హీరోయిన్లను హీరోలు ఎలా ట్రాప్ చేస్తారంటే?..కారులో మరో అమ్మాయితో.. బయటపెట్టిన అగ్ర నటి
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలతో సమానంగా స్టార్ డమ్ సాధించిన తొలి తరం హీరోయిన్లు భానుమతి, సావిత్రి. దశాబ్ధాల పాటు వీరిద్దరూ వెండితెరను ఏలారు. వీరి తర్వాత అంతటి స్టార్‌డమ్ సంపాదించారు కళాభినేత్రి వాణిశ్రీ. 1970, 80 దశకాల్లో టాలీవుడ్‌ను ఆమె ఒక ఊపు ఊపారు. అప్పట్లో దక్షిణాదిలోని అందరూ స్టార్ హీరోలతో వాణిశ్రీ నటించారు. అంతేకాదు.. తెలుగులో ఎక్కువగా ద్విపాత్రాభినయం చేసిన హీరోయిన్‌గా నిలిచారు. నవరసాలను అద్భుతంగా పలికించడంతో పాటు లక్కీ హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు.
వాణిశ్రీ స్టైల్స్ చూసి అప్పట్లో బాలీవుడ్ నటి ముంతాజ్ అని పిలిచేవారు. అంతేకాదు.. ఆమె నాటి మహిళామణులకు స్టైల్ ఐకాన్‌గా నిలిచేవారు. వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ బొట్టు, వాణిశ్రీ శారీస్, వాణిశ్రీ బ్లౌజులు, వాణిశ్రీ కర్చీఫ్‌లు అంటూ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆ రోజుల్లో అమ్మాయిలు అచ్చు వాణిశ్రీలాగా ముస్తాబు కావాలని అనుకునేవారు. సినిమాల్లో వాణిశ్రీ ధరించిన లాంటి చీరలు, బట్టలు, ఆభరణాలు కావాలని అప్పట్లో మహిళలు వారి భర్తలను విసిగించేవారంటే అతిశయోక్తి కాదు.

ఏఎన్నార్ నవలా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటే.. వాణిశ్రీ నవలా నాయికగా ట్రెంట్ సెట్ చేశారు. ఆత్మీయులు, ప్రేమ్‌నగర్, జీవనతరంగాలు, విచిత్రబంధం, సెక్రటరీ, చక్రవాకం, జీవన జ్యోతి వంటి చిత్రాలు నవల నుంచి పుట్టినవే. వాణిశ్రీ కాల్ షీట్స్ కోసం నిర్మాతలు పడిగాపులు కాసేవారంటే అతిశయోక్తి కాదు.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో గౌరవంగా తప్పుకుని పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయారు. తర్వాత కొందరు విజ్ఞప్తి మేరకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అత్త, తల్లి పాత్రలు పోషించారు. అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు , బొబ్బిలిరాజా, అల్లరి అల్లుడు, పెద్దింటి అల్లుడు, బొంబాయి ప్రియుడు సినిమాల్లో గడసరి అత్తగా అలరించారు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్న వాణిశ్రీ.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కెరీర్, తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇతర ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో హీరోలు వారి ప్రవర్తన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్ధితులపై తన తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పారని గుర్తుచేసుకున్నారు. హీరోలు ఐ లవ్ యూ అంటారని, ఆ వెంటనే ఓ పెద్ద కారు వస్తుందని , తాజ్‌మహాల్ కడతాడని మాయమాటలు చెబుతారని , వాడు కొన్నాళ్లు లాంగ్ డ్రైవ్‌లకు తీసుకెళ్తాడని .. ఇంకో ఆరు నెలల తర్వాత ఆ కారులో ఇంకో అమ్మాయి ఉంటుందని .. అలాంటి మాటలు నమ్మొద్దని మా అమ్మ ఎప్పుడూ చెప్పేదని వాణిశ్రీ తెలిపారు. ఇవన్నీ గుర్తుంచుకుని నడుచుకునే దాన్నని.. అందుకే తాను ఏ హీరో వలలోనూ పడలేదని ఆమె వెల్లడించారు.
కెరీర్‌లో ఎంతో సంపాదించిన వాణిశ్రీని అయినవాళ్లే మోసం చేయడంతో ఆర్ధికంగా చితికిపోయారు. ఆమెకు చెందిన భూమి కబ్జాకు గురికావడంతో దాదాపు 12 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. కోర్టు వాయిదాలు, ఇతర ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వ మిగల్లేదు.. ఆర్ధిక ఇబ్బందులు, ఒత్తిడి భరించలేక ఆమె కొడుకు అభినయ వెంకట కార్తీక్ 36 ఏళ్లు నిండకుండానే బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమారుడి మృతి ఆమెను కుంగదీసింది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ .. వాణిశ్రీ స్థలాన్ని ఆమెకు ఇప్పించారు.


Click it and Unblock the Notifications











