు ఆశీర్వాదం, ప్రేమతోనే ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. 20 ఏళ్లలో 20 దేశాల్లో హీరో అయ్యారు. హాలీవుడ్‌లో కూడా ప్రభాస్ నటించిన సినిమాను ఆదిపురుష్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే నిజమైతే ఎంత ఎత్తుకు ఎదిగాడనే ఫీలింగ్ కలుగుతుంది. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్‌దే అవుతుంది. ప్రభాస్ తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎవరూ సాధించనంత ఘనతను సాధించాడు అని కృష్ణంరాజు అన్నారు.

ప్రభాస్ మొదటి షాట్‌కు క్లాప్ కొట్టడం
ప్రభాస్ నటించిన తొలి సినిమా ఈశ్వర్‌కు మొదటి షాట్‌కు నేను క్లాప్ కొట్టడం చాలా ఆనందం. దర్శకుడు జయంత్ ఓకే చెప్పినప్పుడే ఆయన కెరీర్‌కు మంచి బీజం పడింది. ఆ సమయంలో నా సోదరుడు సూర్యనారాయణరాజు మనసులో ఆనందం అంతా ఇంతా కాదు. ప్రభాస్‌కు నేను, నా సోదరుడు, ఆయన తల్లి మూడు గుండెల లాంటి వాళ్లం అని కృష్ణంరాజు ఎమోషనల్ అయ్యారు.

ప్రభాస్ మరింత ఎత్తుకు ఎదగాలి
ప్రభాస్ మూవీ ఆదిపురుష్ సినిమా హాలీవుడ్‌లో రిలీజైన తర్వాత మంచి ఫంక్షన్ చేసుకొందాం. అందరం కలిసి ఆ ఆనందాన్ని పంచుకొందాం. ప్రభాస్ కెరీర్ మరింత బాగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకొందాం. ప్రభాస్ కోసం కష్టపడుతున్న ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు అని కృష్ణంరాజు అన్నారు.


Click it and Unblock the Notifications











