ఆయనతో కెమిస్ట్రీ అదిరింది.. మస్కట్‌లో ఫుల్లుగా ఎంజాయ్.. ఎవర్ని ఇబ్బంది పెట్టలే.. లావణ్య త్రిపాఠి

By Rajababu

సుప్రీం హీరో సాయిధరంతేజ్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇంటిలిజెంట్. అందాల తార లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. అందరి అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఇంటిలిజెంట్ సినిమా రూపొందిందని టాక్ వినిపిస్తుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ ని సాధించింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. ఇంటిలిజెంట్ చిత్రవిశేషాల గురించి జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.

ఇంటిలిజెంట్ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఇంటిలిజెంట్ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఈ మూవీ లో నేను సంధ్య క్యారెక్టర్ లో నటించాను. యూఎస్‌లో చదువుకొని ఇండియాకి వచ్చి మా డాడీ బిజినెస్ లు చూస్తుంటాను. చాలా కోపం ఎక్కువ ఎప్పుడూ అందరికన్నా డామినేట్‌గా ఉంటుంది. అలాంటి అమ్మాయి ప్రేమలో ఎలా పడింది అనేది సస్పెన్స్. క్యూట్ లవ్ స్టోరీ. యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో నేను ఇంటిలిజెంట్ కాదు. హీరో డామినేటేడ్ స్టోరి కదా. సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్. విలన్‌ ఎత్తులకు ఎలా పై ఎత్తులు వేశాడో అనేది సినిమా కథ

Recommended Video

బావతో కలిసి హిట్ కొడితే ఆ కిక్కేవేరు కానీ మిస్స‌య్యాం
 సాయిధరమ్ తేజ్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

సాయిధరమ్ తేజ్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

తేజ్ వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్. చాలా మంచి యాక్టర్ తో పాటు మంచి డాన్సర్ కూడా.సెట్లో ఎప్పుడూ జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. చాలా మంచి వ్యక్తి. మస్కట్‌లో షూటింగ్ అప్పుడు ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. లవ్, హేట్ రిలేషన్ షిప్ ఉంటుంది. లవ్ సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి.

 ఇంటిలిజెంట్ సినిమా కథ ఏమిటంటే..

ఇంటిలిజెంట్ సినిమా కథ ఏమిటంటే..

కథ చాలా ఇంటిలిజెంట్‌గా ఉంటుంది. వెరీ టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఒక సామాన్య వ్యక్తి తన తెలివితేటల తో సమాజానికి,పేద ప్రజలకి ఎలాంటి మేలు చేసాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇవే కాకుండా ఇంకా మూవీలో చాలా అంశాలు ఉంటాయి. ధర్మ క్యారెక్టర్ లో తేజ్ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తాడు.

 చమక్ చమక్ పాటకు కొంత మేరకు ప్రాక్టీస్

చమక్ చమక్ పాటకు కొంత మేరకు ప్రాక్టీస్

ఫస్ట్ టైం ఈ చిత్రం లో డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేసి చేశాను.నా ఫెవరెట్ లెజండరీ యాక్టర్ చిరంజీవి గారి "చమక్ చమక్" సాంగ్ ని తెలుగు, హిందీలో చూశాను. ఆ పాటని రీమిక్స్ చేయడం చాలా కష్టం. చిరంజీవిలా డ్యాన్స్ చేయడం చాలా కష్టం. పాటకు ముందు ప్రాక్టీస్ చేశాం. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. సెల్ ఫోన్, కళ కళ కళామందిర్ పాటలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. తేజ్ తో డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేసాను.

 నిజజీవితంలో ప్రేమించమని వెంటపడ్డారా?

నిజజీవితంలో ప్రేమించమని వెంటపడ్డారా?

సినిమాలో సాయిధరమ్ తేజ్ ప్రేమించమని వెంటపడినట్టు నిజజీవితంలో జరుగలేదు. నా వద్దకు వచ్చి ప్రపోజ్ చేయడానికి అబ్బాయిలు భయపడుతారు. ఎందుకంటే నాకు పనితప్ప మరో ధ్యాస ఉండదు.

