‘Kushi మణిరత్నం మూవీ రేంజ్‌లో విజువల్ ట్రీట్.. విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అలా ఉంటుంది’

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన తాజా చిత్రం ఖుషి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా చిత్రంగా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే భారీ క్రేజ్‌ను, అంచనాలను పెంచింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సినిమాటోగ్రాఫర్ జీ మురళి ఫిల్మీబీట్ తెలుగు మాట్లాడుతూ..

నా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. నేను తమిళనాడులో జన్మించాను. బాల్యంలో పెయింటింగ్, పాలిటిక్స్, సామాజిక అంశాలు, ఎడ్యుకేషన్‌పై ఇంట్రెస్ట్ ఉండేది. నేను స్టూడెంట్‌గా ఉన్న సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాలనే ఆలోచన వచ్చింది. రియల్ లైఫ్ కంటే ఇమాజినేషన్ లైఫ్‌ వైపు దృష్టిపెట్టాను. రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉండే విధంగా సినిమాటోగ్రఫిపై పట్టు సాధించాలని నిర్ణయం తీసుకొన్నాను అని జీ మురళీ తెలిపారు.

Kushi movie Cinematographer G Murali reveals Vijay Deverakonda, Samantha Ruth Prabu chemistry will rocks

తెలుగు సినిమా పరిశ్రమలో 2005 సంవత్సరం నుంచి ఉన్నాను. నేను అందాల రాక్షసి సినిమాకు పనిచేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఖుషి సినిమాకు పనిచేశాను. ఈ సినిమా అవకాశం మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్ వల్ల వచ్చింది. ఈ మూవీకి పనిచేసే సమయంలో సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఉండే అభిరుచిని ప్రత్యక్షంగా చూశాను. సినిమా కోసం రాజీ పడకుండా ఏది కావాలంటే అది ఇచ్చారు అని జీ మురళీ చెప్పారు.

ఖుషీ సినిమా కోసం ముందు నిర్మాత రవిశంకర్ నాకు ఫోన్ చేశారు. ఓ ప్రాజెక్టు ఉంది. ఆ సినిమా కథ చెప్పడానికి నేను డైరెక్టర్ చెన్నైకి వస్తాం. ఆ తర్వాత శివ నిర్వాణ కథ చెప్పిన వెంటనే నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన తీసిన సినిమాలు గురించి తెలుసుకొన్న తర్వాత సంతోషం కలిగింది. మంచి డైరెక్టర్‌తో ఈ సినిమాకు పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది అని మురళీ తెలిపారు.

Kushi movie Cinematographer G Murali reveals Vijay Deverakonda, Samantha Ruth Prabu chemistry will rocks

ఖుషి మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంటుంది. సినిమాలోని ఇతర క్యారెక్టర్లు ఎమోషనల్‌గా ఉంటాయి. సమంత, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఓ బ్యూటీ. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడుకొన్న సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. మణిరత్నం, పీసీ శ్రీరాం కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో మాదిరిగా విజువల్ ట్రీట్‌ను అందిస్తుంది అని సినిమాటోగ్రఫర్ మురళీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X