Krithi Shetty శ్యామ్ సింగరాయ్‌లో బోల్డ్ రోల్ గురించి బేబమ్మ.. అలాంటి పాత్రలో గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేస్తా..
ఉప్పెన సినిమాలో గ్రామీణ యువతిగా ఆకట్టుకొన్న యువ హీరోయిన్ కృతిశెట్టి.. శ్యామ్ సింగరాయ్ మూవీలో మోడరన్ అమ్మాయిగా బోల్డ్ పాత్రలో ఆకట్టుకొన్నది. ఎమోషనల్ పాత్రల గురించి, బోల్డ్ పాత్రల్లో నటించిన అనుభూతి గురించి బంగ్రార్రాజు మూవీ ప్రమోషనల్‌లో వివరించారు. శ్యామ్ సింగరాయ్ పాత్ర గురించిన ఫీడ్ బ్యాక్ గురించి మాట్లాడుతూ..
శ్యామ్ సింగ రాయ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. నేను బోల్డ్ గురించి ఆలోచించలేదు. ఆ సినిమాకు ముందు ఉప్పెన మూవీలో బేబమ్మగా నటించాను. ఆ పాత్రను ప్రేక్షకులు ఆదరించారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలోని క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారనే ఆలోచించాను. కానీ ప్రేక్షకులు సానుకూలంగా స్పందించారు. కృతి శెట్టి డిఫరెంట్‌గా చేశారని ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. బోల్డ్ పాత్రలో నటించడం చాలా అన్ కంఫర్ట్‌గా ఉంటుంది. యుక్త వయసులో ఉన్నాను కాబట్టి కాస్త బిడియం ఉంటుంది. కానీ క్యారెక్టర్ విషయంలో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక సీన్‌లో చాలా మంది మధ్యలో నటించాను. ఆ సీన్ పూర్తి అయిన తర్వాత హోటల్‌కు వచ్చి నా గురించి నేను ఆలోచించాను. నేను భయపడకుండా నటించానే అనే ఫీలింగ్ కలిగింది అని కృతిశెట్టి చెప్పింది.

నేను నటించే పాత్రలతో ఎప్పుడూ ట్రావెల్ అవుతుంటాను. ఎమోషనల్ సీన్లలో నటించేటప్పుడు గ్లిజరిన్ వాడను. సహజంగానే ఏడ్చేస్తాను. నా పాత్ర స్వభావాన్ని ఆలోచించి అప్పటికప్పుడే నేను రియాక్ట్ అవుతాను. ఆ పాత్ర ఎలా రియాక్ట్ చేస్తుందని ఆలోచిస్తాను. ప్రతీ పాత్ర నాకు ఎమోషనల్ రైడ్. ప్రతీ పాత్ర నన్ను వెంటాడుతూనే ఉంటుంది అని కృతి శెట్టి చెప్పింది.
నేను ముంబైలో పుట్టి పెరిగాను. నేను మోడరన్ గర్ల్‌ని. నాకు తెలుగు సంప్రదాయలు తెలియవు. సంక్రాంతి పండుగ ఎప్పడు జరుపుకోలేదు. కానీ నాకు తెలిసిన వాళ్లు సంక్రాంతి పండుగను తెలుగు వారు ఎలా జరుపుకొంటారు. సంక్రాంతి సమయంలో సినిమాలను ఎలా ఎంజాయ్ చేస్తారనే విషయాలను చెప్పారు. సంక్రాంతికి బంగార్రాజు బాగుంటుందని చెప్పారు. ఇది పండుగలాంటి సినిమా అని చెప్పడం హ్యాపీగా ఉంది అని కృతిశెట్టి చెప్పారు.
ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి గురించి చెప్పాలి. అలాగే నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం, హీరో రామ్‌తో సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూడు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు నా పాత్రలు డిఫరెంట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను అని కృతి శెట్టి చెప్పారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని చెప్పారు.


Click it and Unblock the Notifications











