‘మరొకరితో పెళ్లి జరిగినా చివరి శ్వాస వరకు ఆ హీరోను ప్రేమిస్తూనే ఉంటా.. బ్రేకప్ కారణం ఏమిటంటే’

బాలీవుడ్‌ హీరోయిన్లలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకొన్న ముంతాజ్ ఓ తరం హీరోయిన్లకే కాకుండా ప్రేక్షకులకు కూడా వెండితెర దేవతగా మారారు. ఆమె నటన, హావభావాలు, డ్యాన్సుల్లో స్టెప్పులు వేయడం ఆమెకే సొంతం అని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. అందం, అభినయంతో ఆ తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బ్యూటీ అప్పటి స్టార్ హీరో షమ్మీ కపూర్‌తో ప్రేమలో పడింది. అయితే పెళ్లి వరకు వచ్చిన వారి ప్రేమ మధ్యలో బ్రేక్ అయింది. పీకల్లోతు ప్రేమ ఉన్న ఆమె తన లవ్‌ను ఇప్పటికీ తన గుండెల్లోనే దాచుకొన్నది. బ్రేకప్ వెనుక కారణాలు, ఆ విషయాలను ఫిల్మీబీట్ ప్రైమ్ ఛానెల్లో యాంకర్ ఏ సే ఆది (A Se Aadi)తో మాట్లాడుతూ..

అందరి మాదిరిగానే నేను లవ్‌లో
నా దృష్టిలో ప్రేమ ఏమిటంటే.. కొత్తగా ఏమి లేదు. ప్రపంచం ఫీలయ్యదే.. అందరూ ఫీలైనట్టే నేను లవ్ విషయంలో ఫీలయ్యాను. ప్రేమ అనేది ప్రేమనే. ప్రపంచంలో అందరూ ప్రేమను కోరుకొంటారు. తోడును కోరుకొంటారు. కొన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి సహచర్యం కావాలని కోరుకొంటారు. అందరూ ప్రేమలో మునిగితేలాయని కోరుకొంటారు. శారీరక సుఖం ముఖ్యం కాదు. వారి మాదిరిగానే నేను నా జీవితంలో ప్రేమను ఆస్వాదించాను.

Legendary Heroine Mumtaz

షమ్మీ కపూర్‌ను వివాహం చేసుకోవాలనుకొన్నా
నేను ఆరు, ఏడు సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో నా సోదరితో కలిసి సెట్స్‌కు వెళ్లిన సమయంలో షమ్మీ కపూర్‌ను తొలిసారి చూశాను. ఆయనపై ఫ్యానిజం లేదు. నాకు ఎప్పుడూ ఫ్యాన్ మూమెంట్స్ లేవు. ఆయన చూడటానికి చాలా అందంగా ఉంటాడు. పెళ్లి చేసుకొవాలనుకొన్నాను. కానీ కుదర్లేదు. అప్పుడు చాలా బాధపడ్డాను. అప్పట్లో ప్రేమలో ఉంటే.. ఎప్పుడూ కలిసి మెలిసి తిరిగే వాళ్లం కాదు. ఎవరి పనుల్లో వారు ఉండే వాళ్లం. ఎప్పుడూ ఎవరి షూటింగులతో వాళ్లం బిజీగా ఉండే వాళ్లం. నా తల్లి చాలా స్క్రిక్ట్. షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చే వాళ్లం. రాత్రి, పగలు కలిసి ఉండే సమయం అప్పట్లో చాలా తక్కువ. నేను సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయిని కావడంతో ఇంకా ఎక్కువ కట్టుబాట్లు ఉండేవి. అందువల్ల షమ్మీ కపూర్‌ను ప్రేమించినా కలిసి ఎక్కువగా తిరుగలేదు.

