twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రెహ్మాన్ అలా ఆఫర్ ఇచ్చారు.. సారంగధరియా పాట పాపులర్ చేసింది.. లవ్ స్టోరి మ్యూజిక్ డైరెక్టర్ పవన్

    |

    సినిమా పరిశ్రమ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. మా తాతగారు నాగేశ్వర్ రావు సినిమా ఫోటోగ్రాఫర్. మా నాన్న విజయ్ కుమార్ సినిమాటోగ్రాఫర్. అయితే నాకు మొదట సినిమాల గురించి పెద్దగా ఎంట్రెస్ట్ లేదు. కానీ నాకు ఇండస్ట్రీలో మ్యూజిక్‌తో సంబంధమున్న ఫ్రెండ్స్ ఉన్నారు అయితే వారితో నేను స్టూడియోలోకి వెళ్లి రికార్డింగ్స్‌ చూసి కొన్ని నేర్చుకొన్నాను. ఓ సారి నేను ర్యాప్ సాంగ్ రికార్డ్ చేసి మా ఇంట్లో చూపించాను. అప్పుడు మ్యూజిక్ నేర్చుకొంటావా అని అడిగితే అవునని చెప్పాను. దాంతో నన్ను చెన్నైలోని ఏఆర్ రెహమాన్ ఇన్సిట్యూట్‌లో చేర్పించారు అని సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ తెలిపారు.

    మ్యూజిక్ కాలేజీలో చేరిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ ఉన్న విభాగంలో ఎంచుకోవచ్చు. అలా నేను కంపోజర్‌గా ఉండేందుకు ఇష్టపడి ఆ విభాగాన్ని ఎంచుకొన్నాను. అయితే అక్కడ ఉన్న ఫారిన్ కోచ్‌ల నుంచి చాలా నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. అప్పుడు ఏడాది కాలం కృషి చేసి నేను ఒకరకమైన సాండ్‌ను గుర్తించాను. ఆ సమయంలో రెహమాన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఒక షో చూడటానికి రెహమాన్ వచ్చి ఆ మ్యూజిక్ ఎవరని తెలుసుకొని నన్ను డిన్నర్‌కు ఆహ్వానించారు. ఆ తర్వాత నేను ఒక ఆల్బమ్ తయారుచేసి పంపిస్తే.. తాను నాకు ఆఫర్ ఇచ్చారు. ఆయనతో కలిసి సచిన్, శ్రీదేవి మూవీ, సర్కార్, రోబో చిత్రాలకు పనిచేశాను అని పవన్ సీహెచ్ అన్నారు.

    Love Story music Director Pawan Ch about his life journey with AR Rahman

    రెహమాన్ వద్ద పనిచేసే సమయంలో నాకు ఒక రూమ్ ఇచ్చారు. రెహమాన్ సార్ వద్ద చాలా సంగీత పరికరాలు ఉన్నాయి. అవి మనకు ఇచ్చేస్తారు. ఆయన వద్ద ఇండియాలోనే అరుదైన మ్యాడుల్యర్ సింగ్త్ అనే పరికరం ఉంది. అయితే ఎవరూ దానిని ఉపయోగించలేదు. రెండు నెలలు దానిని నేర్చుకొని మ్యూజిక్ నేర్చుకొన్నాను. ఆ తర్వాత ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి పనిచేశాను అని పవన్ సీహెచ్ తెలిపారు.

    నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయాలని డిసైడ్ అయినప్పుడు రెహమాన్ నాకు ఒక్క విషయం చెప్పారు. మీకు నచ్చిన పని మీరు చేయండి. స్క్రిప్టు నచ్చితేనే చేయండి. ఏ సినిమాకు పడితే ఆ సినిమాను ఒప్పుకోకండి అని చెప్పారు. ఆ తర్వాత ఫిదా సినిమాకు శేఖర్ కమ్ములతో పనిచేయడానికి ట్రై చేశాను. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పుడు లవ్ స్టోరి సినిమాకు అవకాశం ఇచ్చారు అని పవన్ సీహెచ్ తెలిపారు. శేఖర్ కమ్ముల షూటింగులకు నేను ఎక్కువ వెళ్లలేదు. నేను డాలర్ డ్రీమ్స్, హ్యాపీ డేస్ సినిమా షూటింగుకు మాత్రమే వెళ్లాను అని చెప్పారు.

    లవ్ స్టోరి సినిమా కథ రాసేటప్పుడు సారంగధర పాటను ముందుగానే వినిపించారు. ఈ పాటలో క్వాలిటీ లేదు. మొత్తం రివైజ్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఆ పాటను రికార్డ్ చేయడం, ఆ తర్వాత వివాదం చుట్టుకోవడం జరిగింది. అయితే ఆ వివాదం సమయంలో నాకు తెలియలేదు. నేను చెన్నైలో ఉండటం వల్ల నాకు పూర్తిగా తెలియలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది.

    Love Story music Director Pawan Ch about his life journey with AR Rahman

    లవ్ స్టోరి సినిమా ఒక ఎమోషనల్, ఇంటెన్స్, డెప్త్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి శేఖర్ గారు మాకు చెప్పిన విషయం ఒకటే పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి. అంతకంటే ఇంకేం వద్దు అన్నారు. నేను ప్రతి పాటను పూర్తి శాటిశ్వై అయ్యే దాకా రీచెక్ చేసుకుని శేఖర్ కమ్ముల గారికి పంపేవాడిని. ఆయన పాటల కంపోజిషన్ లో ఇచ్చిన గైడెన్స్ అద్భుతం. ప్రతి పాట సందర్భం, దాని నేపథ్యం, పాట పాటర్న్ ఎలా ఉండాలి..ఇలా ప్రతి విషయం మీద శేఖర్ గారికి చాలా స్పష్టత ఉంది అని పవన్ సీహెచ్ తెలిపారు.

    ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ సంగీతం చాలా ఇష్టపడతాను. ఆయన పుష్ప సినిమాలో చేసిన పాట నాకు బాగా నచ్చింది. అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ బాగుంటుంది. పెళ్లి చూపులు మ్యూజిక్ విని ఇన్ స్పైర్ అయ్యాను. లాక్‌డౌన్ లో మా లవ్ స్టోరి సినిమా విడుదల వాయిదా పడటం కొంత ఫ్రస్టేషన్ కలిగించింది. ఒక మూడ్ లో అందరం పనిచేసుకుంటూ వచ్చాం. కానీ మా పనికి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం అని పవన్ సీహెచ్ అన్నారు.

    నా మొదటి సినిమాకే మంచి పాపులారిటీ వచ్చింది. నేను కంపోజ్ చేసిన మూడు, నాలుగు పాటలు వైరల్ అయ్యాయి. అదంతా శేఖర్ కమ్ముల సార్ విజన్ వల్లే ఈ గుర్తింపు లభించింది. నేను ఏదైనా పాట కంపోజ్ చేస్తే.. శేఖర్ సార్‌కు పంపిస్తాను. ఆయన చూసి, విన్న వెంటనే చాలా బాగుందిరా అంటూ మెచ్చుకొంటారు అని పవన్ సీహెచ్ చెప్పారు.

    English summary
    Pawan Ch is upcoming music director. he get huge appreciation for Love Story movie. This movie is set to release on September 24th. In this occassion, He speaks to media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X