వీవీ వినాయక్‌తో పనిచేయడం

వీవీ వినాయక్‌తో పనిచేయడం

వెరీ హంబుల్ అండ్ వెరీ స్వీట్ డైరెక్టర్.పెద్ద డైరెక్టర్ అయినా కూడా డౌన్ టు ఎర్త్‌గా వుంటారు. చాలా కంఫర్టుబుల్‌గా సెట్లో వుంటారు. ఆయనకేం కావాలో క్లియర్‌గా తెలుసు. ఏ సీన్ అయినా చాలా ఫాస్ట్‌గా తీస్తారు. నటిగా అయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.

సినిమాల్లోనుంచి తప్పుకొన్న వివాదంపై

సినిమాల్లోనుంచి తప్పుకొన్న వివాదంపై

ఇప్పటి వరకు నేను ఏ నిర్మాతకు ఇబ్బంది కలిగించలేదు. ఇప్పటి వరకు నేను పనిచేసిన సినిమా నిర్మాతలు, ప్రొడక్షన్ హౌస్ చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని వార్తల్లో వాస్తవం ఉండదు. కొన్నిసార్లు నాకు కొన్ని నచ్చక తప్పుకొన్నాను. తమిళ సినిమా విషయంలో అది జరిగింది. ఇప్పుడు కూడా నాకు నా సినిమా నిర్మాతలు నాతో టచ్‌లో ఉన్నారు. తమిళ నిర్మాత తెలుగు సినిమా నిర్మాతల మండలి ఫిర్యాదు చేసినప్పటికీ.. అందులో ఏమీ లేకపోవడంతో వివాదం అక్కడే ముగిసింది.

 సినిమా హిట్ ప్లాప్‌లను ఎలా స్వీకరిస్తానంటే?

సినిమా హిట్ ప్లాప్‌లను ఎలా స్వీకరిస్తానంటే?

హిట్ ప్లాప్ అనేది కామన్. సక్సెస్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఫైయిల్యూర్ వచ్చినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో చూసుకొంటాం. ఫీడ్ బ్యాక్ అనేది కచ్చితంగా తీసుకుంటాను. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు కమర్షియల్ గా నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. అలాగే ఇంటిలిజెంట్ కూడా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.

నా తదుపరి సినిమాలో నా పాత్ర..

నా తదుపరి సినిమాలో నా పాత్ర..

డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలననుకుంటాను.ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సినిమాలోనా క్యారెక్టర్ ని ఎంతో ఇష్టపడి చేశాను. డెఫినెట్ గా చెప్పాలని వుంది.ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను.ఇంకా ఇంప్రూవ్ అయ్యాక డబ్బింగ్ చెప్తాను.

 సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో చేయడం ఎలా అనిపించింది?

సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో చేయడం ఎలా అనిపించింది?

సి కళ్యాణ్ గారు వెరీ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ప్రతిరోజూ సెట్ కి వచ్చి అందరికి ఎం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్‌గా నిర్మించారు. పాటలకి మాత్రమే కాకుండా ఫైట్స్ కి కూడా భారీగా సెట్స్ వేసి తీశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ సీవీ రావు, పత్సా నాగరాజ్ ఇద్దరూ చాలా కోపరేట్ చేసి సినిమాని వండర్ ఫుల్‌గా చేశారు. సీకేలో మళ్లీ వర్క్ చేయాలనీ వుంది.

 ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్‌కు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందంటే

ఎస్‌ఎస్ థమన్ మ్యూజిక్‌కు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందంటే

చాలా హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది.రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.దాదాపు యాభై వేలమందికి పై గా హాజరయ్యారు.చాలా సంతోషం గా అన్పించింది? సాంగ్స్ అన్నీ చాలా పెద్ద హిట్ అయ్యాయి.థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. థమన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది.

నా తదుపరి సినిమాలు ఏమిటంటే..

నా తదుపరి సినిమాలు ఏమిటంటే..

గీత ఆర్ట్స్ విజయ్ దేవర కొండ మూవీ చేస్తున్నాను. పరశురామ్ డైరెక్టర్. తమిళ, మలయాళం నుండి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. అయినా ఇంకా కమిట్ కాలేదు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకే ఇస్తాను. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X