Legendary Heroine Mumtaz

బ్రేకప్‌కు కారణం ఏమిటంటే?
నేను షమ్మీ కపూర్‌తో ప్రేమలో పడినప్పుడు చాలా చిన్న వయసు. అందరి మాదిరిగా నాకు ఓ రకమైన మెచ్యురిటీ ఉంది. నాకు ఆయనపై పీకల్లోతు లవ్ ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా నా కెరీర్‌పై ఫోకస్ ఉంది. నా కెరీర్ కోసం నా ప్రేమను త్యాగం చేశాను. ఆ విషయంలో నేను తప్పు చేయలేదని ఇప్పటికీ ఫీలవ్వను. షమ్మీ కపూర్‌తో పెళ్లి కాకపోవడానికి కారణం...మ్యారేజ్ తర్వాత నేను నటిస్తానని అంటే.. ఆయన తండ్రి ఒప్పుకోలేదు. నేను పెళ్లి తర్వాత కూడా నటిస్తానని చెప్పాను. అందుకే వాళ్ల వైపు నుంచి సమ్మతి రాలేదు. అంతే మా లవ్ బ్రేకప్ అయింది. నా కెరీర్‌పై నాకు బాగా ఫోకస్ ఉండేది. ఇప్పటికీ నేను అదే కమిట్‌మెంట్‌తోనే ఉన్నాను. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాల్లో నటించడం ఆపేశారు.

నా ప్రేమను త్యాగం ఎందుకు చేశానంటే?
పెళ్లి తర్వాత భర్తపై భార్యకు, భార్యపై భర్తకు నమ్మకం ఉండాలి. ఒకవేళ చేయాలనుకొంటే.. ఇంటి వెనుక ద్వారం నుంచి వెళ్లి ఇంకోకరితో రొమాన్స్ చేయవచ్చు. ఎవరు ఆపగలరు. ఆ సమయంలో పెళ్లి తర్వాత పని చేయకూడదని పెద్దలు అలా ఆలోచించే వారు. వారి నిర్ణయాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. షమ్మీ కపూర్‌తో నా ప్రేమ ఫలించాలని భగవంతుడు అనుకొంటే.. అది జరిగేది. నేను షమ్మీ కపూర్‌తో ప్రేమలో పడినప్పుడు చాలా చిన్న వయసు. అందరి మాదిరిగా నాకు ఓ రకమైన మెచ్యురిటీ ఉంది. నాకు ఆయనపై పీకల్లోతు లవ్ ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా నా కెరీర్‌పై ఫోకస్ ఉంది. నా కెరీర్ కోసం నా ప్రేమను త్యాగం చేశాను. ఆ విషయంలో నేను తప్పు చేయలేదని ఇప్పటికీ ఫీలవ్వను.

Legendary Heroine Mumtaz

నా భర్తే నాకు సర్వస్వం
నా వయసు 26 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను యాక్టింగ్ వదిలేశాను. పెళ్లైన రెండు సంవత్సరాల తర్వాత నా షూటింగులన్నీ కంప్లీట్ చేసుకొని నటించడం ఆపేశాను. పెళ్లి తర్వాత చాలా సినిమాలు వదులుకొన్నాను. హాథీ మేరీ సాథీ లాంటి సినిమాలను వదిలేశాను. నా పెళ్లి ద్వారా ఎవరూ నష్టపోకూడదని అనుకొన్నాను. అలాగే ఎవరూ కష్టపడకుండా చర్యలు తీసుకొన్నాను. నా భర్త నాకు ఏ లోటు రాకుండా సర్వసంపదలు ఇచ్చారు. నాకు ఇక జీవితంలో ఎలాంటి లోటు లేకపోయింది. మనిషి అన్నాక జీవితంలో శాంతి, సుఖాలు ఎన్నడూ ఉండవు. ఎప్పుడు మనసులో ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి. కానీ నాకు అలాంటి కోరికలు రాకుండా నా భర్త సర్వం కల్పించారు.

More from Filmibeat

Read more about: mumtaz bollywood Shammi Kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X