For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Virgin Story టైటిల్ వినగానే రాఘవేంద్రరావు నోట ఆ మాట.. లగడపాటి శ్రీధర్ ఇంటర్వ్యూ

  |

  నా కెరీర్‌లో ఫ్యామిలీ, మాస్ సినిమాలు చేశాను. కానీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు భారీగా ఆదరణ పెరిగిన తర్వాత యూత్‌ను టార్గెట్ చేసే సినిమాలు చేయలేదు. అందుకే యూత్‌ను టార్గెట్ చేస్తూ టీనేజ్ లవ్ స్టోరి చేయాలని అనుకొన్నాను. ప్రతీ సినిమాలో దాదాపు పెళ్లి, ప్రేమ గురించి చెబుతారు. పెళ్లి జరిగితే చెప్పడానికి కథ పెద్దగా ఉండదు. ఇప్పుడు యూత్‌ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. టీనేజ్ యువకుల పరిస్థితి మారింది. 18 ఏళ్ల లోపు పిల్లలకు, తల్లిదండ్రులకు కనెక్టివిటి తగ్గిపోతుంది. అందుకే టీనేజ్ కథతో సినిమాగా చేశాను అని లగడపాటి శ్రీధర్ తెలిపారు.

  ప్రస్తుత సమాజంలో పిల్లలకు డౌట్స్ ఏమైనా ఉంటే.. అది రొమాంటిక్ లైఫ్ మీదే. పుస్తకాలు, చదువు మీద వారికి పెద్దగా డౌట్స్ రావు. 10 తరగతి లోపే పిల్లలకు ఓ రొమాంటిక్ టచ్ ఉంటుంది. నా కొడుకులకు హైస్కూల్ నుంచే రొమాంటిక్ టచ్ ఉంది. పిల్లలు చదువులో ఫెయిల్ అయితే డిప్రెషన్‌లోకి వెళ్లరు. ప్రేమలో విఫలమైతే డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. పిల్లల్లో అలాంటి పరిస్థితిని గమనించి తల్లిదండ్రులు పోత్సహిస్తే మంచింది. అలాంటి కథనే వర్జిన్ స్టోరి సినిమాలో చెప్పాం. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందనే విషయాలను చర్చించాం. ఈ సినిమాలో సందేశం ఏమీ లేదు. కానీ.. జీవితం పట్ల అవగాహన, ఆలోచనను కలిగించే విధంగా చెప్పబోతున్నాం అని లగడపాటి శ్రీధర్ అన్నారు.

  Lagadapati Sridhar about Virgin Story and K Raghavendra Rao advice

  మనం నిజంగా ప్రేమించిన వ్యక్తి సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు, శరీరం నిజాయితీగా స్పందిస్తాయి. ప్రేమ లేని వాళ్ల దగ్గర ఆ ఫీలింగ్ రాదు. యువత అలాంటి జతను ఎంచుకోండని చెప్పే చిత్రమిది. మీకు నిజంగా ఫీలింగ్ లేనప్పుడు ప్రేమించి వృథా. యువత జీవితంలో రొమాన్స్ ఉండాలి.

  స్టైల్ సినిమా కథ విని వెంటనే షూట్‌కు వెళ్లాం. స్టైల్ సినిమా మాదిరిగానే బౌండ్ స్క్రిప్టుతో వచ్చిన సినిమా ఇది. కథ వినగానే వెంటనే ఓకే చెప్పాను. టీనేజ్ వాళ్లకే కాదు అలాంటి మనసున్న పెద్ద వాళ్లకూ వర్జిన్ స్టోరి నచ్చుతుంది. పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనుకున్న పెద్ద వాళ్లు మా సినిమా చూడొచ్చు. అమ్మాయిల మనసులను బ్రేక్ చేయవద్దనే విషయాన్ని చెప్పాం అని లగడపాటి శ్రీధర్ తెలిపారు.

  Lagadapati Sridhar about Virgin Story and K Raghavendra Rao advice

  వర్జిన్ స్టోరి సినిమాలో హీరో పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ప్రపంచాన్ని జయించే యాటిట్యూడ్ ఉండదు. విక్రమ్ సహిదేవ్ మా అబ్బాయి అని సినిమా చేయడం లేదు. అతనిలో నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి ఉంది. తను బయట క్రేజీ చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు సినిమాల పరిస్థితి సందిగ్ధంగా ఉంది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మా చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసి అప్పుడు విక్రమ్ నెక్ట్ సినిమా గురించి ప్లాన్ చేస్తాం అని లగడపాటి శ్రీధర్ అన్నారు.

  వర్జిన్ స్టోరి సినిమా విషయానికి వస్తే.. వర్జిన్ అంటే ఫ్రెష్. ఈ సినిమా కథ కూడా చాలా ఫ్రెష్, స్వచ్చత ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చే ముందు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కలిశాను. ఆయన ఎందుకు వచ్చారని అడిగితే.. వర్జిన్ స్టోరి అనే టైటిల్‌తో సినిమా తీశాను. మీ ఆశీర్వాదం తీసుకొందామని వచ్చాను. అయితే వర్జిన్ టైటిల్‌ బాగుంది. సబ్ టైటిల్ కొత్తగా రెక్కలొచ్చిన అనే కంటే.. వర్టిన్ టైటిల్‌ను హైలెట్ చేయమని సూచించాడు అని లగఢపాటి శ్రీధర్ పేర్కొన్నారు.

  English summary
  Lagadapati Sridhar's son Vikram Sahidev's Virgin Story movie set to release on February 18th. In this occassion, Lagadapati Sridhar revealed about movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X